nothing phone: మెుబైల్ లవర్స్‌కు బ్యాడ్‌న్యూస్..పెరిగిన నథింగ్ ఫోన్ ధర.. ఎంతంటే?
Nothing Phone 1 price: నెల రోజుల క్రితం భారత మార్కెట్లో విడుదలైన స్మార్ట్‌ఫోన్ సంచలనం నథింగ్ ఫోన్ (1) ధర పెరిగింది. మూడు స్టోరేజ్ వేరియంట్‌ల ధర రూ.1,000.లు పెంచారు.
స్మార్ట్‌ఫోన్ సంచలనం నథింగ్ ఫోన్ (1)కి భారతదేశంలో మెుదట మిశ్రమ స్పందన లభించగా.. క్రమంగా ఈ ఫోన్‌కు డిమాండ్ పెరుగుతుంది. తాజాగా ఫోన్ అమ్మకాలు పెరిగాయి. డిమాండ్ దృష్ట్యా నథింగ్ ఫోన్ (1) ధరను కూడా పెంచారు. ఈ మేరకు నథింగ్ కంపెనీ ఇండియా జనరల్ మేనేజర్ మను శర్మ ప్రకటన జారీ చేశారు. విడుదల చేసిన మూడు స్టోరేజ్ వేరియంట్‌ల ధర రూ .1,000లు పెంచారు . హఠాత్తుగా పెరిగిన ధర ఈ డియాండ్‌పై ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాలి. పెంచిన ధరల ప్రకారం, భారతదేశంలో నథింగ్ ఫోన్ (1) 8GB RAM + 128GB స్టోరెజ్ ఆప్షన్ ధర రూ . 33,999గా ఉంది. 8GB RAM + 256GB స్టోరేజ్ ఆప్షన్ ధర రూ . 36,999గా ఉండగా 12GB RAM + 256GB స్టోరేజ్ ఆప్షన్ ధర రూ . 39,999 ఉంది.
ఈ ఫోన్ ఫీచర్లను పరిశీలిస్తే ఇందులో 6.55 అంగుళాల ఫుల్ హెచ్‌డి ప్లస్ డిస్‌ప్లే ఉంది . ఈ డిస్ప్లే 1,080 x 2,400 పిక్సెల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 120Hz అడాప్టివ్ రిఫ్రెష్ రేట్ సామర్థ్యం కలిగి ఉంటుంది . ఇది శక్తివంతమైన Qualcomm Snapdragon 778G+ SoC ప్రాసెసర్‌తో పనిచేస్తుంది . ఇది ఆండ్రాయిడ్ 12 సపోర్ట్‌తో పని చేస్తుంది .
నథింగ్ ఫోన్ (1) డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది . మొదటి కెమెరాలో 50 మెగా పిక్సెల్ సోనీ IMX766 సెన్సార్ ఉంది . ఇది EIS ఇమేజ్ స్టెబిలైజేషన్‌తో పాటు OISతో వస్తుంది . ఈ ఫోన్‌లోని రెండవ కెమెరా 50 మెగా పిక్సెల్ Samsung JN1 సెన్సార్‌ను కలిగి ఉంది . ఇది EIS ఇమేజ్ స్టెబిలైజేషన్ , 114- డిగ్రీ ఫీల్డ్ ఆఫ్ వ్యూ , మాక్రో మోడ్‌ను కలిగి ఉంటుంది . అలాగే 16 మెగా పిక్సెల్ సోనీ IMX471తో సెన్సార్ సామర్థ్యం ఉన్న సెల్ఫీ కెమెరా ఉంది.
ఇది 4500mAh కెపాసిటీ బ్యాటరీని కలిగి ఉంది . 33W వైర్డ్ ఛార్జింగ్ , 15W Qi వైర్‌లెస్ ఛార్జింగ్‌తో పాటు 5W రివర్స్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది . అయితే ,ఈ ఫోన్ ఛార్జర్ లేకుండానే వస్తుంది. టైప్-సి ఛార్జింగ్ కేబుల్ మాత్రమే అందించబడుతుంది.
సంబంధిత కథనం