Nirmala Seetharaman Budget Saree: బడ్జెట్ రోజున నిర్మలమ్మ కట్టే చీరలకు ప్రత్యేకత ఉంటుంది, ఈ ఏడాది చీర దేనికి సంకేతమంటే!-nirmala seetharaman budget saree nirmala seetharamans sarees tied on budget day are special what is the saree tied ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Nirmala Seetharaman Budget Saree: బడ్జెట్ రోజున నిర్మలమ్మ కట్టే చీరలకు ప్రత్యేకత ఉంటుంది, ఈ ఏడాది చీర దేనికి సంకేతమంటే!

Nirmala Seetharaman Budget Saree: బడ్జెట్ రోజున నిర్మలమ్మ కట్టే చీరలకు ప్రత్యేకత ఉంటుంది, ఈ ఏడాది చీర దేనికి సంకేతమంటే!

Ramya Sri Marka HT Telugu
Feb 01, 2025 11:55 AM IST

Nirmala Seetharaman Budget Saree: నిర్మల సీతారామన్ తన చీర ఎంపికతో మరోసారి స్టైల్ స్టేట్‌మెంట్ ఇచ్చారు. చీర కట్టులోనే కాదు, ఎంపికలోనూ అంతే హుందాతనాన్ని కనబరుస్తుంటారు. ప్రతి బడ్జెట్ లోనూ ప్రత్యేకమైన చీరను ధరిస్తూ సంపన్న సాంస్కృతిక వైభవాన్ని కనబరుస్తుంటారు.

బడ్జెట్ రోజున నిర్మలమ్మ కట్టే చీరలకు ప్రత్యేకత
బడ్జెట్ రోజున నిర్మలమ్మ కట్టే చీరలకు ప్రత్యేకత

భారత ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్, స్వతంత్ర భారతదేశంలో ఏ ఆర్థిక మంత్రి చేయని విధంగా వరుసగా ఎనిమిదో సారి కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టి చరిత్ర సృష్టించారు. ఈ బడ్జెట్‌ను ప్రవేశపెట్టే సమయంలో ప్రత్యేకమైన, హుందాతనమైన చీరను మరోసారి ధరించి స్టైలిష్‌గా కనిపించారు. ఈ ఏడాది బడ్జెట్ 2025 కోసం, ఆమె ట్రెడిషనల్ బంగారు బోర్డర్‌తో అందమైన క్రీమ్ రంగు చీరను ఎంచుకున్నారు, దానికి అపోజిట్ కలర్ అయిన ఎరుపు రంగు బ్లౌజ్‌ను జోడించారు. బంగారు గాజులు, గొలుసు, చెవిపోగులు సహా ఆభరణాలను చాలా మినిమల్‌గా ధరించారు.

yearly horoscope entry point

కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ సింపుల్‌గా, హుందాతనమైన చీరలకే ప్రాధాన్యతనిస్తుంటారు. ప్రత్యేకించి బడ్జెట్ రోజున చీరలను సపరేట్‌గా ఎంపిక చేసుకుంటారు. ఇంకా ప్రతి బడ్జెట్‌లోనూ కట్టిన చీర మరోసారి రిపీట్ చేయకుండా ధరిస్తుంటారు. పైగా ఇవన్నీ కూడా నిర్మలా సీతారామన్‌కు నచ్చిన చేనేత వస్త్రాలే. గత బడ్జెట్ రోజులలో ఎలాంటి చీరలు ధరించారో తెలుసుకుందామా..

నిర్మల మధుబని ఆర్ట్‌తో ప్రత్యేకత

నిర్మల సీతారామన్ రంగురంగుల మధుబని మోటిఫ్‌తో బోర్డర్ ఉన్న చీర, భారతదేశపు సంపన్న సాంస్కృతిక వారసత్వం ప్రతిబింబించేలా ఉంది. మధుబని ఆర్ట్ బిహార్‌లోని మిథిలా ప్రాంతం నుండి వచ్చిన సంప్రదాయ జానపద కళారూపం, ఇది సంక్లిష్ట డిజైన్లు, ఫ్లవర్ డిజైన్లు, ప్రకృతి, పురాణాల చిత్రాల ద్వారా రూపొందించారు. ఈ కళారూపం దాని ప్రకాశవంతమైన రంగులు, సూక్ష్మ రేఖలు, చిహ్న ప్రాతినిధ్యాలకు ప్రసిద్ధిగా మారింది.

