New Year Party outfit ideas: పార్టీ ఇంట్లోనా, క్లబ్‌లోనా లేక బయటా..? ఎక్కడ అయితే ఎలాంటి డ్రెస్ వేసుకోవాలి?
New Year Party outfit ideas: న్యూ ఇయర్ ఈవెంట్‌కి ఇంకా ఎంతో సమయం లేదు. అన్నీ రెడీగా ఉన్నాయి కానీ ఏం డ్రెస్ వేసుకోవాలో అర్థం కావడం లేదు! అనుకుంటున్నారా? మీరు పార్టీని ఇంట్లో ప్లాన్ చేస్తే ఎలాంటి బట్టలు వేసుకోవాలి? క్లబ్, అవుట్‌డోర్‌లకు వెళితే ఎలా డ్రెస్ చేసుకోవాలో ఇక్కడ కొన్ని ఐడియాస్ ఉన్నాయి.
న్యూ ఇయర్ పార్టీకి ఇంకా తక్కువ సమయం మాత్రమే ఉంది. అన్నీ సిద్దమయ్యాయి.. కానీ ఏం డ్రెస్ వేసుకోవాలో అర్థం కావట్లేదు అనుకుంటున్నారా? కంగారు పడకండి మేము మీకు సహాయం చేస్తాం. మీరు పార్టీ ఇంట్లో ప్లాన్ చేస్తే ఎలాంటి దుస్తులు వేసుకోవాలి, క్లబ్ లేదా అవుట‌్‌డోర్ లలో ప్లాన్ చేసుకుంటే ఎలా డ్రెస్ చేసుకుని వెళ్లాలి వంటి కొన్ని ఐడియాస్ మా దగ్గర ఉన్నాయి. వాటిని ఫాలో అయిపోండి అందరిలోనూ మెరిసిపోండి.
పార్టీ అనగానే సగం టెన్షన్ డ్రెస్సింగ్ గురించే ఉంటుంది. పైగా ఇయర్ ఎండింగ్ కదా. పాత సంవత్సరం నుంచి కొత్త సంవత్సరంలోకి అడుగుపెడుతున్నప్పుడు అందమైన, అకర్షణీయమైన దుస్తులు ధరించడం అనేది చాలా అవసరం. ఇవి పార్టీలో మీరు మరింత యాక్టివ్‌గా, సంతోషంగా ఉండేందుకు దోహదపడతాయి.
న్యూ ఇయర్ పార్టీ ఎక్కడ చేసుకుంటే ఎలా డ్రెస్ చేసుకోవాలి?
మెరిసేలా..
న్యూ ఇయర్ పార్టీ నైట్ టైంలో చేసుకునే వాళ్లు మీరు ఎంచుకునే బట్టలు మెరిసే తళుకులతో, బోల్డ్ కలర్స్‌లో,స్టైలీష్‌గా ఉండేలా ప్లాన్ చేసుకొండి.రాత్రి పూట లైటింగ్ లో కూడా మీరు మెరిసిపోయేలా ఉండాలి, సింపుల్‌గా కనిపించాలి.
సౌకర్యవంతంగా..
న్యూ ఇయర్ పార్టీలో మీరు వేసుకునే బట్టలు మిమ్మల్ని హుందాగా ఉంచేలా ఉండాలి. మీరు పార్టీలో ఆత్మవిశ్వాసంతో,స్వేచ్ఛతో గడిపేలా ఉండాలి.ఇవి కొత్త సంవత్సరాన్ని సంతోషాలతో నింపేందుకు సహాయపడతాయి. అసౌకర్యంగా, వదులుగా, బిగుతుగా ఉండే బట్టలు వేసుకుంటే మీ ఆనందానికి ఆటంకాలు కలిగే ప్రమాదముంది.
ఇంట్లో పార్టీకి..
ఇంట్లో పార్టీ చేసుకునే వారు మంచి లాంజ్వేర్ సెలక్ఠ్ చేసుకుంటే బెటర్. ఆడవారికైనా, మగవారికైనా ఇవి చాలా సౌకర్యవంతంగా ఉంటాయి. రిలాక్సింగ్ ఫీల్ ని తీసుకొస్తాయి. ఆడవారైతే క్రీమ్ లేదా గోల్డ్ లేదా బ్లూ కలర్ లాంజ్ పైజామా, సాలిడ్ స్వెట్‌షర్ట్ వేసుకోవచ్చు. మగవారైతే స్పైకర్, జాగర్, హూడీ వంటివి వేసుకోవచ్చు. బ్లాక్ అండ్ వైట్ లో హాండ్ ప్రింటెడ్ స్వెట్ ష్టర్ట్ కూడా బాగుంటుంది.
క్లబ్ లేదా రెస్టారెంట్లలో..
క్లబ్ లో అయితే..అమ్మాయిలు షెత్ డ్రెస్, వీ నెక్ లైన్ టాప్స్, మిడ్డీలు, లాంగ్ స్లీవ్ బాడీకాన్ మిడ్డీలు వంటి వాటిని సెలక్ట్ చేసుకొండి. మగవారు స్లిమ్ ఫిట్, లైట్ ఫేడ్ స్ట్రెచ్చెబుల్ జీన్స్ వేసుకోవచ్చు. అలాగే లైట్ వెయిట్ లెదర్ జాకెట్, స్లిమ్ ఫిట్ పార్టీ షర్ట్ వేసుకోవచ్చు.
డేటింగ్ ప్లాన్ చేసుకున్న వాళ్లు..
న్యూ పార్టీ ప్రియుడితో డేటింగ్ ప్లాన్ చేసుకుని ఉంటే అసిమ్మెట్రిక్ నెక్ షెత్ మిడ్డీ డ్రెస్ విత్ స్లిట్ లేదా సిల్క్, సాటిన్ వంటి సౌకర్యవంతమైన గౌన్లు, కుర్తీలను, కూల్ టీషర్టులు వేసుకోండి.మగవారు ప్రేయసికి నచ్చేలా స్లిమ్ ఫిట్, లైట్ ఫేడ్ స్ట్రెచ్చెబుల్ జీన్స్, లైట్ కలర్, లైట్ వెయిట్ జాకెట్స్, షర్ట్స్ వేసుకోవచ్చు.
అవుట్ డోర్ పార్టీ కోసం..
ఆడవారు మాక్ క్లాత్ కోట్స్, షెత్ డ్రెస్, మిడీ వింటర్ టాప్స్, రౌండ్ నెక్ బాడీ మ్యాక్సీ డ్రెస్, ఓవర్ కోటెడ్ డ్రెస్సెస్ వేసుకోవడం వల్ల చలిని తట్టుకుని పార్టీని ఎంజాయ్ చేయచ్చు.మగవారు హూడీస్, స్వెట్ షర్ట్, ఫజ్జీ జాకెట్స్, సాలిడ్ ప్యాడెడ్ జాకెట్స్ వేసుకోవచ్చు.