Friday Motivation: ఎంత బాధలో ఉన్నా ముఖం మీద నవ్వును చెదరనివ్వకండి.. సంతోషానికి మూలమంత్రం ఇదే- సద్గురు-no matter how much you are sad dont loose the smile this is the key to your happiness sadhguru quotes ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Friday Motivation: ఎంత బాధలో ఉన్నా ముఖం మీద నవ్వును చెదరనివ్వకండి.. సంతోషానికి మూలమంత్రం ఇదే- సద్గురు

Friday Motivation: ఎంత బాధలో ఉన్నా ముఖం మీద నవ్వును చెదరనివ్వకండి.. సంతోషానికి మూలమంత్రం ఇదే- సద్గురు

Ramya Sri Marka HT Telugu

Monday Motivation: ఏడిస్తే కష్టం పోతుందా? మొహం మాడ్చుకుని కూర్చుంటే బాధ తీరుతుందా? మరి ఎందుకు ఏడవాలి? ఎందుకని ఎప్పుడూ చింతిస్తూ కూర్చోవాలి. ఎంత కష్టం వచ్చినా నవ్వుతూ ఎదుర్కొన్నారంటే సంతోషం దానంతట అదే వస్తుంది. సద్గురు చెప్పిన ఈ 7 సూత్రాలను పాటించారంటే ఆనందాన్ని ఎవరూ పాడు చేయలేరు.

సంతోషంగా ఉండటానికి సద్గురు చెప్పిన 7 సూత్రాలు (shutterstock)

గజిబిజితో కూడిన జీవితంలో చాలా మంది నవ్వడం మర్చిపోతున్నారు. వాళ్ల మీద వాళ్లు శ్రద్ధ చూపించుకోవడమే మానేస్తున్నారు. అదేంటని అడిగితే ప్రపంచంలో ఎవరికీ లేని సమస్యలు వారికే ఉన్నట్లు, అందరికన్నా అతి పెద్ద సమస్యతో వారు ఇబ్బందు పడుతున్నట్లు ఫీలవుతున్నారు. ఎప్పుడూ బాధపడుకుంటూ, ఏదో ఒక విషయం గురించి చింతిస్తూ జీవితాన్ని గడిపేస్తున్నారు. ఇది చాలా పెద్ద పొరపాటనీ సంతోషంగా ఉండటం ప్రతి వ్యక్తి ప్రాథమిక హక్కు అని సద్గురు చెబుతున్నారు. ఎల్లప్పుడూ బాధపడుతూ, చింతిస్తూ ఉండేవారి కోసం ఆయన కొన్ని సూచనలు ఇచ్చారు.

వీటిని పాటిస్తే జీవితంలో ఎన్ని ఇబ్బందుకు వచ్చినప్పటికీ ముఖంలో చిరునవ్వు చెదరిపోదని చెబుతుూ.. “నిజానికి సంతోషం అనేది ప్రతి వ్యక్తికి ప్రాథమిక అవసరం లేదా లక్ష్యం. తాను ఎంత డబ్బు సంపాదించినా అది అతను, అతని కుటుంబ సభ్యులను సంతోషంగా ఉంచుకోవడానికే. అలాగని కానీ విలాసవంతమైన జీవితం, సౌకర్యాలు మాత్రమే ఉంటే మానవులు ఎవరూ సంతోషంగా ఉండలేరు. ఇవన్నీ శారీరకంగా ఆనందాన్ని ఇవ్వగలవు, కానీ మానసికంగా సంతోషపెట్టలేవు. ఇందుకు కారణం వ్యక్తి మనసు. మనస్సు ఆనందంగా ఉన్నప్పడు మాత్రమే వ్యక్తి ముఖంలో ఎప్పుడూ చిరునవ్వుతో వెలిగిపోతుంది." అన్నారు. మనసును సంతోషంగా ఉంచుకోవడం కోసం ఆయన 7 సూత్రాలను తెలిపారు. ఇదే సంతోషాని మూలమంత్రం అన్నారు.

సంతోషంగా ఉండటం కోసం సద్గురు చెప్పిన 7 సూత్రాలు..

1. సంతోషంగా ఉండటం ఒక అవసరం

సంతోషంగా ఉండటం అనేది జీవితంలో ఒక ఛాయిస్ మాత్రమే కాదు..ఇది ప్రతి వ్యక్తికీ ప్రాథమిక అవసరం. ఆనందం లేకుండా జీవితం సాగదు. కాబట్టి ముందుగా మీరు సంతోషంగా బతకాలనే ఆలోచనతో ఉండండి. నిత్యం ఆనందంగా ఉండే వ్యక్తిగా మారడానికి ప్రయత్నించండి.

