New Year Wishes: తమిళం నుంచి కొరియన్ వరకు మొత్తం 24 భాషల్లో 'హ్యాపీ న్యూ ఇయర్' ఎలా చెప్పాలో ఇక్కడ ఉంది
New Year Wishes: 2025 న్యూ ఇయర్‌ను గ్లోబల్ టచ్‌తో సెలబ్రేట్ చేసుకోండి. ఇంగ్లీషు, తెలుగు భాషల్లోనే కాకుండా ఇతర భాషల్లో విష్ చేసి మీ శుభాకాంక్షలను మరింత ప్రత్యేకం చేయండి. ఫ్రెంచ్ నుంచి కొరియన్ వరకు మొత్తం 24 భాషల్లో 'హ్యాపీ న్యూ ఇయర్' ఎలా చెప్పాలో ఇక్కడ ఉంది
ఫ్రెంచ్ నుంచి కొరియన్ వరకు మొత్తం 24 భాషల్లో 'హ్యాపీ న్యూ ఇయర్' ఎలా చెప్పాలో ఇక్కడ ఉంది
కొత్త సంవత్సరం మరి కొద్ది క్షణాల్లో మొదలుకానుంది. మనకు తెలిసినంత వరకూ తెలుగులోనో, ఇంగ్లీషులోనే న్యూ ఇయర్ విషెస్ చెప్పడానికి రెడీ అయిపోయి ఉంటాం. ఈ సందర్భంలో అందరూ చెప్పే విధంగా కాకుండా విషెస్‌ను మీరు కాస్త ప్రత్యేకంగా చెప్పాలనుకుంటున్నారా.. కొత్త సంవత్సరం కొత్త ప్రారంభాలు, కొత్త ఆశలతో మొదలుకానున్న 2025 సంవత్సరాన్ని కొత్తగా ఆహ్వానిద్దాం రండి. ఇతర రాష్ట్రాల వారు ఎలా విష్ చేసుకుంటారు, అలాగే ఇతర దేశాల్లో ఈ విషెస్ ను ఎలా తెలియజేస్తారో చూడండి.
ఏ భాషలో "హ్యాపీ న్యూ ఇయర్"ను ఎలా చెప్పాలి:
- సంస్కృతంలో హ్యాపీ న్యూ ఇయర్‌ను శుభం నవవర్షం అంటారు.
- బెంగాలీలో హ్యాపీ న్యూ ఇయర్‌ను శుభ్ నబర్ష్ అంటారు.
- తమిళంలో హ్యాపీ న్యూ ఇయర్‌ను పుట్టంటు వాజ్దుక్కల్ అంటారు.
- మలయాళంలో హ్యాపీ న్యూ ఇయర్‌ను పుతువత్సర ఆశాంశాలు అంటారు.
- మరాఠీలో హ్యాపీ న్యూ ఇయర్‌ను నవీన్ వర్షాచ్యా శుభేచ్ఛ అంటారు.
- కన్నడలో హ్యాపీ న్యూ ఇయర్‌ను హోస వర్షదా శుభాశయ అంటారు.
- గుజరాతీలో హ్యాపీ న్యూ ఇయర్‌ను సాల్ ముబారక్ లేదా నూతన్ వర్షాభినందన్ అంటారు.
- పంజాబీలో హ్యాపీ న్యూ ఇయర్‌ను నవే సాల్ డి ముబారకాన్ అంటారు.
- ఒడియాలో హ్యాపీ న్యూ ఇయర్‌ను శుభ నబబర్స లేదా హాపిపీ నెబ్ ఆర్ అంటారు.
- హిందీలో హ్యాపీ న్యూ ఇయర్‌ను నయా సాల్ ముబారక్ హో లేదా నవ్ వర్ష్ కి శుభకామ్నాయే అంటారు.
- ఉర్దూలో హ్యాపీ న్యూ ఇయర్‌ను నయా సాల్ ముబారక్ అంటారు.
- అస్సామీ భాషలో హ్యాపీ న్యూ ఇయర్‌ను నరభర్షర శుభకామనా అంటారు.
- కొరియన్ భాషలో హ్యాపీ న్యూ ఇయర్‌ను సెహే బోగ్ మన్హ్-ఇ బ్యాడ్-యూసియో అంటారు.
- ఫ్రెంచ్ లాంగ్వేజ్‌లో హ్యాపీ న్యూ ఇయర్‌ను బోన్ అనే అంటారు.
- జర్మన్ భాషలో హ్యాపీ న్యూ ఇయర్‌ను ఫ్రోహెస్ న్యూ-యిస్ యార్ లేదా గుటెస్ న్యూ-యిస్ యార్ అంటారు.
- ఇటాలియన్‌లో హ్యాపీ న్యూ ఇయర్‌ను బూ-ఆన్ అహ్-న్నో లేదా ఫే-లీ-ఛే అహ్-నో-ఓ-వో అంటారు.
- పోర్చుగీస్‌లో హ్యాపీ న్యూ ఇయర్‌ను ఫెహ్-లిజ్ అన్-ఓహ్ నోహ్-వోహ్ అంటారు.
- స్పానిష్ భాషలో హ్యాపీ న్యూ ఇయర్‌ను ఫెహ్-లిజ్ అన్-యోహ్ ఎన్-వే-వో అంటారు.
- చైనీస్ లాంగ్వేజ్‌లో హ్యాపీ న్యూ ఇయర్‌ను జెన్నియన్ కుయలె అంటారు.
- జాపనీస్ భాషలో హ్యాపీ న్యూ ఇయర్‌ను అకేమాషైట్ ఒమెడెటో అంటారు.
- హీబ్రూలో హ్యాపీ న్యూ ఇయర్‌ను శన తోవా అంటారు.
- వియత్నామీస్ భాషలో హ్యాపీ న్యూ ఇయర్‌ను చౌప్ మూంగ్ నహ్మ్ మోయ్ అంటారు.
- రష్యన్ లాంగ్వేజ్‌లో హ్యాపీ న్యూ ఇయర్‌ను ఎస్ నోవిమ్ గోడోమ్ అంటారు.
- గ్రీకు భాషలో హ్యాపీ న్యూ ఇయర్‌ను కాళీ క్రోనియా అంటారు.
ఇక మీ వాళ్లకు రొటీన్ గా విష్ చేయకుండా ఇలా కొత్తగా ట్రై చేయండి. కొత్త భాషలో విష్ చేసి వాళ్లని కాస్త తికమక పెట్టండి. మీ విషెస్ అందరిలా కాకుండా కాస్త ప్రత్యేకంగా గుర్తుంటుంది.
సంబంధిత కథనం