Chanakya Niti Telugu : ఈ లక్షణాలు ఉన్న మహిళను పెళ్లి చేసుకుంటే జీవితం సర్వనాశనమే!
Chanakya Niti On Woman : చాణక్యుడు పురుషులు, మహిళల జీవితం గురించి కొన్ని విషయాలు చెప్పుకొచ్చాడు. చాణక్య నీతిలో ఎలాంటి మహిళలను పెళ్లి చేసుకోకూడదో వివరించాడు.
ఆచార్య చాణక్యుడు తన చాణక్య నీతి ద్వారా ఎన్నో గొప్ప విషయాలు చెప్పాడు. ఆయన చెప్పిన మాటాలు పాటించేవారు జీవితంలో ఇప్పటికీ ఉన్నారు. చాణక్యుడి జీవిత సత్యాలు ఎంతగానో ఉపయోగపడతాయి. చాణక్య నీతిని ఇప్పటికీ ఫాలో అయ్యేవారూ ఉన్నారు. పెళ్లి గురించి చాణక్యుడు కొన్ని విషయాలను చెప్పాడు.
ప్రతి ఒక్కరి జీవితంలో వివాహం చాలా ముఖ్యమైన సంబంధాలలో ఒకటి. వివాహం తర్వాత, ఒక స్త్రీ తన భర్త, అతని మొత్తం తరం ఆనందానికి బాధ్యత వహిస్తుంది. భార్య ఇంట్లోకి కోడలిగా మాత్రమే ప్రవేశించదు. బాధ్యతగల స్త్రీగా రావాలి. వివాహిత స్త్రీ ప్రతి పనిని చాలా జాగ్రత్తగా చేయాలి. భార్య సత్ప్రవర్తన కలిగి ఉంటే ఇంట్లో ఆమె చెడు స్వభావం గల వ్యక్తిని కూడా మార్చగలదు. తన భర్త వైఫల్యాలను విజయాలుగా మార్చే శక్తి భార్యకు ఉందని నమ్ముతారు.
కానీ భార్య ప్రవర్తన సరిగా లేకుంటే.. కుటుంబంలోని ప్రతి సభ్యుడు దాని పర్యవసానాలను అనుభవించాల్సి వస్తుంది. భర్త కూడా జీవితంలో ఆనందాన్ని అనుభవించలేడని చాణక్యనీతి వివరిస్తుంది. భార్య ఏదైనా చెడు స్వభావాన్ని కలిగి ఉంటే కుటుంబంలో సమస్యలు వస్తాయని చాణక్యుడు చెప్పాడు.
చాణక్యుడి అభిప్రాయం ప్రకారం తన మాటలను నియంత్రించుకోని, చాలా కఠినమైన పదాలను ఉపయోగించే భార్య తన భర్తకు హాని చేస్తుంది. అలాంటి భార్యతో మీరు తరచూ సమస్యల్లో పడతారు. ఎందుకంటే అలాంటి భార్య మీ కుటుంబానికి చాలా హాని చేస్తుంది. ఈ స్త్రీలు ఎప్పుడూ ఇతరుల భావాలను పట్టించుకోరు. వారికి నచ్చింది మాత్రమే చేస్తారని చాణక్య నీతి చెబుతుంది.
కోపం తెచ్చుకోవడం మానవ సహజం. కానీ చాలా కోపం వచ్చినప్పుడు, అది చుట్టూ ఉన్నవారికి జీవితంపై ప్రభావితం చూపిస్తుంది. అందుకే చాణక్యుడు తన సంతోషం కోసం ప్రతీ విషయంలో కోపాన్ని చూపించే భార్యతో జాగ్రత్తగా ఉండాలని చాణక్యుడు చెప్పాడు.
ఇంట్లో గొడవలు సృష్టించే భార్యతో జీవనం చేయడం చాలా కష్టతరం. భార్య యొక్క ఈ ప్రవర్తన పరిణామాలను అందరూ భరించవలసి ఉంటుంది. ఎందుకంటే అలాంటి స్త్రీలు తమ పిల్లలకు మంచి లక్షణాలను నేర్పించలేరు. కుటుంబ జీవితాన్ని నాశనం చేస్తారు. ఒకరి గురించి ఒకరి వద్ద చెబుతూ పోతారు. ఇలా చేస్తే అనేక సమస్యలు వస్తాయి.
చాణక్యనీతి ప్రకారం, కొంతమంది స్త్రీలు తమ స్వలాభం కోసం అబద్ధాలు చెబుతారు. చాణక్యుడు చెప్పిన ప్రకారం ఈ అలవాటు చిన్నప్పటి నుండి వారికి ఉంటుంది. కొన్ని పరిస్థితుల నుంచి తప్పించుకోవడానికి మహిళలు అబద్ధాలు చెప్పడానికి వెనకాడరు. అలాంటి స్త్రీలు తమ భర్తలకు ద్రోహం చేయడానికి వెనకాడరు. వీరితో భర్తలకు మనశ్శాంతి ఉండదు.
దురాశ ఎక్కువైతే కుటుంబమే నాశనం అవుతుంది. డబ్బు ఎక్కువ కావాలనే ఉద్దేశంతో కొందరు స్త్రీలు తప్పుడు దారిని ఎంచుకుంటారని చాణక్య నీతి చెబుతుంది. ఎక్కువ డబ్బు సంపాదించాలనే కోరిక కొందరి మహిళల్లో ఎక్కువగా ఉంటుంది. డబ్బు, నగలు, వస్త్రాలు మొదలైన వాటితో వారి మనస్సు ఎప్పుడూ సంతృప్తి చెందదు. డబ్బుతో చాలా అనుబంధం ఉంటుంది. ఇలాంటి ఆశలు ఉన్న స్త్రీలు తప్పుదారిలో వెళ్లే అవకాశం ఉంది.