Unwanted Hair remedies: అవాంఛిత రోమాల సమస్యకు.. అమ్మమ్మల కాలం నాటి పరిష్కారాలు-natural home remedies for unwanted body hair ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Unwanted Hair Remedies: అవాంఛిత రోమాల సమస్యకు.. అమ్మమ్మల కాలం నాటి పరిష్కారాలు

Unwanted Hair remedies: అవాంఛిత రోమాల సమస్యకు.. అమ్మమ్మల కాలం నాటి పరిష్కారాలు

HT Telugu Desk HT Telugu
Sep 20, 2023 11:02 AM IST

Unwanted Hair remedies: చేతులు, కాళ్లు, ముఖం మీద అవంఛిత రోమాల సమస్య ఇబ్బంది పెడుతోందా? అయితే కొన్ని చిట్కాలతో పరిష్కారం దొరుకుతుంది. ఆ సహజ సిద్ధ మార్గాలేంటో తెలుసుకోండి.

అవాంఛిత రోమాలు తొలగించే చిట్కాలు
అవాంఛిత రోమాలు తొలగించే చిట్కాలు (feepik)

టీనేజ్‌ అమ్మాయిల్లో, మహిళల్లో హార్మోనుల అసమతుల్యత వల్ల అవాంఛిత రోమాల సమస్య వస్తూ ఉంటుంది. పెదవుల పైన, గడ్డం మీద ఇలా అక్కడక్కడా రోమాలు వచ్చి ఇబ్బంది పెడుతుంటాయి. వీటికి పరిష్కారం కోసం చాలా మంది బ్యూటీ పార్లర్ల చుట్టూ తిరుగుతూ ఉంటారు. అయితే వీటిని సహజంగా ఇంట్లోనే పోగొట్టుకోవచ్చు. అందుకు అమ్మమ్మల కాలం నుంచి పాటిస్తున్న కొన్ని చిట్కాలు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. మీరూ అవాంఛిత రోమాల సమస్యతో బాధ పడుతున్నట్లయితే వీటిని పాటించి చూడండి. మంచి ఫలితాలు ఉంటాయి.

శెనగపిండితో స్క్రబ్‌ :

కొందరికి ముఖంపైనే కాకుండా శరీరంపైనా అవాంఛిత రోమాలు ఇబ్బంది పెడుతుంటాయి. శెనగ పిండితో దీనికి చక్కని పరిష్కారం ఉంది. నాలుగు స్పూన్ల శెనగ పిండికి కాస్త పెరుగును జోడించాలి. దీనిలో కాస్త లావెండర్‌ నూనె లేదా బాదం నూనెను చేర్చాలి. అన్నింటిని కలిపి మెత్తని పేస్ట్‌లా చేయాలి. దీన్ని అవాంఛిత రోమాలు ఉన్న చోట పట్టించాలి. 15 నుంచి 20 నిమిషాల పాటు ఆరనివ్వాలి. తర్వాత కొద్దిగా నలుగు పెట్టినట్లుగా చేసి చర్మాన్ని శుభ్రం చేసుకోవాలి. ఇది సహజమైన స్క్రబ్‌లా పని చేస్తుంది. ఇలా క్రమంగా చేయడం వల్ల శరీరంపై ఉండే అవాంఛిత రోమాలు మాయం అవుతాయి.

కర్పూరంతో :

కొన్ని కర్పూరం బిళ్లలను పొడి చేసి తీసుకోవాలి. దానికి రెండు స్పూన్ల తెల్ల మిరియాల పొడిని కలపాలి. కాస్త బాదం నూనెను జోడించి పేస్ట్‌లా చేయాలి. అవాంఛిత రోమాలపై దాన్ని రాసుకుని 15 నిమిషాల పాటు వదిలేయాలి. తర్వాత గోరు వెచ్చని నీటితో కడిగేసుకోవాలి. రెండు నెలల పాటు వారానికి ఒకసారి చొప్పున దీన్ని చేస్తూ వెళితే మెల్లగా అక్కడ వెంట్రుకలు రావడం తగ్గిపోవడాన్ని మీరు గమనిస్తారు.

మొక్క జొన్న పిండితో :

దీన్ని బెస్ట్‌ నేచురల్‌ హెయిర్‌ రిమూవల్‌ పీల్‌ మాస్క్‌ అని చెబుతారు. అర కప్పు మొక్కజొన్న పిండిని తీసుకోవాలి. అందులో కాస్త పాలను కలిపి బాగా పేస్ట్‌లా చేయాలి. దాన్ని రాసుకుని 20 నిమిషాల పాటు అలా వదిలేయాలి. అది కాస్త ఆరిన తర్వాత పీలాఫ్‌ చేస్తే రోమాలు దానితోపాటే ఊడిపోతాయి. ఈ మిశ్రమం రోమాల కుదుళ్లలో గట్టిగా పట్టుకుని ఆరోపోతుంది. దాన్ని లాగినప్పుడు అక్కడున్న వెంట్రుకలూ ఊడి వచ్చేస్తాయి. అయితే ఇది చాలా గట్టి వెంట్రకలు ఉన్న వారికి పనికి రాదు. తక్కువ మందంతో ఉన్న వాటికి మాత్రమే పని చేస్తుంది.