Navaratri Day 8: నవరాత్రి ఎనిమిదవ రోజున మహాగౌరీ ఆరాధన చేయండి, శుభం కలుగుతుంది!
8th day of Navaratri Maa Mahagauri Puja : అక్టోబర్ 3వ తేదీన, సోమవారం శరన్నవరాత్రులలో ఎనిమిదవ రోజు అమ్మవారి ఎనిమిదవ రూపమైన మహాగౌరిని పూజిస్తారు.
అక్టోబర్ 3వ తేదీన, సోమవారం నవరాత్రులలో ఎనిమిదవ రోజున, అమ్మవారి ఎనిమిదవ రూపమైన మా మహాగౌరిని పూజిస్తారు. నవరాత్రులలో అమ్మవారి తొమ్మిది రూపాలను ఒక్కొ రోజు పూజిస్తారు. నవరాత్రులలో ఎనిమిదవ రోజు చాలా ముఖ్యమైనది. ఈ రోజున కన్య పూజ కూడా చేస్తారు.
ట్రెండింగ్ వార్తలు
మహాగౌరీ పూజ విధివిధానాలు
తెల్లవారుజామున లేచి, తలంటూ స్నానం ఆచరించండి, ఆ తర్వాత శుభ్రమైన బట్టలు ధరించండి.
అమ్మవారి విగ్రహాన్ని గంగాజలం లేదా స్వచ్ఛమైన నీటితో స్నానం చేయించండి.
తల్లికి తెల్లని రంగు బట్టలు సమర్పించండి. దేవీ పురాణాల ప్రకారం, అమ్మవారు తెల్లని రంగును ఇష్టపడుతుంది.
స్నానం తర్వాత అమ్మవారికి తెల్లటి పువ్వులు సమర్పించండి.
తల్లికి శుద్ధమైన కుంకుమను సమర్పించండి.
అమ్మవారికి ఐదు రకాల పండ్లు సమర్పించండి.
మా మహాగౌరికి నల్లబెల్లం సమర్పించండి.
మా మహాగౌరిని నిండు మనసుతో ధ్యానించండి.
అమ్మవారి హారతి ఇవ్వండి.
అష్టమి రోజున ఆడబిడ్డలను పూజించడంలో కూడా విశిష్టత ఉంది. ఈ రోజున కన్యా పూజ కూడా చేయాలి.
మా మహాగౌరీ పూజ ప్రాముఖ్యత
మహాగౌరీని పూజించడం వల్ల వివాహ సమస్యలు తొలగిపోతాయి.
అమ్మవారి అనుగ్రహంతో కోరుకున్న జీవిత భాగస్వామి లభిస్తుంది.
మహాగౌరీని పూజించడం వల్ల కష్టాలు తొలగిపోతాయి, పాపాల నుంచి విముక్తి లభిస్తుంది.
ఆనందం, శ్రేయస్సుతో పాటు, అదృష్టం కూడా లభిస్తుంది.