Navaratri 2022 : నవరాత్రి సమయంలో చేయవలసినా, చేయకూడని పనులివే..
Navaratri 2022 : నవరాత్రి అంటే అమ్మవారికి చాలా ఇష్టమైన పండుగ. తొమ్మిది రోజులు భక్తులు వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. అయితే మీ ఉపవాసం ఫలవంతం అవ్వడానికి.. ఆ తొమ్మిది రోజులు మీరు చేయవలసినా, చేయకూడని పనులేమిటో ఇప్పుడు తెలుసుకుందామా?
Navaratri 2022 : దుర్గాదేవిని గౌరవించే, పవిత్రమైన హిందూ పండుగే నవరాత్రి. ఈ సంవత్సరం శరద్ నవరాత్రులు సెప్టెంబర్ 26నుంచి ప్రారంభం కాబోతున్నాయి. అక్టోబర్ 5వ తేదీన విజయ దశమి, దుర్గా విసర్జనతో ఈ పండుగ ముగుస్తుంది. హిందూ మాసం అశ్విన్‌లోని శారదీయ నవరాత్రులు అన్ని నవరాత్రులలో అత్యంత ముఖ్యమైనవి. అయితే ఈ నవరాత్రి తొమ్మిది రోజులు మీరు ఎంత నిష్టగా ఉంటే.. అమ్మవారి చల్లని దీవెన మీపై అంత ఉంటుంది. మీ ఉపవాసం సక్సెస్ అవ్వాలన్నా.. మీ పూజలు ఫలించాలన్నా.. ఆ సమయంలో కొన్ని కచ్చితంగా పాటించాలి. మరి నవరాత్రి సమయంలో చేయవలసినవి, చేయకూడని పనులు కొన్ని ఉన్నాయి. అవి ఏమిటో తెలుసుకుని.. మీరు ఫాలో అయిపోయి అమ్మవారి అనుగ్రహం పొందేయండి.
నవరాత్రి వ్రతం సమయంలో చేయవలసిన, చేయకూడని పనులివే
* నవరాత్రి అనేది ఆధ్యాత్మిక అవగాహన. స్వీయ-సాక్షాత్కారం, స్వీయ-క్రమశిక్షణ, స్వీయ-నియంత్రణ కచ్చితంగా అవసరం. అందువల్ల తపస్సు చేయడం చాలా కీలకం.
* నవరాత్రి వేడుకల సందర్భంగా దుర్గాదేవిని తన తొమ్మిది రూపాలలో పూజిస్తాము. కాబట్టి ఈ పండుగ సమయంలో మీ చుట్టూ ఉన్న స్త్రీలను గౌరవించేలా మీ ప్రవర్తన ఉండాలి.
* నవరాత్రులలో ప్రారంభ స్నానం పూజా ఆచారాల తరువాత మీ అదృష్టాన్ని ప్రకాశవంతం చేస్తుంది. కాబట్టి వీటిని మరచిపోవద్దు.
* మీరు అమ్మవారికి "అఖండ జ్యోతి"ని వెలిగిస్తే.. దానిని నైరుతి దిశలో ఉంచాలని గుర్తుపెట్టుకోండి. మీరు అఖండ జ్యోతిని నిర్వహించలేకపోతే.. రాత్రంతా ఉండేలా ఒక ద్వీపాన్ని ఏర్పాటు చేయండి.
* సాధారణంగా శుద్ధి చేసిన ఉప్పు కాకుండా రాక్ సాల్ట్ వాడాలి.
* నవరాత్రి రంగులను పాటించండి.
* ఈ సమయంలో మద్యం, పొగాకుకు దూరంగా ఉండాలి.
* ఈ తొమ్మిది రోజులు కచ్చితంగా వెల్లుల్లి, ఉల్లిపాయలకు దూరంగా ఉండాలి.
సంబంధిత కథనం