New Parents Sleep : బిడ్డ పుట్టిన ఏడాది.. పేరెంట్స్ ఎంత నిద్ర కోల్పోతారో తెలుసా?-new parents lose 4 hours sleep every night here s complete details ,లైఫ్‌స్టైల్ న్యూస్
Telugu News  /  Lifestyle  /  New Parents Lose 4 Hours Sleep Every Night Here's Complete Details

New Parents Sleep : బిడ్డ పుట్టిన ఏడాది.. పేరెంట్స్ ఎంత నిద్ర కోల్పోతారో తెలుసా?

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం (unsplash)

New Parents Sleep : ఎవరు అవును అన్నా.. కాదు అన్నా.. పిల్లలు పుట్టిన ఏడాది తల్లిదండ్రులు ఇబ్బందులు ఎదుర్కొంటారు. శిశివును సరిగా చూసుకునేందుకు రాత్రుళ్లు నిద్రను త్యాగం చేస్తారు. మెుదటి ఏడాది ఎంత నిద్ర కోల్పోతారో మీకు తెలుసా?

బిడ్డ కడుపులో ఉన్నప్పటి నుంచి.. తల్లిదండ్రులు(Parents) ఎన్నో ఆశలతో ఉంటారు. బిడ్డ పుట్టిన తర్వాత.. కంటికి రెప్పలా కాపాడుకుంటారు. అనేక రాత్రులు నిద్రలేకుండా ఉంటారు. బిడ్డ కొంచెం ఎడిచినా.. ఎత్తుకుని తిరుగుతారు. అలా చేస్తేనే పిల్లలు నిద్రపోతారు. కాసేపు పడుకొబెట్టి.. ఓ చిన్న కునుకు వేద్దామనుకునేలోపు.. మళ్లీ ఏడుపు వినిపిస్తుంది. దీంతో మళ్లీ లేస్తారు. ఇలా బిడ్డ కోసం తల్లిదండ్రులు నిద్ర(Sleep)ను త్యాగం చేస్తారు. అయితే మెుదటి ఏడాదిలో ఇది ఎక్కువగా ఉంటుంది.

ట్రెండింగ్ వార్తలు

కొత్తగా తల్లిదండ్రులైనవారు ప్రతి రాత్రి 4 గంటల నిద్రను కోల్పోతారు. నవజాత శిశువుల తల్లిదండ్రులు వారి శిశువు జీవితం మొదటి సంవత్సరంలో 1,456 గంటల నిద్రను త్యాగం చేస్తారు. బిడ్డ ఏడుపు కారణంగా 10 మందిలో 9 మంది నాలుగు గంటల నిద్రను కోల్పోతారని సర్వేలు చెబుతున్నాయి. రాత్రిపూట తడి న్యాపీ, ఆకలి, దంతాల కారణంగా పిల్లలు మేల్కొంటారని తల్లిదండ్రులు చెబుతున్నారు.

ముగ్గురిలో ఒకరు తమ బిడ్డ రాత్రిపూట నిద్రపోవడం అనేది అప్పుడప్పుడు మాత్రమే అని అంటున్నారు. మొదటి-సంవత్సరం(First Year) పిల్లలు రాత్రిపూట నిద్రపోకుండా.. తల్లిదండ్రులను నిద్రపోనివ్వకుండా చేస్తారు. బిడ్డను పడుకోబెట్టడంలో తల్లులే(Mothers) ఎక్కువగా పనిచేస్తారని సర్వేలో తేలింది. తండ్రులు ఆరుగురిలో ఒకరు మాత్రమే ఈ బాధ్యతను పంచుకుంటున్నారు. 10 మందిలో దాదాపు ఆరుగురు మహిళలు తమ శిశువును ఎలా నిద్రపుచ్చలో వారి తల్లుల సలహాను కోరుకుంటారు.

అంటే శిశువు మెుదటి పుట్టిన రోజు వరకు సుమారు 133 నుంచి 150 రోజుల నిద్రను తల్లిదండ్రులు కోల్పోతారు. ఈ స్థాయి నిద్ర లేమి మీ కళ్ల కింద కనిపిస్తుంది. చాలా అలసిపోయినట్టుగా కనిపిస్తారు. నిద్ర లేమి తల్లిదండ్రులు(Parents) ఎక్కువగా మతిమరుపు కలిగి ఉంటారు. అయితే బాగా విశ్రాంతి తీసుకునే తల్లిదండ్రులు పిల్లల భద్రత విషయంలో మరింత అప్రమత్తంగా ఉండడంతోపాటు ముఖ్యమైన పనులను గుర్తుంచుకునే అవకాశం ఉంది.

సర్వేలో చాలా మంది తల్లిదండ్రులు శిశువు నిద్రిస్తున్నప్పుడు వారు నిద్రించడానికి ప్రయత్నించారని అంగీకరించారు. కానీ పిల్లలు పగటిపూట నిద్రపోయే సమయంలో తల్లిదండ్రులు ఎక్కువగా నిద్రపోవడం లేదు. ఇంట్లో పని, ఆఫీస్ పని(Office Work) కారణంగా.. బిజీ అయిపోతున్నారు. చాలామంది తల్లిదండ్రులు తమ బిడ్డను నిద్రపోయేలా చేయడానికి కారులో క్రమం తప్పకుండా తిప్పుతున్నారు.