గుండె ఆరోగ్యం కాపాడుకోవాలంటే, మీ మెదడు ఆరోగ్యంగా ఉండాలంటున్నారు బ్రెయిన్ సైంటిస్టులు. ప్రత్యేకించి కరోనా లాంటి సమయంలో చాలా మంది తమకు వైరస్ సోకిందనే భయంతో కూడిన ఆలోచనలతోనే గుండెనొప్పికి గురయ్యారు. అలా మెదడుపై గుండె ఒక్కటే కాదు, మిగతా శరీర భాగాలెన్నో ఆధారపడి ఉన్నాయి.మరి వాటన్నింటినీ సంరక్షించుకోవాలంటే, ముందుగా ఈ చెడ్డ పనులను చేయడం మానేయాలి. వెంటనే అలవాట్లను మార్చుకోవాలి. ఇంతకీ ఆ చెడ్డ అలవాట్లు ఏంటంటే..
శారీరక శ్రమ తగ్గిపోవడం మానసిక ఎదుగుదలపై ప్రభావం చూపిస్తుందట. చాలా అధ్యయనాల్లో రుజువైన విషయమేమిటంటే, ఎక్సర్‌సైజ్ డైలీ చేసే వారిలో జ్ఞాపక శక్తి తగ్గిపోవడం తక్కువగా కనిపించిందట. అంతేకాకుండా, మెదడులోని జ్ఞాపక శక్తికి కారణమయ్యే హిప్పోక్యాంపస్ అనే భాగానికి సపోర్ట్ అందిస్తుంది.
వయస్సు ఎక్కువైందనో, ఇతర కారణాలతో ఖాళీగా కూర్చోకుండా సింపుల్ యాక్టివిటీస్ చేస్తుండండి. వాకింగ్ లాంటి సింపుల్ వ్యాయామాలు చేస్తుండటం వల్ల కలిగే ఫలితాలు చూసి మీరే ఆశ్చర్యపోతారు.
గంటల కొద్దీ టీవీలకు, మొబైల్ స్క్రీన్లకు ఎదురుగా కూర్చొని టైం వేస్ట్ చేయడం ఆపండి. ఇలా చేయడం వల్ల మీ మెమొరీశక్తి తగ్గిపోయే విధంగా మెదడులో మార్పులు చేస్తుంది. గంటకొకసారి స్వల్ప విరామం తీసుకుంటూ కాస్త దూరం నడిచేలా ప్లాన్ చేసుకోండి.
మీరు తీసుకునే ఆహారంలో షుగర్ లేదా ఫ్యాట్ ఎక్కువ కాకుండా చూసుకోండి. ఈ అలవాట్లు గుండెకు మాత్రమే కాదు మెదడుకు కూడా అనారోగ్యాన్ని తెచ్చిపెడతాయి. వాటికి బదులుగా చేపలను, కూరగాయలను, ధాన్యంతో చేసిన ఆహారం తీసుకోవడం వల్ల బ్రెయిన్ హెల్త్ మెరుగవుతుంది.
ప్రశాంతత పేరుతో చాలా మంది ఒంటరిగా గడపడానికి ఇష్టపడతారు. నిజానికి ఒంటరితనం జ్ఞాపక శక్తిని తగ్గించి మతిమరుపుకు కారణమవుతుంది. మీ ఆలోచనలకు తగ్గ వ్యక్తులతో కలిసి టైం స్పెండ్ చేయండి. ఒంటరిగా గడిపేవారికి వినడం ఇష్టం ఉండదు. అలా కాకుండా ఎదుటివారు చెప్పే మాటలు ఎక్కువగా వింటూ ఉండండి.
హైబీపీ అయినా లోబీపీ అయినా కచ్చితంగా మెదడుపై ప్రభావం చూపిస్తుంది. మెదడుకు రక్త సరఫరా అయ్యే వేగాన్ని తగ్గించేస్తుంది. ఫలితంగా మెదడులోని కణాల తీరు మారిపోతుంది. దీని కోసం రక్తపోటును అదుపులో అంటే 120/80 mmHgగా మెయింటైన్ చేయండి.
నిద్రకు సరిగా సమయం కేటాయించకపోవడం వల్ల మీ ఫోకస్ తగ్గిపోతుంది. ఫలితంగా మానసిక సామర్థ్యం తగ్గిపోతుంది. కనీసం ప్రతి రోజూ రాత్రి ఏడు గంటల సేపు నిద్రపోవడం ముఖ్యమని తెలుసుకోండి.
ప్రతి విషయానికి ఆలోచిస్తూ ఉంటే, న్యూరోటిజం వస్తుందని గుర్తించండి. ఇది మెదడు సైజును చిన్నగా చేయడంతో పాటు జ్ఞాపక శక్తిని తగ్గిస్తుంది. ఒత్తిడి నుంచి బయటపడేలా రిలాక్సేషన్ టెక్నిక్స్ పాటించండి. యోగా, ధ్యానం లాంటివి చేస్తుండండి.
ఆటలు మెదడుకు పని పెంచేలా చేస్తాయి. జ్ఞాపక శక్తిని మెరుగుపరుస్తాయి. సరదాగా ఉంచుతూనే మెదడు పనితీరును కాపాడతాయి. ఆటల కోసం సమయం ఇవ్వకపోవడం వల్ల మెదడు ఆరోగ్యం పెంపొందించుకునే అవకాశాన్ని కోల్పోతారు. దీని కోసం మీకున్న రకరకాల హాబీలను ఎంజాయ్ చేయండి. పుస్తకాలు చదవడం, పజిల్స్ పూర్తి చేయడం వంటివి కూడా మెదడును ఎంగేజ్ చేయడానికి ఉపయోగపడతాయి.
సంబంధిత కథనం