కృత్రిమ వెలుతురు నుంచి ఒకేసారి చాలా పనులు చేయడం వరకు, మన ఒత్తిడిని పెంచే కొన్ని విషయాలు ఉన్నాయి. వీటిని మనం 'కార్టిసాల్ ట్రిగ్గర్స్' అంటాం. కార్టిసాల్ అంటే 'ఒత్తిడి హార్మోన్' అని కూడా అంటారు. దీని స్థాయిలు పెరిగితే మనకు తీవ్రమైన ఒత్తిడి కలుగుతుంది. అయితే, మన రోజువారీ అలవాట్లు, జీవనశైలి ఎలా సైలెంట్‌గా కార్టిసాల్ స్థాయిలను పెంచుతాయో చాలా మంది గుర్తించరు.
జూన్ 1న న్యూట్రిషన్ కోచ్ టామ్ నిక్కోలా ఇన్‌స్టాగ్రామ్‌లో ఒత్తిడి గురించి ఒక పోస్ట్ పెట్టారు. "దీర్ఘకాలికంగా కార్టిసాల్ స్థాయిలు ఎక్కువగా ఉంటే మీరు అలసిపోయినట్లుగా, చికాకుగా అనిపిస్తుంది. ఇది మెటబాలిజం, మానసిక స్థితి, జ్ఞాపకశక్తి, హార్మోన్లను దెబ్బతీస్తుంది. పొట్ట చుట్టూ కొవ్వు పెంచుతుంది. కండరాలను బలహీనపరుస్తుంది. ఆసక్తిని తగ్గిస్తుంది. నిద్రను పాడు చేస్తుంది. సెరోటోనిన్, డోపమైన్ వంటి సంతోషాన్నిచ్చే మెదడు రసాయనాలను అదుపు తప్పిస్తుంది" అని టామ్ ఒత్తిడి శరీరంపై చూపించే ప్రభావం గురించి వివరించారు.
ఫోన్ మోగేటప్పుడు లేదా వైబ్రేట్ అయినప్పుడు వచ్చే శబ్దాలు, ఏదో ఒక పని చేయాలనో, ఏదో ప్రమాదం ఉందనో మనసును ఆందోళనకు గురి చేస్తాయి. మనం వెంటనే స్పందించకపోయినా, మన నాడీ వ్యవస్థ దానికి ప్రతిస్పందిస్తుంది.
తక్కువ స్థాయిలో బ్యాక్‌గ్రౌండ్ నాయిస్, అంటే కూలర్ సౌండ్ లేదా ట్రాఫిక్ శబ్దం వంటివి ఒత్తిడిని కలిగించగలవు.
ఉదయం పూట మనకు సహజమైన సూర్యరశ్మి దొరకనప్పుడు, పగటిపూట కృత్రిమ లేదా LED లైట్ల వెలుతురు మన శరీరం యొక్క కార్టిసాల్ లయను దెబ్బతీస్తుంది.
ఒకటి కంటే ఎక్కువ పనులు ఒకేసారి చేస్తే పనులు తొందరగా అయిపోతాయని అనుకుంటాం. కానీ అది మనసులో ఒక రకమైన గందరగోళాన్ని సృష్టిస్తుంది.
సోషల్ మీడియాలో ఎదో చూస్తున్నామని తెలియకుండా స్క్రోల్ చేస్తూ పోతే, అది శరీరంలో కార్టిసాల్ స్థాయిలను పెంచడం, తగ్గించడం వంటివి చేస్తుంది.
మనపై ప్రభావం చూపడం లేదని మనం అనుకున్నా, 5 నిమిషాల పాటు భయానక వార్తలను చూడటం కొన్ని గంటల పాటు మన కార్టిసాల్ స్థాయిలను ప్రభావితం చేస్తుంది.
నిశ్చల జీవనశైలి రక్తంలో చక్కెర స్థాయిలను ప్రభావితం చేస్తుంది. కీళ్లలో ఒత్తిడిని సృష్టిస్తుంది. అలాగే కార్టిసాల్ స్థాయిలను కూడా దెబ్బతీస్తుంది.
దీర్ఘకాలికంగా విసుగు, సృజనాత్మక ఉత్సాహం లేకపోవడం మానసిక ఒత్తిడికి దారితీస్తుంది.
గ్రూప్‌లో ఇతరులు పంపిన టెక్ట్స్ మెసేజ్‌లతో సామాజికంగా కనెక్ట్ అయి ఉండాలని, అప్‌డేట్‌గా ఉండాలని మెదడు ఒత్తిడికి గురవుతుంది.
మనం నిద్రపోతున్నప్పుడు వైర్‌లెస్ సిగ్నల్స్‌కు నిరంతరం గురికావడం మెదడు యొక్క కార్యకలాపాలను ప్రభావితం చేస్తుంది.
మనం ఎక్కువ మోటివేషనల్ కంటెంట్, హజిల్ కల్చర్ రీల్స్‌కు గురైనప్పుడు, మెదడు వాటిని ప్రమాదాలుగా అర్థం చేసుకుంటుంది. మనం తగినంత కృషి చేయడంలేదని భావిస్తాం.
(పాఠకులకు గమనిక: ఈ ఆర్టికల్ కేవలం సమాచారం కోసమే. ఇది నిపుణులైన వైద్య సలహాకు ప్రత్యామ్నాయం కాదు. ఏదైనా ఆరోగ్య సమస్య గురించి మీకు ఏమైనా ప్రశ్నలు ఉంటే ఎల్లప్పుడూ మీ డాక్టర్‌ను సంప్రదించండి.)
టాపిక్