జీవనశైలి వ్యాధుల్లో హైబీపీ ముఖ్యమైనది. చెడు ఆహారం, శారీరక శ్రమ లేకపోవడం, ఒత్తిడితో కూడిన జీవితం హైబీపీకి కారణాలు కావచ్చు. ప్రస్తుతం ఎంతోమంది చిన్న వయసులోనే హైబీపీతో ఇబ్బంది పడుతున్నారు.
వాస్తవానికి అధిక రక్తపోటు ఇప్పుడు సాధారణ వ్యాధిగా మారింది. కానీ దాని తీవ్రతను తక్కువగా అంచనా వేయలేము. సకాలంలో చికిత్స చేయకపోతే భవిష్యత్తులో గుండెపోటు, మూత్రపిండాల వైఫల్యం, స్ట్రోక్ వచ్చే అవకాశాలు గణనీయంగా పెరుగుతాయి.
హైబీపీ అనేది జీవనశైలి వ్యాధిగా మారిపోయింది. మీ జీవనశైలిలో కొన్ని మార్పులు చేయడం ద్వారా దీనిని అదుపులో పెట్టుకోవచ్చు. హైబీపీకి కారణమయ్యే ఆహారంగా ఉప్పునే చెప్పుకుంటారు. ఉప్పు తగ్గిస్తే చాలు రక్తపోటు తగ్గుతుందని అనుకుంటారు. నిజానికి ఉప్పు వల్లే కాదు కొన్ని రకాల ఇతర ఆహారాల వల్ల కూడా హైబీపీ పెరిగే అవకాశం ఉంది.
స్థూలకాయం నుంచి హైబీపీ వరకు అన్నింటికీ ప్రాసెస్డ్ ఫుడ్సే కారణం. మీకు ఇష్టమైన ప్యాకేజీ బ్యాండ్ నూడుల్స్, చిప్స్, స్నాక్స్, బిస్కెట్లు, పాస్తా వంటివి తినడంలో అధిక రక్తపోటు పెరుగుతుంది. వాటిలో సోడియం, ట్రాన్స్ ఫ్యాట్స్, ప్రిజర్వేటివ్స్ అధికంగా ఉంటాయి. ఇవి హైబీపీకి నేరుగా కారణమవుతాయి. అటువంటి పరిస్థితిలో, మీకు కూడా హైబీపీ సమస్య ఉంటే, మీరు వీటిని తక్కువగా తీసుకోవాల్సిన అవసరం ఉంది.
మీరు అధిక రక్తపోటుతో పోరాడుతుంటే, మీ ఆహారం నుండి ఎక్కువ వేయించిన ఆహారాన్ని తగ్గించండి. పకోడీలు, సమోసాలు, పిజ్జాలు, బర్గర్లు వంటి ఆహారం ఎంత టేస్టీగా ఉన్నా ఆరోగ్యానికి మంచిది కాదు. వీటిలో ట్రాన్స్ ఫ్యాట్ ఎక్కువగా ఉంటుంది. ఇది రక్తపోటును పెంచుతుంది. వీటితో పాటు ఉప్పు, పిండి, నూనె, మసాలా దినుసులు అధిక మోతాదులో ఉండటం వల్ల బీపీని పెంచేస్తాయి.
ఇంట్లో తయారుచేసినా లేదా మార్కెట్లో కన్నా కూడా ఊరగాయలు అతిగా తింటే రక్తపోటును పెంచుతాయి. ఇందులో నూనె, ఉప్పు లేదా వెనిగర్ ఎక్కువగా ఉంటాయి. ఇవన్నీ రక్తపోటును పెంచుతాయి. ముఖ్యంగా రోజూ ఊరగాయలు తింటుంటే బీపీ మేనేజ్మెంట్ లో కష్టంగా మారుతుంది.
ప్రతి ఇంట్లో అప్పడాలు, వడియాలు ఉంటాయి. వాటిలో కూడా సోడియం స్థాయిలు చాలా ఎక్కువగా ఉంటాయి. అప్పడాలు అధికంగా తింటే క్రమంగా బీపీ పెరగడానికి కూడా కారణమవుతుంది.
ఉప్పు తినడం వల్లే రక్తపోటు పెరుగుతుందని ఎక్కువగా భావిస్తారు. అయితే షుగర్ ఎక్కువగా తినడం వల్ల కూడా బీపీ పెరగడానికి కారణమవుతుందని నిపుణులు చెబుతున్నారు. చాక్లెట్, స్వీట్లు లేదా మరే ఇతర బేకరీ వస్తువు వంటి తీపి పదార్థాలు ఎక్కువగా తిన్నప్పుడు, ఇన్సులిన్ స్థాయి వేగంగా పెరుగుతుంది. దీనివల్ల సిరలు బిగుసుకుపోయి బీపీ పెరగడం మొదలవుతుంది. స్వీట్లు ఎక్కువగా తింటే హైబీపీ వచ్చే అవకాశాలు రెట్టింపు అవుతాయని నిపుణులు చెబుతున్నారు.
(గమనిక: ఈ సమాచారం పూర్తిగా నమ్మకాలు, గ్రంథాలు, వివిధ మాధ్యమాలపై ఆధారపడి ఉంటుంది. సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా సమాచారాన్ని ఆమోదించే ముందు నిపుణులను సంప్రదించండి.)
టాపిక్