Nuvvula Barfi: భోగి సంక్రాంతికి నువ్వుల బర్ఫీని ఇలా చేయండి, ఈ పండుగకు నువ్వుల రెసిపీ ఖచ్చితంగా తినాల్సిందే-nuvvula barfi recipe in telugu know how to make this sweet for sankranti ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Nuvvula Barfi: భోగి సంక్రాంతికి నువ్వుల బర్ఫీని ఇలా చేయండి, ఈ పండుగకు నువ్వుల రెసిపీ ఖచ్చితంగా తినాల్సిందే

Nuvvula Barfi: భోగి సంక్రాంతికి నువ్వుల బర్ఫీని ఇలా చేయండి, ఈ పండుగకు నువ్వుల రెసిపీ ఖచ్చితంగా తినాల్సిందే

Haritha Chappa HT Telugu
Jan 09, 2025 03:30 PM IST

Nuvvula Barfi: సంక్రాంతికి నువ్వులతో చేసిన ఆహారాలు తినడం ఆరోగ్యానికి మంచిదని చెబుతారు. ఇక్కడ మేము నువ్వుల బర్ఫీ రెసిపీ ఇచ్చాము, ప్రయత్నించండి.

నువ్వుల బర్ఫీ రెసిపీ
నువ్వుల బర్ఫీ రెసిపీ

సంక్రాంతికి తినాల్సిన ఆహారాలలో నువ్వులతో చేసినవి ప్రధానమైనవి. ఎక్కువగా నువ్వుల లడ్డూలు చేసుకునే తినేందుకే ఇష్టపడతారు. ఎప్పుడూ నువ్వుల ఉండలే కాదు ఒకసారి నువ్వుల బర్ఫీని తయారు చేయండి. నువ్వుల లడ్డు కొంచెం గట్టిగా ఉండొచ్చు. నువ్వులు బర్ఫీ మాత్రం చాలా రుచిగా నోట్లో పెడితే కరిగిపోయేలా ఉంటుంది. ఈ నువ్వుల బర్ఫీ రెసిపీని ఎలాగో తెలుసుకోండి.

yearly horoscope entry point

నువ్వుల బర్ఫీ రెసిపీకి కావలసిన పదార్థాలు

తెల్ల నువ్వులు - ఒక కప్పు

బెల్లం తురుము - ముప్పావు కప్పు

నెయ్యి - పావు కప్పు

యాలకుల పొడి - పావు స్పూను

బాదం తరుగు - ఒక స్పూను

పిస్తా తరుగు - ఒక స్పూను

జీడిపప్పు తరుగు - ఒక స్పూను

నువ్వుల బర్ఫీ రెసిపీ

1. నువ్వుల బర్ఫీని నోట్లో పెట్టుకుంటేనే కరిగిపోయేలా తయారు చేయవచ్చు.

2. ఇందుకోసం మీరు స్టవ్ మీద కళాయి పెట్టి నువ్వులను వేసి వేయించండి. తర్వాత తీసి పక్కన పెట్టుకోండి.

3. ఇప్పుడు అదే కళాయిలో నెయ్యిని వేసి కరిగించండి.

4. ఆ నెయ్యిలోనే బెల్లం తురుమును వేసి బాగా కలుపుకోవాలి. పావు కప్పు నీళ్లను వేసి బెల్లాన్ని బాగా కలిపి మరగనివ్వాలి.

5. ఇది పలుచని పాకం వచ్చేవరకు మరుగుతూనే ఉండాలి.

6. ఈలోపు నువ్వులను మిక్సీలో వేసి పొడిలా చేసుకోవాలి.

7. ఆ నువ్వుల పొడిని ఈ బెల్లం పాకంలో వేసి బాగా కలుపుతూ ఉండాలి. చిన్న మంట మీద దీన్ని ఉడికించాలి.

8. ఈ మొత్తం మిశ్రమం బర్ఫీలాగా దగ్గరగా అయ్యేదాకా కలపాలి.

9. యాలకుల పొడిని కూడా అందులో వేసి బాగా కలుపుకోవాలి.

10. ఇప్పుడు ఒక ప్లేటుకు కింద నెయ్యిని రాసి అందులో ఈ నువ్వుల మిశ్రమాన్ని వేసి గరిటతో సమానంగా వచ్చేలా పరచాలి.

11. ఇప్పుడు జీడిపప్పుల తరుగు, బాదం పప్పులు తరుగు, పిస్తాలు తరుగును పైన చల్లి ఓసారి గరిటతో గట్టిగా నొక్కాలి.

12. తర్వాత అది గట్టిపడే వరకు వదిలేయాలి. చాకుతో ముక్కలుగా కోసుకొని వాటిని గాలి చొరబడని డబ్బాల్లో వేసి దాచుకోవాలి.

13. అంతే టేస్టీ నువ్వుల బర్ఫీ రెడీ అయినట్టే. దీని నోట్లో పెడితే కరిగిపోయేలా ఉంటుంది. నువ్వుల లడ్డు కన్నా ఈ నువ్వుల బర్ఫీ కొత్తగా రుచిగా ఉంటుంది.

సంక్రాంతి నాడు నువ్వులు, బెల్లం కలిపి చేసే వంటకాలను స్నేహితులు బంధువులకు షేర్ చేసుకుంటే మంచిది. సంక్రాంతి నాడు ఇలా నువ్వుల రెసిపీని పంచుకొని తినడం వల్ల ఎంతో మేలు జరుగుతుంది. ఒకసారి ఈ నువ్వుల బర్ఫీని ప్రయత్నించి చూడండి. మీకు కచ్చితంగా నచ్చుతుంది.

Whats_app_banner