మధుబని మోటిఫ్‌తో చీరను ధరించడం ద్వారా, నిర్మల కేవలం ఫ్యాషన్ స్టేట్‌మెంట్ ఇవ్వడమే కాదు, భారతదేశపు సంపన్న సాంస్కృతిక వారసత్వాన్ని ప్రోత్సహిస్తున్న సంకేతాన్ని కనబరిచారు. ఈ సంప్రదాయ కళారూపాన్ని జీవనోపాధిగా కొనసాగించే కళాకారులకు తన మద్దతు పరోక్షంగా ఇస్తున్నట్లు తెలియజేశారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ తన బడ్జెట్ 2025 చీరను మధుబని ఆర్ట్, పద్మ అవార్డీ దులారి దేవి నైపుణ్యానికి నివాళిగా ధరించారని వార్తా సంస్థ ఏఎన్‌ఐ నివేదించింది - ఆమె 2021 పద్మశ్రీ అవార్డీ.

గతంలో ఆమె ధరించిన చీరలు ఇవే

  • 2023 బడ్జెట్ రోజున వయోలెట్ బోర్డర్ తో కూడిన తెలుపు చీరను ధరించారు. హుందాగా, పద్దతిగా, గౌరవప్రదంగా కనిపించారు.
  • 2023 ఫిబ్రవరిలో ఇన్ టెర్మ్ బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు ఆమె నీలి రంగు చీరలో మెరిశారు. ఇది పశ్చిమ బెంగాల్ లో ప్రత్యేక మైన చీర. దీన్ని కాంతా స్టిచ్ శారీ అంటారు. చూసేందుకు ఇది ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది.
  • 2022 బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు నిర్మాలా సీతారామన్ టెంపుల్ బోర్డర్తో ఉన్న ఎరుపు రంగు చీర కట్టుకున్నారు. ఇది కర్ణటకకు చెందిన సంప్రదాయ కసూటి వర్క్ చీర. చేత్తోనే అల్లే ఇల్కల్ సిల్క్ శారీ ఇది.
  • 2022లో ఆమె బ్రౌన్ రంగు చీర ధరించారు. ఇది ఒడిశాకు చెందిన చేనేతవస్త్రకారులు నేసినది. ఒడిశాకు చెందిన సంప్రదాయ చీర ఇది. ఈ చీరను బొమ్కాయ్ చీర అంటారు. ఆమె చేనేత వస్త్రకారులను ఎంతో ప్రోత్సహిస్తారు.
  • 2021 బడ్జెట్కు ఆమె ఎరుపు, తెలుపు కలిసిన పోచం పల్లి చీరను ధరించారు. ఇది ఇక్కత్ చీర. తెలంగాణాలోని భూదాన్ పోచంపల్లికి చెందిన చీర ఇది. ఈ చీరలో ఆమె పెద్దరికంగా, ఆకర్షణీయంగా కనిపించారు.
  • 2020లో బడ్జెట్ కోసం ఆమె పసుపు రంగు చీరను ఎంచుకున్నారు. ఇది సన్నని నీలిరంగు అంచును కలిగి ఉంది. ఈ పసుపు బంగారాన్ని గుర్తు తెచ్చేలా లేత మెరుపుతో ఉంది ఈ చీర. పసుపు శుభకరమైన రంగు. అందుకే ఆమె ఈ సారి బడ్జెట్ కు పసుపు రంగు చీరను ఎంచుకున్నారు.
  • 2019లో ఆమె తొలిసారిగా బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. ఈ కార్యక్రమానికి గులాబీ రంగు చీర, బంగారు అంచు ఉన్న చీరను ఎంపికచేసుకున్నారు. ఇది మంగళగిరి చీర. ఆమె చీరల ఎంపిక చాలా ఉత్తమంగా ఉంటుంది. ముఖ్యంగా చేనేత వస్త్రకారులకు చేయూతనిచ్చే విధంగా ఎంపిక చేసుకుంటున్నారు.

Whats_app_banner