2. పని కంటే పర్సనల్ హ్యాపినెస్ ముఖ్యం

మీరు ఏ పని చేసినా, వ్యాపారం చేసినా మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే.. అన్నిటికంటే ముఖ్యమైనది మీ మానసిక సంతోషం. ఎందుకంటే మీరు చేసే ప్రతి పని సంతోషంగా ఉండటం కోసమే. కనుక ఆ పని చేస్తున్నప్పుడు కూడా హ్యాపీగానే ఉండండి. ఆనందంగా ఉండటాన్ని మీ ముఖ్యమైన స్వభావంగా మార్చుకోండి.

3. చిన్న చిన్న విషయాలే కదా అని తీసి పారేయకండి

మీరు రోజువారీ జీవితంలో ఎదుర్కొనే విషయాలకు మీ చుట్టుపక్కల వాతావరణానికి, వస్తువులకీ ప్రాధాన్యత ఇవ్వండి. మీ దగ్గరున్న వాటికి ధన్యవాదాలు చెప్పినప్పుడు మీరు సంతోషంగా ఉండటం సులభం అవుతుంది. మీరు ఉదయం లేవగానే రోజంతా చేయాల్సిన వాటి గురించి బాధపడకుండా చేసినవి, మీ దగ్గర ఉన్నవాటిని తలచుకుని సంతోషపడండి. చేయాల్సినవి, లేని వాటి గురించి తలచుకోవడం వల్ల మీరు బాధపడటమే కాకుండా మీ చుట్టూ ఉన్న వారిని కూడా బాధపెట్టిన వారు అవుతారు. కృతజ్ఞతతో ఉండటం అనేది మానసికంగా సంతోషంగా ఉండటానికి చాలా బాగా సహాయపడుతుంది.

4. సానుకూల విషయాలను మాత్రమే గుర్తుపెట్టుకోండి

ఇతరులు ఏమి అన్నారు, ఏం చేశారు అనే దానిపై దృష్టి పెట్టకండి. అలా చేయడం వల్ల మీరు బాధపడటం తప్ప ఏమీ దక్కదు. ఇలాంటి ప్రతికూల విషయాల మధ్యలో మీ మనసును నలగనివ్వకండి. ప్రతికూలతల్లో కూడా మీ కోసం ఏదైనా సానుకూలతను కనుగొని సంతోషంగా, సంతృప్తిగా ఉండేలా మీ మనసుకు శిక్షణ ఇవ్వండి.

5. ఇతరులతో పోల్చుకోకండి

జీవితంలో సంతోషంగా ఉండాలంటే ఏ విషయంలోనూ ఇతరులతో పోల్చుకోకండి. ఇతరులతో పోల్చుకోవడం వల్ల చాలా మంది ఎక్కువ బాధపడుతున్నారు. ఎల్లప్పుడూ మీ పనిని, మీ పరిస్థితినీ మీతోనే పోల్చుకోండి. ఇంకా మెరుగ్గా చేయడానికి ప్రయత్నించండి. ఇలా ఉండటం వల్ల మీరు సంతోషంగా ఉంటారు.

6. ప్రశాంతంగా ఉండండి

మీరే సంతోషంగా ఉండాలంటే ముందు మీ స్వభావాన్ని మార్చుకోండి. మనసును ప్రశాంతంగా ఉంచుకోవడానికి ప్రయత్నించండి. జీవితంలో వచ్చే చిన్నాచితకా మార్పులకు భయపడి బాధపడుతూ కూర్చోకండి. ఎల్లప్పుడూ నవ్వుతూనే మీ సమస్యకు పరిష్కారం కనుగొండి. అప్పుడే మీకు సంతోషం లభిస్తుంది.

7. సంతోషాలను పంచుకోండి

సంతోషంగా ఉండటంతో పాటు, మీ సంతోషాన్ని ఇతరులతో పంచుకోవడం కూడా అవసరం. మీరు ఇతరులతో పంచుకున్నప్పుడు మీ సంతోషం రెట్టింపు అవుతుంది. బదులుగా ఇతరుల నుంచి మీకు సంతోషం లభిస్తుంది. అంతా ఆనందమయంగా మారుతుంది.

Ramya Sri Marka

eMail
రమ్య శ్రీ మార్క హిందుస్థాన్ టైమ్స్‌లో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్. జర్నలిజంలో 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉన్న ఆమె లైఫ్ స్టైల్, ఆస్ట్రాలజీ వార్తలు రాయడంలో ప్రత్యేకత కలిగి ఉంది. కాకాతీయ యూనివర్సిటీలో జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ పట్టా పొందారు. గతంలో ఈనాడు, టీన్యూస్, ఈటీవీ భారత్ వంటి సంస్థల్లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు.లింక్డ్‌ఇన్‌లో ఆమెతో కనెక్ట్ అవ్వండి.

సంబంధిత కథనం