Chanakya Niti Telugu : ఇలాంటి వారితో శత్రుత్వం మీకే ప్రమాదం.. అస్సలు వద్దు
Chanakya Niti On Enemity : శత్రుత్వం అనేది చాలా ప్రమాదం అని చాణక్య నీతి చెబుతుంది. చాణక్యుడి ప్రకారం కొందరితో గొడవలు పెట్టుకోవడం మీకే మంచిది కాదు.
చాణక్యుడి ప్రకారం మీరు ఎవరితోనైనా శత్రుత్వం కలిగి ఉండవచ్చు. అయితే ఈ కొందరితో శత్రుత్వం పెట్టుకోకూడదు. అలా చేస్తే మీకే ప్రమాదం. మీకు కష్టాలు తప్పవు. ఇది మరణానికి కారణం కావచ్చు. ఇంతకీ వారు ఎవరు? వారిని జాగ్రత్తగా ఎదుర్కోవడానికి చాణక్యుడు ఇచ్చిన సూత్రాలు ఏంటో తెలుసుకుందాం.
చాణక్యుడి ప్రకారం, మనం ఎప్పుడూ శత్రుత్వం కలిగి ఉండకూడని మొదటి వ్యక్తి రాజు. మీరు రాజుతో యుద్ధం చేయబోతున్నట్లయితే మీరు కచ్చితంగా ఇబ్బందులు ఎదుర్కొంటారు. రెండో అతను మిమ్మల్ని బంధించగలడు. ఆధునిక కాలంలో రాజులు లేరు. అయితే మన పాలకులతోనూ గొడవలు పెట్టుకోవద్దు. అధికారులతోనూ గొడవలు పెట్టుకోవడం మంచిది కాదు. ఎందుకంటే డబ్బు, అధికారం ఉన్నవారు సాధారణ పౌరులను ఇబ్బందులు పెట్టగలరు.
మనకంటే బలవంతులైన వారితో మనం యుద్ధం చేయకూడదని చాణక్యుడు చెప్పాడు. శారీరకంగా బలంగా ఉంటే, కచ్చితంగా గొడవపడకండి. డబ్బు లేదా ఆయుధాలు ఉన్న వారితో కూడా యుద్ధం చేయవద్దు. ఎందుకంటే వారితో పోరాడటానికి వెళితే మరణం కూడా సంభవించవచ్చు. వారి దగ్గర ఉన్న ఆయుధాలతో మిమ్మల్ని చంపేసే అవకాశం కూడా ఉంటుంది.
చాణక్యుడు ప్రకారం, పూజారులు భగవంతుని పూజ కైంకర్యాలను ఆచరించినందున వారు గౌరవప్రదంగా చూస్తారు. వారి శాపానికి లోనుకావద్దు అనే సామెత కూడా మనకు ఉంది. వారిని అవమానించి కోపానికి గురిచేసినా, కన్నీళ్లు వచ్చేలా చేసినా ఆ శాపం నీకు తగులుతుందని చాణక్య నీతి చెబుతుంది. బ్రాహ్మణులను దుర్భాషలాడవద్దు అని చాణక్యుడు చెప్పాడు.
చాణక్యుడి ప్రకారం మూర్ఖుడితో స్నేహం చేయవద్దు. ఎందుకంటే అది ఏదో ఒకరోజు మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటుంది. ఎందుకంటే మూర్ఖులు ఏ క్షణంలో ఏం చేస్తారో అర్థం కాదు. వారి మాటలు మీకు బాధ కలిగించవచ్చు. మీ రహస్యాలన్నీ తెలుసుకుని అందరి ముందు వారు మిమ్మల్ని అవమానించగలరు. వీలైనంత వరకు వాటికి దూరంగా ఉండటం మంచిది. వారితో మిత్రుత్వం, శత్రుత్వం.. రెండు ప్రమాదమే.
వైద్యుడిని మనం చూసే దేవుడని అంటుంటారు. ఎందుకంటే మన ఆరోగ్యం క్షీణించినప్పుడు మనల్ని బ్రతికించే శక్తి వారికి మాత్రమే ఉంది. మీరు వారితో శత్రుత్వం కొనసాగించినట్లయితే మీ జీవితానికి ప్రమాదం. వైద్యులతో శత్రుత్వం అస్సలు పెట్టుకోకూడదు.
చాణక్యుడు ప్రకారం వంటమనిషితో లేదా వంటవాడితో శత్రుత్వం కలిగి ఉండకూడదు. ఎందుకంటే మన జీవితాలు ఆయన వారి ఉన్నాయి. తినే అన్నంలో విషం కలిపితే ప్రాణం పోతుంది. మీ ఇంట్లో పనిచేసే వ్యక్తి అయినా కూడా గౌరవం ఇవ్వండి.
మన కుటుంబం కాకుండా మనం మనవారు అని భావించే వ్యక్తులు మాత్రమే మన ఆత్మ సహచరులు. మన ఒడిదుడుకులన్నింటిలో స్నేహితుడు భాగస్వామి. కష్ట సమయాల్లో కూడా సహాయపడుతారు. మన రహస్యాలన్నీ వారికి తెలుసు. అలాంటి స్నేహితుడిలో శత్రుత్వం అవసరం లేదు.
ఆచార్య చాణక్యుడు తన చాణక్య నీతిలో జీవితానికి సంబంధించిన అనేక విషయాలను చెప్పాడు. చాణక్యుడు సూత్రాలు పాటిస్తే జీవితంలో విజయం సాధించవచ్చు. పైన చెప్పిన వారితో శత్రుత్వం మీ జీవితానికి మంచిది కాదు. చాలా ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది.