New year party recipe: సాయంత్రం పార్టీలో సరదాగా చిల్లీ చికెన్ తినాలనుకుంటున్నారా? సింపుల్ స్టైల్లో ఇలా చేసేయండి!
New Year 2025: ఇండో ఛైనీస్ వంటకాల్లో స్పెషల్ గా అనిపించే వాటిల్లో ఒకటి ఈ చిల్లీ చికెన్. క్రిస్పీగా ఉండటంతో పాటు కాస్త తియ్యగా, కొంచెం స్పైసీగా నోరారా తినాలనిపించే వంటకం కావడంతో మెచ్చనివారుండరు. అటువంటి స్పెషల్ రెసిపీని న్యూ ఇయర్ సందర్భంగా మీ ముందుకు..
హాలీ డే జోష్ ను రెట్టింపుచేసేందుకు, న్యూ ఇయర్ పార్టీని పూర్తి చేసేందుకు కచ్చితంగా ఉండాల్సిన వంటకం చిల్లీ చికెన్. నాన్ వెజ్ లవర్స్ నో చెప్పకుండా తినే ఏకైక వంటకమిది. అసలే న్యూ ఇయర్ హడావుడి. మీరు రెస్టారెంట్లకు బిజీ వాతావరణంలో మీ ఆర్డర్ ఇచ్చే లోపు సంవత్సరం మారిపోవచ్చు కూడా. అందుకే పార్టీలో టైమ్‌కు అందేలా ఈ టేస్టీ వంటకాన్ని ఇంట్లోనే తయారుచేసుకోండి.
చిల్లీ చికెన్ రెసిపీకి కావలసిన పదార్థాలు
- 1/4 కప్పు - డీప్ ఫ్రై చేయడానికి నూనె లేదా అంతకంటే ఎక్కువ
- 250 గ్రాములు - చికెన్ బోన్ లెస్ క్యూబ్స్
- 1.50 టీస్పూన్ - రెడ్ చిల్లీ సాస్
- 1.50 టీస్పూన్ - సోయా సాస్
- 1/4 టీస్పూన్ - మిరియాల పొడి
- 2-3 టేబుల్ స్పూన్లు - మొక్కజొన్న పిండి
- 2 టేబుల్ స్పూన్ - శెనగ పిండి
- 1/4 టీస్పూన్ - ఎండుమిర్చి పొడి
- 1 - గుడ్డులోని తెల్లసొన
- 1 టేబుల్ స్పూన్ - సోయా సాస్
- 2 టేబుల్ స్పూన్లు - రెడ్ చిల్లీ సాస్
- 2 టేబుల్ స్పూన్లు - Tomato ketuchup
- 1/2 టీస్పూన్ - ఎండుమిర్చి పొడి
- 1/4 టీస్పూన్ - మిరియాల పొడి
- 2 టీస్పూన్లు - వెనిగర్
- 1 టీస్పూన్ - చక్కెర
- 2-3 టేబుల్ స్పూన్లు - నీరు
- 5.50 టేబుల్ స్పూన్ - నూనె
- 1 - మీడియం ఉల్లిపాయ (సన్నగా కట్ చేసి ఉండాలి)
- 1 టేబుల్ స్పూన్ - వెల్లుల్లి (సన్నగా తరిగి పెట్టుకోవాలి)
- 2 కప్పులు - బెల్ పెప్పర్
- 1-2 - పచ్చి మిరపకాయలు (ముక్కలుగా కోసి తరిగి పెట్టుకోవాలి)
- 1 ఉల్లిపాయ - స్ప్రింగ్ గా తరిగినవి
తయారీ విధానం:
ఒక గిన్నెలో..
- పావు కిలో బోన్ లెస్ చికెన్ తీసుకుని అరంగుళం సైజులో కట్ చేసి పెట్టుకోడి.
- ఒకటిన్నర టీస్పూన్ సోయా సాస్
- ఒకటిన్నర టీస్పూన్ చిల్లీ సాస్
- పావు టీస్పూన్ నల్ల మిరియాలు
- చిటికెడు ఉప్పు
ఇవన్నీ వేసుకుని చికెన్ ను కలుపుకుని పక్కకుపెట్టండి.
