Nita Ambani Fitness: నీతా అంబానీ ఫిట్‌నెస్ సీక్రెట్, 61 ఏళ్ల వయసులో కూడా ఇంత ఉత్సాహంగా ఉండటానికి కారణమిదేనట..!-nita ambani fitness video the secret behind her unstoppable enthusiasm even at the age of 61 ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Nita Ambani Fitness: నీతా అంబానీ ఫిట్‌నెస్ సీక్రెట్, 61 ఏళ్ల వయసులో కూడా ఇంత ఉత్సాహంగా ఉండటానికి కారణమిదేనట..!

Nita Ambani Fitness: నీతా అంబానీ ఫిట్‌నెస్ సీక్రెట్, 61 ఏళ్ల వయసులో కూడా ఇంత ఉత్సాహంగా ఉండటానికి కారణమిదేనట..!

Ramya Sri Marka HT Telugu

Neeta Ambani Fitness: నీతా అంబానీ రెగ్యూలర్ ఫిట్‌నెస్ యాక్టివిటీ గురించి వీడియో రిలీజ్ చేశారు. అందులో ఆమె 61ఏళ్ల వయస్సులోనూ తను యాక్టివ్‌గా ఉండేందుకు ఏమేం చేస్తుందో వివరించారు. వయస్సు పైబడుతున్న మహిళలు ఆరోగ్యానికి ఎందుకు ప్రాధాన్యత ఇవ్వాలో చెబుతూ, అలా చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు పంచుకున్నారు.

ఫిట్‌నెస్ పెంచుకోమంటున్న నీతా అంబానీ (Instagram)

నీతా అంబానీ గురించి తెలియని వారుండరు. క్రీడా మైదానంలో, రిలయన్స్ ఈవెంట్లలో చాలా చురుగ్గా పాల్గొంటూ, ఎప్పుడూ యాక్టివ్‌గా కనిపిస్తుంటారు. 61ఏళ్ల వయస్సులోనూ అమితమైన ఉత్సాహంగా వ్యవహరించే నీతా అంబానీ తన ఫిట్‌నెస్ వెనకున్న సీక్రెట్ ఏంటో బయటపెట్టారు. పైగా, అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున శుభాకాంక్షలు తెలియజేస్తూనే ప్రతి ఒక్క మహిళా తమ కోసం ఏదో ఒకటి చేయాలనే ప్రేరణాత్మకమైన వీడియో రిలీజ్ చేశారు.

వీడియోలో నీతా అంబానీ చెప్పిన విషయాలు ఆమె మాటల్లోనే..

మీ గురించి మీరే శ్రద్ధ వహించాలి:

"ప్రతి ఒక్క మహిళ తమ కోసం తాము ఏం చేసుకున్నారో అసలు గుర్తుందా? ఎప్పుడూ ఫ్యామిలీ, బంధువుల గురించి మాత్రమే ఆలోచిస్తూ, మీకు ఇవ్వాల్సిన ప్రాధాన్యతను చివరి స్థానానికి నెట్టేశారు కదా. అలా చేస్తూపోతే, మిమ్మల్ని మీరే పట్టించుకోకపోతే ఇక మీ గురించి ఆలోచించేది ఎవరు. 50 లేదా 60 ఏళ్లు దాటి ఉంటే, మీ ఆరోగ్యం గురించి శ్రద్ధ వహించడం చాలా ముఖ్యం. "

శరీరం క్షీణిస్తూ వస్తుంది:

"30 ఏళ్ల తర్వాత మహిళల్లో చాలా మార్పులు కలుగుతాయి. కండర ద్రవ్యరాశి తగ్గిపోతుంది. వయస్సు పెరిగే కొద్దీ ఇది మరింత వేగంగా క్షీణిస్తూ వస్తుంది. వయస్సు పెరిగే కొద్దీ శరీరంలో మార్పులు జరిగి బలం, మెటబాలిజం తగ్గిపోతుంటాయి. కండరాల శక్తి తగ్గిపోవడం, ఎముకల సాంద్రత, నడక శక్తి తగ్గిపోతాయి. అందుకే మనల్ని మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ముఖ్యంగా 60ఏళ్ల తర్వాత"

వారానికి 6 రోజులు వ్యాయామం చేస్తా:

