వేసవిలో ప్రతి ఇంట్లోనూ ఏసీ వాడతారు. ఉదయం పూట అవసరం లేెకపోయినా… రాత్రి పూట కచ్చితంగా వేసుకుంటారు. రాత్రి నిద్ర ఎంతో అవసరం అందుకే ఏసీ రాత్రి వాడేవారే సంఖ్యే ఎక్కువ. ఏసీ నుంచి నీరు కారడం అందరికీ తెలిసిందే. ఆ నీటిని తిరిగి ఎలా వాడలో ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి.
వేసవిలో వడదెబ్బ ప్రమాదం నుంచి కాపాడడంలో కూడా ఏసీ సహాయపడుతుంది. ఎండలో బయట నుంచి ఇంటికి వచ్చిన వారికి తక్షణ చల్లదనం అందించడంలో ఏసీ అద్భుతంగా పనిచేస్తుంది. దీని వల్ల వారి శరీరం వేడెక్కకుండా ఉంటుంది.
చల్లని గాలి మండే వేడి, వడదెబ్బ ప్రమాదం నుండి రక్షించడమే కాకుండా వ్యక్తి మనస్సును ప్రశాంతంగా ఉంచడానికి సహాయపడుతుంది. ఏసీ బటన్ ఆన్ చేసిన వెంటనే, దాని యూనిట్ నుండి నీరు కారడం ప్రారంభమవుతుంది, దీనిని కండెన్సేట్ వాటర్ అంటారు. సాధారణంగా ప్రజలు ఈ నీటిని నిరుపయోగంగా పారేస్తారు. మీరు కూడా అలాగే చేస్తున్నారా? ఏసీ నీటిని అలా వదిలేసే కన్నా సులభంగా ఇంటి పనులకు వాడుకోవచ్చు. వేసవిలో చాలా చోట్ల నీటి ఎద్దడి ఉన్నప్పుడు ఏసీ నీటిని ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం.
ఏసీ నీరు స్వేదనజలం. ఇది మొక్కలకు నీరు పెట్టడానికి ఉపయోగపడుతుంది. ఈ నీరు సురక్షితమైనది. మొక్కలకు ప్రయోజనకరంగా ఉంటుంది. వేసవిలో మొక్కలకు నీరు అధికంగా అవసరం. ప్రతిరోజూ పోయాల్సి వస్తుంది. కాబట్టి ఏసీ వాటర్ కారే కింద బకెట్ పెట్టండి.
ఫ్లోర్లు, కిటికీలు లేదా బాత్రూమ్ లను శుభ్రం చేయడానికి ఏసీ నీటిని ఉపయోగించవచ్చు. ఈ నీరు మంచిదే, కాబట్టి ఇది ఉపరితలంపై ఎటువంటి మరకలను శుభ్రం చేస్తుంది. ఈ ఏసీ నీటిలో ఎలాంటి దుమ్మూ ధూళి, మట్టి వంటివి ఉండవు. కాబట్టి మీరు నీటిని ఉపయోగించుకోవచ్చు.
ఏసీ నీటిని బయటపడేసే బదులు ఎయిర్ కూలర్ లోకి పోసుకోవచ్చు. ఈ నీరు శుభ్రమైనది. కూలర్ సామర్థ్యాన్ని కూడా పెంచుతుంది. మీ కారు లేదా బైక్ ను కడగడానికి కూడా ఏసీనీ నీటిని తిరిగి ఉపయోగించవచ్చు.
ఏసీ నుంచి వచ్చే నీటిని టాయిలెట్ ట్యాంక్ లో నిల్వ చేసి ఫ్లషింగ్ కు ఉపయోగించవచ్చు. నీటిని పొదుపు చేయడానికి ఇది ఒక గొప్ప మార్గం.
ఏసీ నీటిని వేస్టుగా పడేయడం వల్ల ఏమీ రాదు. ఇలా తిరిగి వినియోగిస్తే నీటిని పొదుపు చేసినవారవుతారు.
టాపిక్