Don't Ask : పక్కింటి వాళ్ల దగ్గర ఇలాంటి వస్తువులు అడగకండి, తీసుకోకండి..
Neighbour : పక్కింటి వాళ్ల నుంచి ఏదో ఒకటి తెచ్చుకోవడం మనందరికీ అలవాటే. కానీ కొన్ని వస్తువులను అస్సలు తెచ్చుకోకూడదు. ఎందుకంటే అవి మీకు మంచివి కావు.
ఇంట్లో ఉప్పు అయిపోయినా.. పప్పు అయిపోయినా.. పక్కింటి వాళ్ల ఇంటికి వెళ్లడం చాలా మందికి అలవాటు. అక్కా.. కొంచెం పంచదార పెట్టు.. అత్తయ్యా కొంచెం కూర వేయ్యి.. అని ఇలా వెళ్తుంటాం. అయితే పొరుగువారికి ఇచ్చిపుచ్చుకోవడం మంచి పద్ధతే. కానీ కొన్నింటిని మాత్రం అస్సలు వారి దగ్గర నుంచి తెచ్చుకోవద్దు. చాలా మంది అవసరంలేనివి తెచ్చుకుని ఇబ్బందులు ఎదుర్కొంటారు.
కొన్నిసార్లు మనం ఇతరుల నుండి వస్తువులను అడిగి ఉపయోగిస్తాం. కానీ మనం ఇతరుల నుండి కొన్ని విషయాలను పొందకపోవడమే మంచిది. ఆ విషయాలను వారి నుంచి అడిగితే అది మనకు సమస్యలను సృష్టిస్తుంది. పరుగు వారి దగ్గర అడగకూడని విషయాలు ఏంటో తెలుసుకుందాం..
ఈ వస్తువులు
లోదుస్తులు, దువ్వెన, టవల్, టూత్ బ్రష్ మొదలైన ఇతరుల వ్యక్తిగత వస్తువులను ఉపయోగించవద్దు. ఇలాంటి వాటి వల్ల త్వరగా రోగాలు వ్యాపిస్తాయి. వారికి ఉన్న సమస్య మనకే వస్తుంది. ఇతరుల నుంచి అలాంటివి పొంది వాటిని వాడకండి. చాలా మంది చర్మ సమస్యలతో బాధపడటానికి ఇది కూడా ఓ కారణం. పొరుగువారి బట్టలు కొన్నిసార్లు అడిగి తీసుకుంటాం.. తర్వాత వాటి ద్వారా సమస్యలు వస్తాయి. ఈ కాలం యువతలో ఈ అలవాటు ఎక్కువగా ఉంది.
డబ్బు
కొన్నిసార్లు మనం డబ్బు అవసరం ఉంటుంది. కానీ పొరుగువారి నుండి లేదా చాలా సన్నిహితుల నుండి డబ్బు తీసుకోకపోవడమే మంచిది. మనం డబ్బు తీసుకున్నట్లయితే వెంటనే తిరిగి చెల్లించడానికి ప్రయత్నించాలి. లేకుంటే సంబంధం చెడిపోతుంది. అప్పు తీసుకోకపోవడమే మంచిది. మీ మధ్య ఉన్న బంధాన్ని పాడుచేసేది డబ్బులే.
విలువైన వస్తువులు
మనం ఇతరుల విలువైన వస్తువులను అడగకూడదు, వాడకూడదు. ఉదాహరణకు బంగారం, మనం మరొకరి బంగారాన్ని అడిగి వాడుకుంటే అది మన దగ్గర పోతే ఇబ్బందే. కాబట్టి మన దగ్గర ఉన్నవాటినే ఉపయోగించాలి. మరొకరి ఖరీదైన వస్తువులను ఉపయోగించవద్దు. చాలా మంది ఫంక్షన్లకు పక్కింటివాళ్ల బంగారు ఆభరణాలు అడిగి తీసుకెళ్తారు. తర్వాత అది ఎక్కడో పడిపోతే.. ఇక మీకు యుద్ధమే. మీరే కావాలని దాచిపెట్టరనే మాటలు కూడా వస్తాయి. అందుకే ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.
మందులు
మీరు వేరొకరి మందులను తీసుకోకూడదు. ఎందుకంటే.. అది ప్రతిచర్యకు కారణం కావచ్చు. మీరు డాక్టర్‌ని సంప్రదించకుండా వేరొకరు వాడుతున్న మందుల జోలికి వెళ్లకూడదు. డాక్టర్ దగ్గరకు వెళ్లి.. వారు సూచించిన మందులను తీసుకోండి. సమస్య ఇద్దరికీ ఒకేలా ఉన్నా.. పక్కింటి వాళ్ల దగ్గర మెడిసిన్ తెచ్చుకుని ఉపయోగించకూడదు.
తెస్తే త్వరగా ఇచ్చేయండి
మనలో చాలా మందికి పక్కింటి వారి దగ్గర కొన్ని వస్తువులు తెచ్చి మరిచిపోవడం అలవాటు. కానీ ఇచ్చిన పరికరం తిరిగి ఇవ్వకుంటే అవతలి వారి ఇంటిలో గొడవలు జరుగుతాయి. అవసరమైనప్పుడు అందుబాటులో లేకపోతే చాలా చికాకుగా ఉంటుంది. కాబట్టి ఈ పని చేయవద్దు. దీనర్థం మనం ఏదీ తీసుకోకూడదని కాదు.. మరెవరినీ ఏమీ అడగకూడదని కాదు.. ఎంత ధనవంతుడైనా, ఎప్పుడో ఒకరి సహాయం అవసరం వస్తుంది. అయితే మీ రిలేషన్ పాడుచేసుకునేలా మాత్రం ఉండకూడదు.
వీరిని సాయం అడగకండి
మనల్ని చూసి నవ్వేవారి సహాయం కోరితే వారు మనకు సహాయం చేసినట్లు నటిస్తారు, కానీ వెనుక నుండి అనవసరమైన మాటలు అంటారు. అలాంటివారి దగ్గర సాయం తీసుకోకండి. కష్టాలు అర్థం చేసుకోలేని వారికి, కనికరం లేని వారికి మన కష్టాలు చెప్పుకుని ఏం లాభం. బండరాయిపై వర్షం కురిసినా ఫలితం ఉండదు కదా. అలాంటి వారికి ఏమీ చెప్పకపోవడమే మంచిది.
పక్కింటివారు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు సాయం అడగకండి. ఎందుకంటే వారి సమస్యలు వారికే ఉంటాయి. ఇలాంటి సమయంలో వెళ్లి సాయం అడిగితే మీతో గొడవకు రావొచ్చు.