"నాకు నా కాళ్లంటే బాగా ఇష్టం. ఎందుకంటే 6 సంవత్సరాల వయస్సు నుంచి భరతనాట్యం చేస్తున్నాను. అందుకోసం వర్కౌట్స్ చేసే సమయంలో లెగ్ డేస్ ను బాగా ఇష్టపడతాను. కొన్నిరోజులు శరీరం పైభాగం, కొన్నిసార్లు వెనుకభాగం, కొన్నిసార్లు పూర్తి శరీరంపై దృష్టి పెడుతుంటాను. వారానికి కచ్చితంగా వారానికి కచ్చితంగా 5 నుంచి 6 రోజుల పాటు వ్యాయామం చేస్తుంటాను. సందర్భాన్ని బట్టి వాకింగ్, బాడీ ఫ్లెక్సిబిలీటీ, యోగా, కోర్ స్ట్రెంత్ పెంచే వ్యాయామాలు చేస్తాను. కొన్ని రోజుల ఈతకొడుతూ, నీటిలో ఉండి కూడా వ్యాయామం చేస్తాను. మరికొన్ని రోజులు ఒక గంటసేపు డ్యాన్స్ కూడా చేస్తాను. ఇది నాకు చాలా ఇష్టం. ఒకవేళ ట్రిప్‌లో ఉండి, వ్యాయామం చేసేందుకు ఏమీ దొరకనట్లయితే దాదాపు 5వేల నుంచి 7వేల స్టెప్స్ వేస్తాను"

షుగర్ ఫ్రీ ఫుడ్ మాత్రమే తీసుకుంటా:

శాఖాహారినైన నాకు సమతుల్య ఆహారం తీసుకోవడమే ఇష్టం. సహజమైన ఆర్గానికి ఫుడ్ తీసుకుంటా. అందులో ప్రొటీన్ కూడా ఉంటుంది. కానీ, చక్కెర లేదా దాని ప్రత్యామ్నాయాల నుంచి దూరం ఉంటాను. వ్యాయామం నన్ను రిలాక్స్‌గా ఉంచుతుంది. వ్యాయామం చేసిన తర్వాత మరింత పాజిటివ్ గా అనిపిస్తుంది కూడా. వ్యాయామం తర్వాత శరీరంలో ఆనందం కలిగించే ఎండార్ఫిన్లు ఉత్పత్తి అయి, ఒత్తిడి దూరం అవుతుంది"

ఏ వయస్సులోనైనా బలం అవసరం:

"వ్యాయామం అంటే బరువులు ఎత్తడం మాత్రమే కాదు. ఇది రోజువారీ కార్యకలాపాలకు తగిన శక్తిని అందిస్తుంది. బలవంతంగా వయస్సుతో పోరాడటం మానుకుని, వయస్సుతో పాటు జీవించడం నేర్చుకోండి. మీలో బలం ఉంటే, మిమ్మల్ని ఎవరూ ఆపలేరు. రోజుకు 30 నిమిషాలు, వారానికి 4రోజుల పాటు వ్యాయామం చేయండి. 61ఏళ్ల వయస్సులో నేను చేయగలిగినప్పుడు మీరు చేయలేరా?"

"రండి. మొదటి అడుగువేసి స్ట్రాంగర్ హర్ ఉద్యమంలో భాగం అవ్వండి. ఈ రోజే మీ ఫిటెనెస్ జర్నీ ప్రారంభించండి" అని నీతా అంబానీ పిలుపునిచ్చారు.

61 సంవత్సరాలలోనూ ఆపలేని ఉత్సాహంతో కనిపించిన ప్రేరణాత్మకమైన వీడియో చూస్తే మీకు కూడా అదే ఫీలింగ్ కలుగుతుంది. రోజువారీ జీవనశైలి అలవాట్లు, ఆహారపు అలవాట్లు మార్చుకోలేకపోయినా వ్యాయామం చేస్తూ మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. ముందుగా #StrongHERMovementలో చేరిపోండి.

రమ్య శ్రీ మార్క హిందుస్థాన్ టైమ్స్‌లో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్. జర్నలిజంలో 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉన్న ఆమె లైఫ్ స్టైల్, ఆస్ట్రాలజీ వార్తలు రాయడంలో ప్రత్యేకత కలిగి ఉంది. కాకాతీయ యూనివర్సిటీలో జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ పట్టా పొందారు. గతంలో ఈనాడు, టీన్యూస్, ఈటీవీ భారత్ వంటి సంస్థల్లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు.లింక్డ్‌ఇన్‌లో ఆమెతో కనెక్ట్ అవ్వండి.

సంబంధిత కథనం