కొద్ది క్షణాల తర్వాత అదే గిన్నెలో..
- 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల మొక్కజొన్న పిండిని వేయండి.
- 2 టేబుల్ స్పూన్ల శెనగపిండి వేయండి.
- 1 ఎగ్ వైట్ మాత్రమే వేసి 2 రెండు టేబుల్ స్పూన్ల నీటితో బాగా కలపండి.
- చికెన్ తో బాగా ఇంకిపోయేంత వరకూ మిక్స్ చేయండి. పొడిగా అనిపిస్తే మరో టీస్పూన్ వాటర్ లేదా ఇంకో ఎగ్ వైట్ యాడ్ చేసుకోండి.
- అవసరమైన మేర కశ్మీరీ కారం లేదా కారంపొడిని ఒక పావు టీ స్పూన్ మేర వేసుకోండి.
ఒక్క విషయం బాగా గుర్తుంచుకోండి. ఎక్కువ నీటిని గానీ, ఎగ్ కానీ, కలిపితే అంతా డిస్టర్బ్ అయిపోతుంది. ఇలా కలుపుకున్న చికెన్ ను ఒక నైట్ మొత్తం ఫ్రిడ్జ్ లో ఉంచుకోవడం బెటర్.
సాస్ తయారుచేసుకోవడం
- 1 టేబుల్ స్పూన్ సోయా సాస్
- 2 టేబుల్ స్పూన్లు రెడ్ చిల్లీ సాస్
- 2 టేబుల్ స్పూన్లు టొమాటో కెచప్
- అర టీ స్పూన్ కారం పొండి
- ముప్పావు టీ స్పూన్ల వెనిగర్
- అర టీ స్పూన్ షుగర్
- 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల వాటర్
- ఇవన్నీ కలుపుకుని రుచికి తగ్గట్లు సెట్ చేసుకోండి.
- చికెన్ ఫ్రై చేయడం
చికెన్‌ను ఓవెన్‌లో బేకింగ్ చేసుకోవచ్చు. లేదంటే, పాన్‌లో వేసుకుని వేయించుకోవచ్చు.
- సన్నని మంట మీద నూనెను వేడెక్కనివ్వాలి. పాన్లో కేవలం ఒక అంగుళం మాత్రమే నూనె పోసి చికెన్ ముక్కలు వేసుకోండి. విడివిడిగా వేయడం ద్వారా చికెన్ అన్ని వైపులా ఫ్రై అవుతుంది.
- రెండు నిమిషాలకు ఒకసారి చికెన్ ముక్కలను అటూ ఇటూ తిప్పుతూ ఉండటం ద్వారా క్రిస్పీ టేస్ట్ వస్తుంది. గోల్డెన్ కలర్ లోకి రాగానే చికెన్ తీసి వేరే గిన్నెలో వేయండి.
చిల్లీ చికెన్ సాస్ ఇలా సిద్ధం చేసుకోండి.
- పాన్ లో ఒకటిన్నర టేబుల్ స్పూన్ నూనెను వేసి పెద్ద మంట మీద వేడి చేయండి. అందులో కొన్ని వెల్లుల్లి ముక్కలు వేసి అర నిమిషం ఆగండి.
- ఆ తర్వాత అందులో పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, మిరియాలు వేయండి. కరకరలాడేంతగా వాటిని వేయించండి.
- మీరు రెడీ చేసుకున్న సాస్ లు అందులో పోయండి.
- అది చిన్నపాటి బుడగలు వేస్తూ బాగా చిక్కగా అయ్యేంతవరకూ అలాగే చూడండి.
- ఆ సాస్ లో చికెన్ కు సరిపడా ఉప్పు వేసుకోండి.
- ఇప్పుడు అందులోకి చికెన్ వేసి వేయించుకోండి. చివరిగా కాస్త మిరియాల పొడి వేసుకోవాలి.
- అంతే చిల్లీ చికెన్ రెడీ.
దీనిని న్యూడిల్స్, ఫ్రైడ్ రైస్, కార్న్ సూప్ లతో పాటు తీసుకుంటే డబుల్ టేస్ట్ వస్తుంది.
సంబంధిత కథనం