New Year 2025: న్యూ ఇయర్ పార్టీ ఎలా ప్లాన్ చేసుకోవాలో అర్థం కావట్లేదా.. ఈ చిట్కాలు పాటించారంటే ఎంజాయ్ చేయొచ్చు!-new year 2025 not sure how to plan your new year party enjoy with these tips ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  New Year 2025: న్యూ ఇయర్ పార్టీ ఎలా ప్లాన్ చేసుకోవాలో అర్థం కావట్లేదా.. ఈ చిట్కాలు పాటించారంటే ఎంజాయ్ చేయొచ్చు!

New Year 2025: న్యూ ఇయర్ పార్టీ ఎలా ప్లాన్ చేసుకోవాలో అర్థం కావట్లేదా.. ఈ చిట్కాలు పాటించారంటే ఎంజాయ్ చేయొచ్చు!

Ramya Sri Marka HT Telugu
Dec 29, 2024 08:30 AM IST

కొత్త సంవత్సరానికి స్వాగతం ఎలా పలకాలా అని సందిగ్ధంలో ఉన్నారా.. కొద్ది రోజుల్లో రాబోయే ఇయరెండింగ్ నైట్ డిసెంబర్ 31 రోజున ఎలా పార్టీ చేసుకోవాలా అని ఆలోచిస్తున్నారా… రండి మరింత జోష్ ఫుల్ గా ఎంజాయ్ చేయడానికి ఈ చిట్కాలు సిద్ధంగా ఉంచాం.

న్యూ ఇయర్ పార్టీ ఎలా ప్లాన్ చేసుకోవాలో అర్థం కావట్లేదా
న్యూ ఇయర్ పార్టీ ఎలా ప్లాన్ చేసుకోవాలో అర్థం కావట్లేదా

ఏడాది పొడవునా అనుభవించిన పరిస్థితులకు వీడ్కోలు చెబుతూ, కొత్త సంవత్సరానికి మరి కొద్దిరోజుల్లో వెల్‌కమ్ చెప్పబోతున్నాం. ఈ తరుణంలో కొత్త సంవత్సరాన్ని ఎలా ఎంజాయ్ చేద్దాం. సంవత్సరం చివరి రోజైన డిసెంబర్ 31న ఎలాంటి పార్టీ చేద్దామనుకుంటుంటే ఇది మీకోసమే. ప్రపంచవ్యాప్తంగా దాదాపు అందరూ నూతన సంవత్సరాన్ని సెలబ్రేట్ చేసుకునేందుకు ప్రతి ఒక్కరూ తమదైన శైలిలో పార్టీ ప్లాన్ చేస్తారు. మీరు కూడా న్యూ ఇయర్ సందర్భంగా సరదాగా పార్టీ చేసుకోవాలనుకుంటే ఈ విధంగా ప్లాన్ చేసుకోండి.

yearly horoscope entry point

న్యూ ఇయర్ పార్టీని ఎలా ప్లాన్ చేసుకోవాలి:

బడ్జెట్ ప్లాన్ చేసుకోండి:

పార్టీని ఏ రేంజ్ లో ప్లాన్ చేసుకోవాలనుకుంటున్నామో ముందు ఆలోచించుకోండి. లేదా పార్టీకి ఎంత బడ్జెట్ కేటాయించాలో ప్లాన్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల పార్టీలో ఆహారం, ఆల్కహాల్, స్వీట్స్ వంటివి ఎన్ని వెరైటీలు తీసుకోవాలో ఒక లెక్క ఉంటుంది. అలా మీరు చేయాలనుకుంటున్న ప్రతి ఖర్చును ఒక లిస్ట్ రెడీ చేసుకోండి. దానికి అనుగుణంగా మీ బడ్జెట్ దాటిపోకుండా ఖర్చు చేయండి. ఆహారం విషయంలో ఒక ఐదారుగురికి మాత్రం ఎక్కువ ఉండేలా ప్లాన్ చేయండి. ఇలా చేయడం వల్ల అతిథుల జాబితా అనుకోకుండా పెరిగినా సర్దుకుపోవాల్సిన అవసరం రాదు.

అతిథుల జాబితా

బడ్జెట్‌కు అనుగుణంగా అతిథులను ఎవరెవరిని ఆహ్వానించాలో ప్లాన్ చేయండి. బట్టి ఎవరెవరిని ఆహ్వానించాలో ముందుగా ప్లాన్ చేయడం వల్ల చివరి నిమిషంలో గందరగోళం లేకుండా ఉంటుంది. ఇలా చేయడం వల్ల మీరు పడిన శ్రమ, తయారు చేయించిన ఆహారం వృథా కాకుండా ఉంటాయి. చివరి రోజు వరకూ ఎదురుచూడకుండా లిస్ట్ లో ఉన్న వారిని ఒక్కొక్కరికి ఇన్విటేషన్లుగా మెసేజ్ లు లేదా కాల్స్ చేయండి.

థీమ్ ఎంపిక

న్యూ ఇయర్ పార్టీ కోసం సరదా థీమ్ ఎంచుకోండి. దానికి అనుగుణంగా మీకు ఆలోచనల్లో ఉన్న విషయాలను పేపర్ పై ఉంచండి. ఇలా చేయడం ద్వారా థీమ్ పై క్లారిటీ వస్తుంది. ఆ తర్వాత అలంకరణ, ఆహారం, పానీయాలు వంటి అన్నింటికీ ఈ థీమ్ సరిపోయేలా రెడీ చేసుకోండి. ఇది కాకుండా, థీమ్ ప్రకారం పార్టీ చేసుకునే ప్రదేశాన్ని రెడీ చేయండి. నూతన సంవత్సర వేడుకలు అర్ధరాత్రి నుంచి ప్రారంభమవుతాయి. అటువంటి పరిస్థితిలో, ఈ రాత్రిని జరుపుకోవడానికి, సులభంగా తయారు చేయగల స్నాక్స్, డ్రింక్స్ ను లిస్టులో చేర్చుకోండి.

ఎంటర్ టైన్మెంట్/గేమ్స్

పార్టీకి వచ్చిన అతిథులకు బోర్ కొట్టకుండా ఉండాలంటే మ్యూజిక్ తో డ్యాన్స్ లేదా గేమ్స్ లాంటివి ప్లాన్ చేయండి. ఇలా చేయడం వల్ల పార్టీకి వచ్చిన వారిలోనూ ఉత్సాహం పెరిగి ఎక్కువ సేపు ఎంజాయ్ చేయగలుగుతారు. అలా కుదరని పక్షంలో కామెడీ కోసం ఏవైనా వీడియోలను లిస్ట్ చేసుకుని రెడీగా ఉండండి.

గిఫ్ట్ లు ప్లాన్ చేయడం:

మీరు చేసుకునే పార్టీకి కేవలం ఫ్యామిలీలే వస్తున్నట్లయితే చిన్నారుల కోసం గిఫ్ట్ లు రెడీ చేసుకోండి. సాధారణంగా పార్టీకి వచ్చేవారు గిఫ్ట్ లు తీసుకొస్తారు కాబట్టి గిఫ్ట్ లను ఎక్స్ ఛేంజ్ చేసుకోండి.

Whats_app_banner

సంబంధిత కథనం