Fahad Faasil: ఫహద్ ఫాజిల్‌కు మెంటల్ డిజార్డర్ ఉందని తెలిసి ఆయన భార్య ఏం చేసిందో తెలుసా?-nazriya reveals fahad faasil mental disorder and how she helps him overcome it ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Fahad Faasil: ఫహద్ ఫాజిల్‌కు మెంటల్ డిజార్డర్ ఉందని తెలిసి ఆయన భార్య ఏం చేసిందో తెలుసా?

Fahad Faasil: ఫహద్ ఫాజిల్‌కు మెంటల్ డిజార్డర్ ఉందని తెలిసి ఆయన భార్య ఏం చేసిందో తెలుసా?

Ramya Sri Marka HT Telugu
Jan 19, 2025 08:30 AM IST

Fahad Faasil: ఫహద్ భార్య నజ్రియా స్వయంగా తన భర్తకు ఉన్న మెంటల్ డిజార్డర్ బయటపెట్టింది. 2014 నుంచి ఒకరికొకరు పరిచయముండగా కొద్ది రోజుల తర్వాతే అసలు విషయం తెలిసిందట. మరి డిజార్డర్ నుంచి ఫహద్ బయటపడటానికి నజ్రియా ఏం చేస్తుందో తెలుసా..?

 ఫహద్ ఫాజిల్‌కు మెంటల్ డిజార్డర్ ఉందని తెలిసి ఆయన భార్య
ఫహద్ ఫాజిల్‌కు మెంటల్ డిజార్డర్ ఉందని తెలిసి ఆయన భార్య

మలయాళం సినిమా పరిశ్రమలోనే కెరీర్ మొదలుపెట్టినా పాన్ ఇండియా రేంజ్‌లో పేరు తెచ్చుకున్న యాక్టర్ ఫహద్ ఫాజిల్. తెరపై ఏ పాత్రలోనైనా ఇమిడిపోయే యాక్టింగ్ టాలెంట్ ఉన్న ఫహద్‌ ఒక మెంటల్ డిజార్డర్ తో బాధపడుతున్నాడట. ఈ విషయం అతని భార్య అయిన నజ్రియా నజీమ్ స్వయంగా వెల్లడించింది. ఓ మలయాళీ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన భర్తకు ఉన్న అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివిటీ డిజార్డర్ (ADHD)గురించి చెప్పింది. ఈ సమస్యను పసిగట్టక ముందు వారికి అసలు ఫహద్ అలా ఎందుకు ప్రవర్తిస్తున్నాడో అర్థమయ్యేది కాదట.

ఫహద్ కు ADHD ఉందని తెలిసింది. ఈ సమస్య ఉందని మా ఇద్దరికీ పెళ్లి తర్వాతే తెలిసింది. ఆ తర్వాత తన పరిస్థితి అర్థం చేసుకున్న నాలో సహనం ఇంకా పెరిగిపోయింది అని నజ్రియా తన మాటల్లో చెప్పింది. ఫహద్ పరిస్థితి తెలుసుకున్న నజ్రియా ఎప్పుడూ తనతోనే ఉండేలా ప్లాన్ చేసుకుందట.

ఈ సమస్యతో బాధపడే వాళ్లు స్కూల్ లేదా పని ప్రదేశంలో పెద్దగా పర్ఫామ్ చేయలేరట. అంతేకాకుండా ఏ రిలేషన్‌లోనూ ఎక్కువ కాలం పాటు ఉండలేరట. వీరు ఏ విషయంపైనైనా ధ్యాస నిలపడం కష్టంగా ఉంటుంది. హైపర్ యాక్టివ్ గా ఉంటూ నిలకడ లేని ప్రవర్తనతో ఉంటుంటారట. వయస్సు పెరుగుతున్న కొద్దీ లక్షణాలు మారిపోతూ ఉంటాయట. పెద్దవారిలోనూ ఈ లక్షణాల కారణంగా రోజువారీ పనులు విజయవంతగా పూర్తి చేయలేరట. ఈ సమస్య ఉన్న వాళ్లు తొలినాళ్లలో విశ్రాంతి లేకుండా ఉండటం, నిలకడలేని స్వభావంతో ఉండటం, ఏ విషయంపైనా శ్రద్ధ కనబరచకపోవడం వంటివి కనిపిస్తుంటాయట.

ఈ సమస్యతో ఉన్నవారికి ఎలా సహకరించాలి:

కమ్యూనికేషన్ మెరుగుపరుచుకోవాలి:

ADHD ఉండే వారిలో కనిపించే మతిమరుపు, ఏకాగ్రత ఉంచలేకపోవడంపై దృష్టి పెట్టాలి. వీటి వల్ల అపార్థాలు కలగకుండా చూసుకోవాలి. ఈ విషయాల పట్ల తరచూ బ్లేమ్ చేస్తూ పోవడం కంటే ఎక్కువగా కమ్యూనికేషన్ పెంచుకుని వారికి పదేపదే విషయాలను గుర్తు చేస్తూ ఉండాలి.

మీ బలాలను తెలుసుకోండి:

ADHDతో బాధపడేవారిలో క్రియేటివిటీ, సమస్యలు పరిష్కరించే సామర్థ్యం ఎక్కువగా ఉంటాయి. ఈ విషయాలను హైలెట్ చేసుకుంటూ తమ భాగస్వామికి బలం చేకూర్చే వారిగా నమ్మించవచ్చు.

సహనం పెంచుకోండి

ఈ సమస్య కాలంతో పాటు మారుతూ ఉండొచ్చు. మీ పార్టనర్ ప్రవర్తనపై ఫోకస్ పెట్టి ఇంకా ఎక్కువ కేరింగ్ చూపడం, ప్రేమపూర్వకమైన వాతావరణాన్ని నెలకొల్పడం వల్ల మానసికంగా తక్కువ ప్రభావం కనిపించొచ్చు. మీకు ADHD సమస్యతో బాధపడే వారి ప్రవర్తన నచ్చకపోయినా ముందుగా దయతో కూడి వ్యవహరించాలని మర్చిపోకండి.

లిమిట్స్ తెలుసుకోండి:

ఈ డిజార్డర్ ను సరిగ్గా అర్థం చేసుకుని సహాయపూర్వకమైన గుణాన్ని పెంచుకోండి. కొన్నిసార్లు ఈ సమస్యతో బాధపడుతున్నా మీ పార్టనర్ దానికి ఒప్పుకుని, పరిష్కారం గురించి మాట్లాడేందుకు సిద్ధంగా ఉండకపోవచ్చు. కొంచెం ఆలోచించి చర్చకు దిగండి.

పరిష్కారం గురించి ఆలోచించండి:

మీ పార్టనర్ సహజ కోరికలను గౌరవించండి. ప్రతి విషయం అంచనా వేయలేకపోయినా వీలైనంత వరకూ సాకారం చేసేందుకు ప్రయత్నించండి. ప్రతి విషయంలో మానసికంగా, భౌతికంగానూ ఆరోగ్యంగా ఉండేందుకే ప్రాధాన్యత ఇవ్వండి. వీలైతే ఏదైనా సమస్యకు కలిసి పరిష్కారం వెదకగలరేమో ట్రై చేసి చూడండి.

Whats_app_banner

సంబంధిత కథనం