Banana Peel: ముఖంపై అరటి తొక్కను ఇలా రుద్దితే చాలు బ్యూటీ పార్లర్ అవసరం ఉండదు, మెరుపు ఖాయం
అరటి తొక్క కొత్త బొటాక్స్? బ్యూటీ ఇన్ఫ్లుయెన్సర్ ప్రకారం, మీ చర్మంపై రుద్దడం వల్ల పొడిబారిన చర్మం బిగుతుగా మారుతుంది. మీరు తెలుసుకోవలసిన ప్రతిదీ ఇక్కడ ఉంది.
అందాన్ని పెంచుకునే చిట్కాల కోసం అమ్మాయిలు వెతుకుతూనే ఉంటారు. ముఖ్యంగా ఇంట్లోనే పాటించే చిట్కాలు ఎక్కువ మందికి నచ్చుతాయి. తక్కువ ఖర్చుతోనే చర్మాన్ని మెరిపించుకోవడాన్ని ఇష్టపడతారు మహిళలు. బ్యూటీ పార్లర్ కు వెళితే వందల్లో ఖర్చులు కావడం కష్టం. చక్కగా ఇంట్లోన అరటితొక్కతో చర్మాన్ని మెరిపించవచ్చు.
అరటి తొక్కలు చర్మంపై ఉన్న ముడతలను తగ్గిస్తాయని శాస్త్రీయంగా ఎలాంటి ఆధారాలు లేవు. కానీ అరటి తొక్క చర్మం అద్భుతంగా పనిచేస్తుందని దాన్ని వాడిన వారు మాత్రం చెబుతున్నారు. మీ ముఖంపై అరటి తొక్కను రుద్దడం బొటాక్స్ కు ప్రత్యామ్నాయం కావచ్చు. అయితే, అరటి తొక్కలు బొటాక్స్ మాదిరిగా పనిచేస్తాయని సోషల్ మీడియా వినియోగదారులు కూడా చెబుతున్నారు.
ఆయుర్వేద సంప్రదాయాల స్ఫూర్తితో అమ్ము బ్యూటీ బ్రాండ్ వ్యవస్థాపకురాలు ఆరీఫా ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన వీడియోలో అరటి తొక్క అద్భుతంగా పనిచేస్తుందని ఆమె చెప్పింది. ఆమె చెప్పిన ప్రకారం అరటితొక్కతో ముఖంపై రుద్దితే చర్మాన్ని ప్రకాశవంతం చేయడానికి, సన్నని రేఖలు, ముడతలు, మొటిమలు వంటివి తగ్గడానికి అద్భుతంగా పనిచేస్తుందని ఆమె చెప్పింది.
ఆమె చెప్పిన ప్రకారం వారంలో కనీసం మూడు నాలుగు సార్లు అరటి తొక్కతో ముఖంపపై రుద్ది పది నిమిషాలు అలా వదిలేయాలి. తరువాత గోరువెచ్చని నీటితో ముఖాన్ని శుభ్రపరుచుకోవాలి. ఇలా చేయడం వల్ల ముఖం మంచిగా శుభ్రపడుతుందని ఆరీఫా చెబుతోంది.
అరటి తొక్కలలో పాలీఫెనాల్స్, విటమిన్లు ఎ, బి, సి, ఇ, యాంటీఆక్సిడెంట్లు వంటి ప్రయోజనకరమైన సమ్మేళనాలు ఉంటాయి. ఇవి తేలికపాటి, తాత్కాలిక చర్మ ప్రయోజనాలను అందిస్తాయి. అయితే ఇలా అరటితొక్కతో ముఖంపై స్క్రబ్బింగ్ చేయడాన్ని కొంతమంది వ్యతిరేకిస్తున్నారు.
అరటి పండ్లను ఇప్పడు వాణిజ్యపరంగా రసాయనాలు చల్లుతున్నారు. దీని వల్ల అరటి తొక్కపై పురుగుమందుల అవశేషాలను కలిగి ఉండే అవకాశం ఉంది. డాక్టర్ ప్రవీణ్ బానోద్కర్ మాట్లాడుతూ, "ఈ పురుగుమందులు ఉన్నతొక్కలను నేరుగా మీ చర్మానికి పూయడం మంచిది కాదు’ అని చెప్పారు. కాబట్టి సేంద్రియ పద్ధతిలో పెంచిన అరటి పండ్ల తొక్కలనే ఇందుకు వాడాలి.
యాంటీ ఏజింగ్ చికిత్స కావాలంటే అర్హత కలిగిన చర్మవ్యాధి నిపుణుడిని సంప్రదించండి, వారు సురక్షిత మైన పద్ధతులను సిఫారసు చేస్తారు.