Chips Bhel Recipe: అనుకోకుండా వచ్చిన అతిథులకు ఏం పెట్టాలో అర్థం కావడం లేదా? చిప్స్‌తో ఇలా భేల్ తయారు చేసి పెట్టండి!
Chips Bhel Recipe: అనుకోకుండా ఇంటికి ఎవరైనా వచ్చినప్పడు వారి కోసం స్పెషల్ ఏదైనా చేయాల్సి ఉంటుంది. త్వరగా తయారయ్యే రుచికరమైన పదార్థమైతే మరీ మంచిది. ఇంట్లో ఉండే చిప్స్‌తోనే క్షణాల్లో తయారు చేయగల రెసిపీని మీకోసం తీసుకొచ్చాం. అదే చిప్స్ భేల్. దీన్ని ఎలా తయారో ఇక్కడ తెలుసుకోండి.
చాలా సార్లు ఇంటికి అనుకోకుండా అతిథులు వస్తారు. అలాంటప్పుడు వారితో సమయం గడపాలా లేదా వంటగదిలో 'స్నాక్స్ తయారు చేయాలా అని అర్థం కాదు. ఈ సందిగ్ధతకు పరిష్కారంగా ఇంట్లో ఎప్పుడూ ఉండే చిప్స్‌తో క్షణాల్లో తయారయ్యే రెసిపీని మీ కోసం తీసుకొచ్చాం. అదే చిప్స్ భేల్. అతిథుల కోసం ప్యాకెట్ చిప్స్‌తో కొన్ని నిమిషాల్లోనే రుచికరమైన భెల్‌ను తయారు చేసి టీతో పాటు వారికి ఇవ్వండి. కచ్చితంగా ఇంప్రెస్ అవుతారు. దీన్ని ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం.

చిప్స్ భేల్ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు:
- ఒక ఉల్లిపాయ
- ఒక టమాటా
- పచ్చిమిర్చి
- నిమ్మరసం
- దోసకాయ
- క్యాప్సికం
- స్వీట్ కార్న్
- ప్యాకెట్ చిప్స్
- చీజ్
చిప్స్ భెల్ తయారీ విధానం
-ముందుగా ఒక గిన్నెలో ప్యాకెట్ చిప్స్ తీసుకోండి. ఇవి కాకుండా మీ ఇంట్లో ఉన్న ఏ క్రిస్పీ ఐటెమ్స్ అయినా పరవాలేదు.
- తరువాత ఉల్లిపాయ, టమాటాలను చాలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని చిప్స్ లో వేయండి.
-పచ్చిమిర్చి కూడా కట్ చేసి చిప్స్‌లో వేిసి బాగా కలపండి.
-ఇప్పుడు పైన నిమ్మరసం లేదా ఆమ్‌చూర్ పౌడర్ చల్లుకోండి.
-ఇందులోనే చీజ్‌ను సన్నగా తురుముకుని వేయండి.
- దీంట్లోనే మీ ఇంట్లో మిక్స్చర్ నమ్‌కీన్ లేదా బూందీ కూడా కలిపి బాగా కలపండి.
-సమయం ఉంటే, చిన్న ముక్కలుగా తరిగిన క్యాప్సికం, స్వీట్ కార్న్ లను కూడా ఇందులో కలపండి.
అంతే రుచికరమైన చిప్స్ భేల్ రెడీ అయినట్టే. దీన్ని అతిథులకు అందించండి. ఇది త్వరగా తయారవడమే కాదు.. తినడానికి కూడా చాలా రుచిగా ఉంటుంది. కచ్చితంగా మీ అతిథులకు నచ్చుతుంది. మీరు కూడా సరదాగా సాయంత్రం పూట ఏమీ తోచనప్పుడు చేసుకుని తినచ్చు.
సంబంధిత కథనం