ప్రముఖ పోషకాహార నిపుణురాలు నేహా పరిహార్ జూన్ 14న తన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో "10-15 కిలోల బరువు తగ్గాలంటే పస్తులు ఉండాల్సిన అవసరం లేదు. ఖరీదైన పౌడర్లు వాడక్కర్లేదు. రెండు గంటల పాటు వర్కవుట్లు చేయాల్సిన పనీ లేదు" అని స్పష్టం చేశారు. "మీ శరీరానికి వ్యతిరేకంగా కాకుండా, దానికి అనుకూలంగా పనిచేసే ఒక విధానం బరువు తగ్గడంలో నిజంగా ఉపయోగపడుతుంది..’ అని ఆమె అంటున్నారు.
బరువు తగ్గాలనుకునేవారు కొన్ని ఆహారాలను తినకుండా ఆంక్షలు పెట్టుకోవడం లేదా వాటికి భయపడటం మానేసి, పోషకాలు నిండిన ఆహారాలను తీసుకోవడంపై దృష్టి పెట్టాలని నేహా సూచించారు. "ఆహారం తినడానికి.. భయపడటానికి కాదు" అంటూ కొన్ని ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలను ఆమె తన పోస్ట్‌లో పంచుకున్నారు. మీ బరువు తగ్గించే ప్రణాళికలో ఇవి ఉండాలంటూ ఆమె కొన్ని ఆహారాల జాబితా సూచించారు.
ఈ ఆహారాలను మీ రోజువారీ ఆహారంలో చేర్చుకోవడం ద్వారా, మీ శరీరానికి పోషణ అందించి, మీ ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవచ్చు. ఆంక్షలు పెట్టుకోవడం కంటే ఆరోగ్యకరమైన అలవాట్లను అలవర్చుకోవడంపై దృష్టి పెట్టడం వల్ల దీర్ఘకాలికంగా, సానుకూలంగా ఆరోగ్యంగా ఉండవచ్చని నేహా అంటున్నారు. ఈ అలవాట్లను నిర్మించుకోవడం ద్వారా ఆహారం, వ్యాయామం, మీ శరీరం పట్ల మంచి సంబంధాన్ని పెంచుకోవచ్చు.
నేహా "చేసుకోవాల్సిన అలవాట్లు – మిమ్మల్ని మీరు కష్టపెట్టుకోవద్దు" అంటూ ఒక జాబితాను పంచుకున్నారు.
హార్మోన్ల సమతుల్యతకు, బరువు తగ్గడానికి మీ ఆహారంలో చేర్చుకోవాల్సిన మూలికల గురించి కూడా నేహా చెప్పారు. ఈ సహజసిద్ధమైన పదార్థాలను శతాబ్దాలుగా వివిధ సంప్రదాయ వైద్యాలలో, వంటలలో వాడుతున్నారు.
వాటి గురించి మాట్లాడుతూ, నేహా "స్పియర్‌మింట్, దాల్చినచెక్క, పసుపు, అల్లం, అశ్వగంధ - ఇవన్నీ మీ శరీరంతో సహజంగా కలిసి పనిచేసి మంటను తగ్గిస్తాయి, ఆకలి కోరికలను అదుపు చేస్తాయి. జీవక్రియను మెరుగుపరుస్తాయి" అని వివరించారు.
కొన్ని సప్లిమెంట్లు సరైన రీతిలో, సరైన పరిస్థితులలో వాడినప్పుడు ప్రయోజనకరంగా ఉంటాయని నేహా వివరించారు. "అవసరమైనప్పుడు మాత్రమే సప్లిమెంట్లను వాడండి. మెగ్నీషియం, జింక్, ఇనోసిటాల్ (ముఖ్యంగా PCOS ఉన్నవారికి), ఒమేగా-3లు, విటమిన్ డి - ఇవన్నీ సరైన పద్ధతిలో వాడినప్పుడు బరువు తగ్గడానికి సహాయపడతాయని శాస్త్రీయంగా నిరూపితమైంది" అని ఆమె వివరించారు.
సప్లిమెంట్లు సమతుల్య ఆహారం, ఆరోగ్యకరమైన జీవనశైలికి తోడుగా ఉండాలి, వాటికి ప్రత్యామ్నాయంగా కావు. అంతేకాకుండా, సప్లిమెంట్లను వాడాలనుకున్నప్పుడు, అవి అవసరమా కాదా అని తెలుసుకోవడానికి, మందులతో ఏమైనా చర్యలు ఉంటాయోమో చర్చించడానికి వైద్య నిపుణులను సంప్రదించడం చాలా ముఖ్యం.
(పాఠకులకు గమనిక: ఈ వ్యాసం కేవలం సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహాకు ప్రత్యామ్నాయం కాదు. ఏదైనా ఆరోగ్య సమస్యలపై మీకు ప్రశ్నలు ఉంటే ఎల్లప్పుడూ మీ వైద్యుడి సలహా తీసుకోండి.)