అందమైన బహుమతులు, క్యాండిల్ లైట్ డిన్నర్లు కాదు.. అమ్మాయిలకు నచ్చాలంటే అబ్బాయిలు ఇలా ఉండాలి-not beautiful gifts candlelight dinners this is what boys should be like if girls want them to like them ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  అందమైన బహుమతులు, క్యాండిల్ లైట్ డిన్నర్లు కాదు.. అమ్మాయిలకు నచ్చాలంటే అబ్బాయిలు ఇలా ఉండాలి

అందమైన బహుమతులు, క్యాండిల్ లైట్ డిన్నర్లు కాదు.. అమ్మాయిలకు నచ్చాలంటే అబ్బాయిలు ఇలా ఉండాలి

Haritha Chappa HT Telugu

సాధారణ పెళ్లిళ్లతో పోలిస్తే ఇప్పుడు ప్రేమ పెళ్లిల్లే అధికంగా అవుతున్నాయి. ప్రేమించుకునే జంటలు ఎల్లప్పుడూ ఒకరినొకరు సర్‌ప్రైజ్‌లు ఇచ్చుకుంటూ తమ ప్రేమను బయటపెట్టాలని చూస్తారు. అయితే అమ్మాయిలకు ఎలాంటి విషయాలు నచ్చుతాయో తెలుసుకోండి.

అమ్మాయిలు కోరుకునేది ఏమిటి? (Pixabay)

ప్రేమలో ఎప్పుడూ అబ్బాయిలు.. అమ్మాయిలకు ఖరీదైన బహుమతులు ఇచ్చి వారిని సర్‌ప్రైజ్ చేయాలని చూస్తారు. ఒకప్పుడు బహుమతులకు అమ్మాయిలు పడేవారు కానీ.. ఇప్పుడు అమ్మాయిలు ఎంతో మారారు. అందమైన బహుమతులు, క్యాండిల్ లైట్ డిన్నర్లు, లగ్జరీ కార్లలో ప్రయాణాలకు వారు సంతోషించడం లేదు. వారికి నచ్చేలా అబ్బాయిలు చిన్న చిన్న ఆనందాలను ఇస్తే చాలు, వారు భావోద్వేగపరంగా కనెక్ట్ అయిపోతారు.

సర్వే ప్రకారం

బంబుల్ ఇండియా అనే డేటింగ్ సైట్ ఇటీవల ఒక సర్వేను నిర్వహించింది. దీనిలో 61 శాతం మంది అమ్మాయిలు ప్రేమలో పడిన తర్వాత చిన్న చిన్న ఆనంద క్షణాలే తమకు ముఖ్యమని చెప్పారు. భాగస్వామి చేసే చిన్న చిన్న పనులే తమ హృదయాన్ని గెలుచుకుంటాయని వివరించారు. అతని నుంచి ఖరీదైన బహుమతులు, ఫైవ్ స్టార్ హోటల్లలో విందును తాము కోరుకోవడం లేదని అన్నారు.

రిలేషన్ షిప్ నిపుణులు ఈ సర్వే గురించి మాట్లాడుతూ చిన్నప్పటినుంచి అమ్మాయిలను సిండ్రెల్లా వంటి యువరాణి కధలు వింటూ పెరుగుతారని, వారి ఊహల్లో అలాంటి ఒక సొంత ప్రపంచం ఉంటుందని వివరిస్తున్నారు. ఆమె ఎవరైనా తనను యువరాణిలా చూస్తే చాలు ఎంతో పొంగిపోతుందని నిపుణులు చెబుతున్నారు. భాగస్వామితో కలిసి వర్షంలో తడవడం, బయట టీ కొట్టు దగ్గర నిలుచుని కాసేపు వేడి వేడి వేడి టీ తాగడం, జోకులు చెప్పుకోవడం, కవితల రాసుకోవడం, కలిసి పానీపూరీలు తినడం.. వంటి చిన్న చిన్న విషయాలే అమ్మాయిలను ఎక్కువ ఆనంద పరుస్తాయని వివరిస్తున్నారు.

అమ్మాయిలే రొమాంటిక్

అబ్బాయిలతో పోలిస్తే అమ్మాయిలే చాలా రొమాంటిక్ అని ఎన్నో అధ్యయనాలు కూడా చెబుతున్నాయి. రొమాంటిక్ పుస్తకాలు చదవడం, రొమాంటిక్ సినిమాలు చూడటానికి అబ్బాయిలు కంటే అమ్మాయిలే ఎక్కువ ఆసక్తిగా చూపిస్తారు. సినిమాల్లోలాగే తమ జీవితంలో కూడా తమను మహారాణిల చూసుకునే, గౌరవించే మనిషి రావాలని కోరుకుంటారు. చిన్న చిన్న క్షణాలనే ప్రత్యేకంగా చూసే వ్యక్తి తమ జీవిత భాగస్వామి కావాలని ఆశిస్తారు.

దీనికి హార్మోన్లే కారణం

ఇలా మహిళలు చిన్న చిన్న ఆనందాలని కోరుకోవడానికి వారిలోని హార్మోన్లే కారణమని మానసిక శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ప్రతి మనిషి మెదడులో భావోద్వేగాలను నియంత్రించే వ్యవస్థ ఉంటుంది. ఈ వ్యవస్థ పరిమాణం పురుషుల కంటే స్త్రీలలో పెద్దదిగా ఉంటుంది. అందుకే వారు త్వరగా భావోద్వేగాలకే గురవుతారు. ప్రేమ హార్మోన్ గా పిలిచే ఆక్సిటోసిన్ స్త్రీలలో అధికంగా విడుదలవుతుంది. అందుకే వారు చాలా రొమాంటిక్‌గా కూడా ఉంటారు.

ప్రేమ బంధంలో గడిపిన చిన్న చిన్న క్షణాలే జంటలను ఒకరికొకరు దగ్గర చేస్తాయి. కలిసి వాకింగ్ చేయడం, కలిసి తినడం, కలిసి పుస్తకాలు చదువుకోవడం వంటి చిన్న చిన్న పనులే వారి మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ ఏర్పడకుండా అడ్డుకుంటాయి. దీనివల్ల ఒకరితో ఒకరు ఎక్కువ సమయాన్ని గడుపుతారు. వారి బంధం మరింత బలపడుతుంది. అంతేకాదు ఆ బంధంలో నిజాయితీ, గౌరవం కూడా ఉంటాయి. ఒక అబ్బాయి దగ్గర డబ్బు తక్కువగా ఉన్నా కూడా అతడు చిన్న చిన్న క్షణాలను తమతో ఆనందంగా పంచుకుంటే చాలు... అమ్మాయిలు జీవితాంతం అతనితో సంబంధాన్ని సంతోషంగా కొనసాగిస్తారు.

హరిత హిందూస్తాన్ టైమ్స్‌లో చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్లో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, తెలుగు సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్‌వర్క్‌లలో పని చేశారు. ప్రింట్, డిజిటల్ జర్నలిజంలో 17 ఏళ్ల అనుభవం ఉంది. 2023 డిసెంబరు నుంచి హిందూస్థాన్ టైమ్స్‌లో ఆస్ట్రాలజీ, లైఫ్‌స్టైల్ సెక్షన్ల బాధ్యతలు చూస్తున్నారు. లింక్టిన్ లో కనెక్ట్ అవ్వండి.