Collagen Rich Foods: కొల్లాజెన్ సహజంగా పెంచేందుకు న్యూట్రషనిస్ట్ చెప్పిన 5 మార్గాలివే-nutritionist shares 5 ways to naturally boost collagen in less than a month ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Collagen Rich Foods: కొల్లాజెన్ సహజంగా పెంచేందుకు న్యూట్రషనిస్ట్ చెప్పిన 5 మార్గాలివే

Collagen Rich Foods: కొల్లాజెన్ సహజంగా పెంచేందుకు న్యూట్రషనిస్ట్ చెప్పిన 5 మార్గాలివే

HT Telugu Desk HT Telugu
Dec 26, 2024 03:01 PM IST

Collagen Rich Foods: కొల్లాజెన్ మానవ శరీరంలో అత్యధికంగా లభించే ప్రోటీన్. ఇది శరీర కణాలను ఒకదానితో ఒకటి అతుక్కుని ఉంచే కనెక్టివ్ టిష్యూ వంటిది. కణజాలాలకు బలం సాగే స్థితిని అందిస్తుంది. సహజంగా కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచడానికి ఇక్కడ 5 మార్గాలు ఉన్నాయి.

వృద్ధాప్యం చేరువయ్యేందుకు కొల్లాజెన్ ఉత్పత్తి తగ్గుతుంది
వృద్ధాప్యం చేరువయ్యేందుకు కొల్లాజెన్ ఉత్పత్తి తగ్గుతుంది (Pexels)

కొల్లాజెన్ శరీర కణాలను ఒకదానితో ఒకటి అతుక్కుని ఉంచే కనెక్టివ్ టిష్యూ ప్రధాన భాగం. కొల్లాజెన్ చర్మం, ఎముకలు, కండరాలు, టెండన్లు, లిగమెంట్లలో ఉంటుంది. ఇది ఈ కణజాలాలకు బలం, సాగే స్థితిని అందిస్తుంది. చర్మ ఆరోగ్యం, కీళ్ల ఆరోగ్యం, ఎముకల ఆరోగ్యం, కండరాల పరిమాణాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఇది వాపును తగ్గించడంలో, ప్రేగుల ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కూడా సహాయపడుతుంది.

yearly horoscope entry point

కొల్లాజెన్ ఉత్పత్తి లోపిస్తే

వయస్సుతో పాటు కొల్లాజెన్ ఉత్పత్తి సహజంగా తగ్గుతుంది. ఇది ముడతలు, కీళ్ల నొప్పులు, ఇతర వయస్సుకు సంబంధించిన సమస్యలకు దారితీస్తుంది. కొల్లాజెన్ సప్లిమెంట్లు కొల్లాజెన్ స్థాయిలను పెంచడంలో, ఈ పరిస్థితులను మెరుగుపరచడంలో సహాయపడతాయి.

ఆహారమే కీలకం

చర్మం, కండరాలు, ఎముకలు, స్నాయువులు, ఇతర బంధన కణజాలాలను నిర్మించేది కొల్లాజెన్. మంచి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి కొల్లాజెన్ అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం చాలా ముఖ్యం. అయితే, వయస్సు పెరిగే కొద్దీ, శరీరం తగినంత కొల్లాజెన్ ఉత్పత్తిని ఆపివేస్తుంది. ఇది ముడతలు, చారలు, సన్నని గీతలు మరింత స్పష్టంగా కనిపించడానికి దారితీస్తుంది.

న్యూట్రిషనిస్ట్ చెప్పిన చిట్కాలు

న్యూట్రిషనిస్ట్ సిమ్రన్ చోప్రా తన ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్లో ఆరోగ్యానికి సంబంధించిన చిట్కాలు క్రమం తప్పకుండా పంచుకుంటుంది. శరీరంలో సహజంగా కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచే మార్గాలపై సిమ్రన్ ఇటీవల ఒక వీడియోను పంచుకున్నారు.

కొల్లాజెన్ శరీరంలో సమృద్ధిగా ఉండే ప్రోటీన్ ఎందుకంటే ఇది కండరాలు, ఎముకలు, స్నాయువులు, రక్త నాళాలు, జీర్ణవ్యవస్థ.. ఇలా అన్నీ దీనిని ఉపయోగించుకుంటాయి. మీరు తగినంత ప్రోటీన్ తీసుకోవడం ద్వారా కొల్లాజెన్ ఉత్పత్తి అవుతుంది.. " అని ఆమె రాశారు.

"మనం పెద్దయ్యాక, తక్కువ, అలాగే తక్కువ నాణ్యత కలిగిన కొల్లాజెన్ తయారు చేస్తాం. ఇది మన గీతలు, ముడతలను పెంచుతుంది, స్థితిస్థాపకత కోల్పోవడం వల్ల చర్మం వదులుగా ఉంటుంది. కాబట్టి, మీరు సప్లిమెంట్లను కొనడానికి పరిగెత్తే ముందు, సహజ మార్గాలను ప్రయత్నించండి" అని సిమ్రన్ ఐదు చిట్కాలను పంచుకున్నారు.

కొల్లాజెన్ ఉత్పత్తికి విటమిన్ సి

విటమిన్ సి శరీరంలో సహజంగా ఉత్పత్తి అవదు. కొత్తిమీర, ఎరుపు రంగు గల, ఆకుపచ్చ రంగు గల బెల్ పెప్పర్స్, క్యాప్సికమ్ తినడం వల్ల విటమిన్ సి ఆహారంలో చేర్చడానికి వీలవుతుంది. చర్మానికి విటమిన్ సి సీరమ్ కూడా సహాయపడుతుంది.

జిన్సెంగ్ టీ

జిన్సెంగ్ టీలో యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి ఆక్సీకరణ ఒత్తిడి నుండి కాపాడుకోవడంలో సహాయపడతాయి. ఇది ఇన్‌ఫ్లమేషన్ నివారించడంలో, రంధ్రాలను తొలగించడంలో సహాయపడుతుంది. చర్మాన్ని యవ్వనంగా ఉంచుతుంది.

యాంటీఆక్సిడెంట్ అధికంగా ఉండే ఆహారాలు

గ్రీన్ టీ, బ్లూబెర్రీస్, దాల్చిన చెక్క వంటి వాటిలో యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉంటుంది. ఇవి శరీరంలో సహజంగా కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచడానికి, యవ్వనంగా కనిపించడానికి సహాయపడతాయి.

రెటినోల్స్, ఇతర కెరోటినాయిడ్లు

ఇవి విటమిన్ ఎ ఉత్పన్నాలు. చర్మ ఆరోగ్యాన్ని, అలాగే కొల్లాజెన్ ఉత్పత్తిని మెరుగుపరచడంలో సహాయపడతాయి. విటమిన్ ఎ అధికంగా ఉండే ఆహారాల్లో చిలగడదుంప, బచ్చలికూర, గుమ్మడికాయ, క్యారెట్లు, చేప నూనె, జంతువుల కాలేయం ముఖ్యమైనవి. వీటిని మీ రోజువారీ ఆహారంలో చేర్చుకోవడం ద్వారా విటమిన్ ఎ అందుతుంది. తద్వారా కొల్లాజెన్ ఉత్పత్తిలో సహాయపడుతుంది.

(నిరాకరణ: ఈ వ్యాసం సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. వృత్తిపరమైన వైద్య సలహాకు ప్రత్యామ్నాయం కాదు. వైద్య పరిస్థితి గురించి ఏవైనా ప్రశ్నలతో ఎల్లప్పుడూ మీ వైద్యుడి సలహా తీసుకోండి.)

Whats_app_banner