​​Niti Aayog jobs: నీతి ఆయోగ్‌లో జాబ్స్.. లక్షకు పైగా జీతం.. పూర్తి వివరాలివే!-niti ayog recruitment 2022 notification out for 28 consultant young professionals posts ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  Lifestyle  /  Niti Ayog Recruitment 2022 Notification Out For 28 Consultant & Young Professionals Posts

​​Niti Aayog jobs: నీతి ఆయోగ్‌లో జాబ్స్.. లక్షకు పైగా జీతం.. పూర్తి వివరాలివే!

HT Telugu Desk HT Telugu
Sep 17, 2022 03:24 PM IST

నీతి ఆయోగ్ కాంట్రాక్ట్ ప్రాతిపదికన పలు పోస్టుల భర్తీకి అర్హులైైన అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వనిస్తుంది. ఎంపికైన అభ్యర్థులకు నెలకు 70 వేల నుండి 1.45 లక్షల రూపాయల వరకు జీతం ఇవ్వబడుతుంది.

NITI Aayog
NITI Aayog

నీతి ఆయోగ్ పలు పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. యంగ్ ప్రొఫెషనల్స్ 22, కన్సల్టెంట్స్ 6 పోస్టులు కలిపి మొత్తం 28 పోస్టులను భర్తీకి ఈ రిక్రూమెంట్ డ్రైవ్ నిర్వహిస్తుంది. ఈ రిక్రూట్‌మెంట్ కాంట్రాక్ట్‌ ప్రతిపాదికగా ఉంటుంది. కాంట్రాక్ట్ పీరియడ్ మొదట్లో రెండేళ్లు ఉంటుంది. అవసరాన్ని బట్టి మూడు సంవత్సరాల పాటు పొడిగించవచ్చు. మొత్తం వ్యవధి 5 సంవత్సరాలకు మించకూడదు. కమిషన్ అధికారిక వెబ్‌సైట్ niti.gov.in ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.

పోస్టుల వివరాలు

కన్సల్టెంట్ - 6 పోస్టులు

గరిష్ట వయో పరిమితి - 45 సంవత్సరాలు.

జీతం - 80 వేల నుండి 1.45 లక్షల రూపాయల వరకు

సైన్స్ / ఎకనామిక్స్ / స్టాటిస్టిక్స్ / ఆపరేషన్స్ రీసెర్చ్ / పబ్లిక్ పాలసీ / డెవలప్‌మెంట్ స్టడీస్ / బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ / మేనేజ్‌మెంట్‌తో పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ లేదా తత్సమాన అర్హత.12వ తరగతి తర్వాత BE/B.Tech లేదా MBBS లేదా LLB లేదా CA లేదా ICWA లేదా ఏదైనా ఇతర నాలుగేళ్ల ప్రొఫెషనల్ అర్హత కలిగిన అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.

విద్యార్హతతోపాటు 3 నుంచి 8 ఏళ్ల పని అనుభవం కూడా ఉండాలి.

యంగ్ ప్రొఫెషనల్స్

జీతం - 70 వేలు

గరిష్ట వయోపరిమితి - 32 సంవత్సరాలు.

సైన్స్ / ఎకనామిక్స్ / స్టాటిస్టిక్స్ / ఆపరేషన్స్ రీసెర్చ్ / పబ్లిక్ పాలసీ / డెవలప్‌మెంట్ స్టడీస్ / బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ / మేనేజ్‌మెంట్‌లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ లేదా తత్సమాన అర్హత.12వ తరగతి తర్వాత BE/B.Tech లేదా MBBS లేదా LLB లేదా CA లేదా ICWA లేదా ఏదైనా ఇతర నాలుగేళ్ల ప్రొఫెషనల్ అర్హత కలిగిన అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.

వయోపరిమితి: కన్సల్టెంట్ పోస్టుకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థి వయస్సు 45 ఏళ్లు మించకూడదు. యంగ్ ప్రొఫెషనల్ పోస్టుకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల గరిష్ట వయస్సు 32 సంవత్సరాలుగా నిర్ణయించారు.

పే స్కేల్: ఎంపికైన అభ్యర్థులకు నెలకు 70 వేల నుండి 1 లక్ష 45 వేల రూపాయల వరకు జీతం ఇవ్వబడుతుంది.

ఎలా దరఖాస్తు చేయాలి

step 1: ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు నీత్ ఆయోగ్ అధికారిక వెబ్‌సైట్ niti.gov.in ద్వారా అప్లై చేసుకోవచ్చు.

step 2: ఆ తర్వాత అభ్యర్థి హోమ్‌పేజీలో వర్క్@పాలసీ ట్యాబ్‌పై క్లిక్ చేయండి.

step 3: ఇప్పుడు కాంట్రాక్ట్ ప్రాతిపదికన నియమించబడిన యంగ్ ప్రొఫెషనల్, కన్సల్టెంట్ గ్రేడ్-I ప్రకటన లింక్‌పై క్లిక్ చేయండి.

step 4: అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తుపై క్లిక్ చేసి, నమోదు చేసి లాగిన్ చేయండి.

step 5: అభ్యర్థి లాగిన్ అయిన తర్వాత అన్ని వివరాలను సమర్పించి. సబ్‌మిట్ చేయండి

WhatsApp channel

సంబంధిత కథనం