Chanakya Niti Telugu : ఈ 4 విషయాలు మీ భార్య దగ్గర ఎప్పుడూ చెప్పకండి
Chanakya Niti On Husband and Wife : ఆచార్య చాణక్యుడు తన చాణక్య నీతిలో దాంపత్య జీవితం గురించి అనేక విషయాలు చెప్పాడు. భార్యతో భర్త ఎప్పుడూ చెప్పకూడని విషయాలను వివరించాడు.

సామాన్యుల జీవితానికి అవసరమైన కొన్ని సూత్రాలను చాణక్యుడు రూపొందించాడు. నేటికీ ప్రజలు దానిని పాటిస్తూ ఉంటారు. చాణక్యుడి సూత్రాల ప్రకారం జీవించేవారు జీవితంలో విజయం సాధిస్తారు. సంతోషకరమైన కుటుంబాన్ని నడిపించడానికి చాణక్యుడు కొన్ని విధానాలను రూపొందించాడు. చాణక్య నీతి ప్రకారం భార్యాభర్తలు ఒకరినొకరు ప్రశంసించుకోవాలి. సమస్య వచ్చినప్పుడు కలిసికట్టుగా ఎదుర్కోవాలి. అలాగే కొన్ని విషయాలను భార్యాభర్తల మధ్య రహస్యంగా ఉండాలి. ఇతరులతో పంచుకోకూడదని చాణక్యుడు చెప్పాడు. చాణక్యుడు చెప్పిన ప్రకారం భార్యకు కొన్ని విషయాలు చెప్పకూడదు. మీరు మీ భార్యతో చెప్పకూడని విషయాలు ఏంటి?
అవమానం
మనిషికి అవమానం, దుఃఖం, బాధ కలగడం సహజం. అలాగే చాణక్యుడు ప్రకారం పురుషులు పని చేయడానికి ఇంటి వెలుపల వెళ్లడం వల్ల కొన్నిసార్లు అవమానాలను ఎదుర్కోవలసి ఉంటుంది. అలాంటప్పుడు మీ భార్యకు అన్ని విషయాలు చెప్పకండి. ఎందుకంటే కొన్ని ఇళ్లలో భార్య.. భర్త పడే బాధలను అర్థం చేసుకుంటుంది. కానీ కొన్ని సందర్భాల్లో భర్త దూషిస్తే భార్య మీకు జరిగిన అవమానాన్ని పదే పదే చెప్పి బాధపెడుతుంది. మీకు అలా జరిగిందిగా నేను ఏమైనా అన్నానా అని మిమ్మల్ని దెప్పిపొడవచ్చు.
డబ్బుల ఖర్చు
చాణక్యుడు ప్రకారం, భర్త తన పని గురించి పూర్తిగా భార్యకు చెప్పకూడదు. ఒకవేళ చెప్పిన పైపైనే చెప్పాలి. ఎంత వస్తుంది అనేది చెప్పడం కూడా సరికాదు అంటాడు చాణక్యుడు. మీ ఆదాయం వివరాలు కూడా పూర్తిగా వెల్లడించకూడదు. ఎందుకంటే తదుపరిసారి ఆమె మీ ఆదాయాలను లెక్కిస్తుంది. మీరు అవసరమైన పనిపై ఖర్చు చేస్తుంటే, ఆమె మీ చేతులను దానిపై ఖర్చు చేయకుండా కట్టివేయవచ్చు. మీరు ఎవరికైనా సహాయం చేస్తుంటే, ఆమె వద్దు అని చెప్పవచ్చు. దీనివల్ల భవిష్యత్తులో ఇద్దరి మధ్య దూరం పెరుగుతుంది.
దానాలు
చాణక్య నీతి ప్రకారం మీరు చేసే దానధర్మం గురించి మీ భార్యకు చెప్పకూడదు. మన ధర్మం ఎప్పుడూ రహస్యంగా ఉండాలి. కుడిచేతితో మనం చేసేది ఎడమ చేతికి తెలియకూడదు. దానధర్మం గురించి అందరికి చెప్పుకుంటూ పోతే దానానికి ప్రాధాన్యత పోతుంది. అదేవిధంగా మీ భార్యతో ఈ విషయం గురించి మాట్లాడకండి. ఎందుకంటే ఆమె అడ్డుపడే అవకాశం ఉంది. దానం చేయాల్సిన అవసరం ఏం వచ్చిందని మీతో వాదనకు దిగే ఛాన్స్ కూడా ఉంటుంది.
బలహీనతలు
చాణక్యుడి ప్రకారం మీ బలహీనతలు ఏమైనా కావచ్చు. కానీ ఇతరులతో పంచుకోవద్దు. అంతేకాదు నీ భార్యకు కూడా చెప్పకూడదు. ఎందుకంటే ఆమె మీ బలహీనతను ఆయుధంగా చేసుకుంటే మీకే కష్టం. మీ బలహీనతను దృష్టిలో ఉంచుకుని ఆమె మీపై ఆధిపత్యం చెలాయించే అవకాశం ఉంది. అందరూ ఇలా చేయరు. కానీ చాలామంది మీ బలహీనతను ఉపయోగించుకుంటారు. కాబట్టి జాగ్రత్తగా ఉండటం మీ కర్తవ్యం.
ఇలా ఆచార్య చాణక్యుడు చాణక్య నీతిలో భార్యాభర్తల సంబంధం గురించి అనేక విషయాలు చెప్పాడు. భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండాలంటే కొన్ని విషయాలను దాచాలని పేర్కొన్నాడు. అప్పుడే ఇద్దరూ కలిసి ముందుగా వెళ్లగలరని వివరించాడు.