Skin care mistakes: మీ ముఖానికి ఎప్పుడూ రాయకూడని 5 పదార్థాలివే.. చర్మాన్ని డ్యామేజ్ చేసేస్తాయి
Skin care mistakes: ముఖకాంతిని పెంచడానికి టమాటాలు, దోసకాయలు, నిమ్మకాయలను తరచూ చాలామంది రాస్తుంటారు. కానీ వీటిని వాడే ముందు ఒకసారి వాటివల్ల చర్మానికి ఏం జరుగుతుందో తెల్సుకోండి.
ముఖం రంగును మెరుగుపరచడానికి, చర్మ సంబంధిత సమస్యలను తొలగించడానికి చాలా చిట్కాలు ఫాలో అవుతుంటారు. ఏది బాగుందని చెబితే అది ముఖానికి రాసేస్తారు. కానీ కొన్ని పదార్థాల వల్ల చర్మ ఆరోగ్యానికి హాని జరుగుతుంది. సోషల్ మీడియాలో చెప్పే అనేక రకాల హోం రెమెడీస్‌ను ప్రయత్నించడం అస్సలు సరికాదు. ముఖ్యంగా ఈ 5 వాడుతుంటే తక్షణమే మానేయండి. లేదంటే దీర్ఘకాలికంగా మీ చర్మానికి తీవ్ర నష్టం జరుగుతుంది.
టమాటా:
టమాటా జ్యూస్‌ను ముఖానికి అప్లై చేయడం వల్ల చర్మం రంగు మెరుగుపడుతుందని చాలా మంది చెప్తుంటే వినే ఉంటారు. టమాటా గుజ్జులో ఉండే బ్లీచింగ్ ఏజెంట్స్ చర్మాన్ని శుభ్రం చేసి తాజా లుక్ ఇవ్వడానికి సహాయపడతాయి. అయితే టమాటా రసం నేరుగా ముఖానికి అప్లై చేయడం వల్ల దాంట్లో ఉండే యాసిడ్ మీ చర్మ సహజ పీహెచ్ స్థాయిని పాడు చేస్తుంది. దాంతో చర్మం పొడిబారడం, లేదా చికాకు కలుగుతుంది.
చక్కెర:
స్క్రబ్ చేయడం చర్మానికి మంచిదే. అయితే ముఖం స్క్రబ్ చేయడానికి చక్కెరను ఉపయోగిస్తారు చాలామంది. ఇలా చేస్తే గరుకుగా ఉండే చర్మం కణాలను దెబ్బతీస్తుంది. దీంతో చర్మం మరింత సున్నితంగా తయారవుతుంది. కాబట్టి స్క్రబ్ కోసం చక్కెరను వాడటం మానేయడం మంచిది.
బేకింగ్ సోడా:
ముఖం మీదుండే మచ్చలను, మరకలను వదిలించుకోవడానికి బేకింగ్ సోడాను స్క్రబ్ గా వాడతారు. ఇలా చేయడం వల్ల చర్మంలో ఉంటే సహజ నూనెలు కోల్పోతారు.దీంతో ముఖంలో సున్నితత్వం పెరుగుతుంది. దీని వల్ల చర్మం పొడిబారి నిర్జీవంగా తయారవుతుంది.
టూత్ పేస్ట్:
ఈ హ్యాక్ ఎన్నో రోజులనుంచి ఫాలో అయ్యేవాళ్లుంటారు. మొటిమలు వచ్చినా, ముఖం మీద మచ్చలకు కూడా చాలా మంది టూత్ పేస్ట్ వాడతారు. దీంట్లో ఉండే రసాయనాల వల్ల చర్మంలో సహజ నూనెలు తగ్గిపోతాయి. చెప్పాలంటే మొటిమల్లాంటి సమస్యలు మరింత ఎక్కువవుతాయి కూడా.
నిమ్మరసం
నిమ్మరసం సహజ బ్లీచింగ్ ఏజెంట్. ఈ విషయం చాలా మందికి తెలుసు. కానీ దాని రసాన్ని నేరుగా చర్మానికి పూయడం వల్ల మీ చర్మం పీహెచ్ స్థాయి దెబ్బతింటుంది. అంతే కాదు దీనివల్ల చర్మం యూవీ కిరణాలకు మరింత సున్నితంగా మారుతుంది. చర్మం పొడిబారడం, ఎరుపెక్కే సమస్యలకు కారణం అవుతుంది.
టాపిక్