New Year 2025: కొత్త సంవత్సరం ఫిట్ నెస్ మీద ఫోకస్ పెడదామనుకుంటున్నారా.. అమూల్యమైన గుండె కోసం ఐదు వ్యాయామాలివే-new year resolutions for heart health and fitness in 2025 ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  New Year 2025: కొత్త సంవత్సరం ఫిట్ నెస్ మీద ఫోకస్ పెడదామనుకుంటున్నారా.. అమూల్యమైన గుండె కోసం ఐదు వ్యాయామాలివే

New Year 2025: కొత్త సంవత్సరం ఫిట్ నెస్ మీద ఫోకస్ పెడదామనుకుంటున్నారా.. అమూల్యమైన గుండె కోసం ఐదు వ్యాయామాలివే

Ramya Sri Marka HT Telugu
Dec 28, 2024 10:00 AM IST

New Year 2025: కొత్త సంవత్సరం ఫిట్ నెస్ మీద ఫోకస్ పెడదామనుకుంటున్నారా.. కొత్తగా ఎక్సర్‌సైజ్‌లు చేయాలనుకునేవారు కొన్ని విషయాలు తప్పక గుర్తుంచుకోవాలి. ముందుగా గుండెకు సంబంధించిన వ్యాయామాలతో మొదలుపెట్టడం బెటర్.

ఫిట్‌నెస్ కోసం ఎక్సర్‌సైజ్‌లు
ఫిట్‌నెస్ కోసం ఎక్సర్‌సైజ్‌లు (File Photo)

ఏ ఎక్సర్‌సైజ్ చేయాలనుకున్నా వార్మప్ అనేది తప్పనిసరిగా చేయాలి. అదే విధంగా మనం చేసే వ్యాయామం కారణంగా రక్తసరఫరా వేగవంతం అవుతుంది. అదే సమయంలో గుండె అంతే సమర్థవంతంగా పని చేయకపోతే లేనిపోని సమస్యలు ఎదురవుతాయి. అందుకే ముందుగా గుండెపై ఫోకస్ పెట్టి హార్ట్ హెల్త్‌కి సంబంధించిన ఎక్సర్‌సైజ్ లు చేయడం బెటర్.

yearly horoscope entry point

రాబోయే సంవత్సరంలో హెల్త్ గురించి మీరు ఫోకస్ పెడుతున్నప్పుడు గుండె ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు ఆరోగ్యకరమైన లైఫ్ స్టైల్ ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఇది కేవలం ఒక్క ఏడాది కోసమే కాదు ఇలా చేయడం వల్ల కొన్ని సంవత్సరాల పాటు గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. మరి ఇంకెందుకు లేటు కొత్త సంవత్సరం తీర్మానంగా ఫిట్ నెస్ ఎంచుకునే ముందు ఈ విషయాలు గుర్తుంచుకుని ప్రొసీడ్ అయిపోండి. వైద్య నిపుణులు ఇచ్చిన టిప్స్ ఫాలో అవ్వండి.

2025 నూతన సంవత్సరానికి గుండె-ఆరోగ్యకరమైన లక్ష్యాలు

1. చురుకుగా ఉండండి: మెరుగైన గుండె ఆరోగ్యం కోసం, మీరు శారీరకంగా చురుకుగా ఉండేలా చూసుకోండి. మీ రోజూ చేసే పనుల్లో కనీసం 30 నుండి 40 నిమిషాలు పాటు వివిధ వ్యాయామాలు లేదా శారీరక కార్యకలాపాల కోసం కేటాయించండి. నడక, పరుగు, యోగా, ధ్యానం లేదా స్విమ్మింగ్ వంటి వ్యాయామాలు చేయడానికి ప్రయత్నించవచ్చు. ఇది గుండెకు రక్త ప్రసరణను మెరుగుపరచడంలో సహాయపడి గుండెను బలోపేతం చేస్తుంది.

చురుకుగా ఉండండి
చురుకుగా ఉండండి (pexels)

2. బ్యాలెన్స్‌డ్ డైట్ తీసుకోండి: సమయానుకూలంగా తినడంపై దృష్టి పెట్టండి. మీ భోజనంలో కూరగాయలు, పండ్లు, తృణధాన్యాలు, సన్నని ప్రోటీన్లు పుష్కలంగా ఉండాలి. ఈ ఆహారాలు మీ గుండె ఆరోగ్యానికి మంచివి. ఎందుకంటే అవి మీ చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడానికి ధమనులను క్లియర్గా ఉంచడానికి సహాయపడతాయి. ప్రాసెస్ చేసిన లేదా ప్యాకేజీ చేసిన ఆహారాన్ని తినడం వీలైనంత వరకూ పక్కకుపెట్టేందుకే ప్రయత్నించండి.

3. ధూమపానం లేదా మద్యపానం వంటి అలవాట్లను మానుకోండి: ధూమపానం లేదా మద్యపానం వంటి అలవాట్లు మీ గుండె ఆరోగ్యానికి హానికరం. ఇది మీ రక్త నాళాలను తీవ్రంగా దెబ్బతీస్తుంది. ఈ అలవాట్ల ద్వారా వివిధ హృదయ సంబంధ వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుంది. మితిమీరిన మద్యపానం మీ రక్తపోటు స్థాయిలను ప్రభావితం చేస్తుంది, ఫలితంగా రక్తపోటు వస్తుంది. ఈ అలవాట్లను విడిచిపెట్టడం వారి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి తీసుకోగల ఉత్తమ నిర్ణయం.

లైఫ్ స్టైల్ మార్చుకోండి
లైఫ్ స్టైల్ మార్చుకోండి (Pexels)

4. స్ట్రెస్ తగ్గించుకోండి: మీరు ఎదుర్కొనే స్ట్రెస్ మీ హృదయ ఆరోగ్యానికి ఆటంకం కలిగిస్తుంది. ఎక్కువ ఒత్తిడి తీసుకోవడం వల్ల మీ శరీరంలో కార్టిసాల్ స్థాయిలు పెరుగుతాయి. ఇది కాలక్రమేణా మీ గుండెకు ప్రతికూలంగా మారుతుంది. మీ ఒత్తిడి స్థాయిలను నిర్వహించడానికి, నియంత్రించడానికి ప్రత్యేక చర్యలు తీసుకోండి. శ్వాసకు సంబంధించిన వ్యాయామాలు చేయడం వల్ల మీ స్ట్రెస్ లెవల్స్ ‌ను క్రమబద్దీకరించుకోవడానికి సహాయపడుతుంది.

5. రెగ్యులర్ హెల్త్ చెకప్: గుండె ఆరోగ్యాన్ని నిర్లక్ష్యపెట్టకుండా రెగ్యులర్ హెల్త్ చెకప్‌లను ద‌ృష్టిలో ఉంచుకోండి. ఇవి చాలా కీలకమైనవి, ముఖ్యంగా గుండె పనితీరు ఎలా ఉందో తెలుసుకోవడానికి సహాయపడతాయి. తీవ్రమైన సమస్యలు కలిగే అవకాశాలను తగ్గించేందుకు ఇది మీకు సహాయపడుతుంది. మీరు పూర్తిగా బాగున్నాం అనుకుంటున్నప్పటికీ క్రమం తప్పకుండా హెల్త్ చెకప్‌లు చేయించుకుంటూ ఉండండి.

గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల అభిప్రాలయను క్రోడీకరించి మాత్రమే మేము ఈ సూచనలు అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

Whats_app_banner