National Watermelon Day: పుచ్చకాయను తినకుండానే మీ చర్మాన్ని మెరిపించుకోండిలా
National Watermelon Day: వేసవి రోజుల్లో చల్లని పుచ్చకాయ తినడం వల్ల శరీరానికి ఉపశమనం లభిస్తుంది. ఆగస్టు 3న జాతీయ పుచ్చకాయ దినోత్సవం నిర్వహించుకుంటారు. ఈ సందర్భంలో పుచ్చకాయ తినడం వల్ల ముఖం కాంతిని పెంచుకోవచ్చు.
పుచ్చకాయ వేసవిలో ఎక్కువగా తినే పండు. దీనిలో విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇది నీరు సమృద్ధిగా ఉండే హైడ్రేటింగ్ పండు. దాని పోషక లక్షణాల కారణంగా దీన్ని తినేందుకే కాదు, చర్మా సౌందర్యాన్ని పెంచుకోవడానికి ఉపయోగించవచ్చు. పుచ్చకాయలో మీ చర్మ సంరక్షణ దినచర్యలో దీన్ని చేర్చుకోవచ్చు. ఇందులో ఒక్క ముక్క చాలు ముఖం కాంతివంతంగా మారుతుంది. ప్రతి ఏడాది ఆగస్టు 3న జాతీయ పుచ్చకాయ దినోత్సవాన్ని నిర్వహించుకుంటారు.. ఈ సందర్భంగా పుచ్చకాయను చర్మంపై ఏయే రకాలుగా ఉపయోగించవచ్చో తెలుసుకోండి.
ముఖాకి అందమైన మెరుపును ఇవ్వడానికి పుచ్చకాయ పండును ఉపయోగించవచ్చు. చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడే అనేక పండ్లు, కూరగాయలు ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనది పుచ్చకాయ ఒకటి. దీన్ని ఎలా ఉపయోగించడం ద్వారా పుచ్చకాయను వినియోగించాలో తెలుసుకోండి.
ఫేషియల్ టోనర్
పుచ్చకాయను ఫేషియల్ టోనర్ గా ఉపయోగించవచ్చు. ఇందుకోసం ఒక చిన్న పుచ్చకాయ ముక్కను కట్ చేసి దాని రసాన్ని తీయాలి. రసాన్ని టోనర్ గా మీ ముఖం అంతటా అప్లై చేయడానికి కాటన్ ప్యాడ్ ఉపయోగించండి. పుచ్చకాయలో విటమిన్ ఎ, విటమిన్ సి పుష్కలంగా ఉన్నాయి. ఇవి మీ చర్మాన్ని విశ్రాంతి తీసుకోవడానికి, హైడ్రేట్ చేయడానికి సహాయపడతాయి.
పుచ్చకాయతో ఫేస్ మాస్క్
పుచ్చకాయ సహాయంతో, మీరు ఫేస్ మాస్క్ తయారు చేయవచ్చు. ఇందుకోసం రెండు టేబుల్ స్పూన్ల మెత్తని పుచ్చకాయ గుజ్జులో, ఒక టేబుల్ స్పూన్ తేనె మిక్స్ చేసి ముఖానికి అప్లై చేయాలి. ఈ ఫేస్ మాస్క్ మీ చర్మాన్ని ఎక్స్ ఫోలియట్ చేయడానికి, ప్రకాశవంతం చేయడానికి సహాయపడుతుంది.
పుచ్చకాయ లిప్ స్క్రబ్
వాటర్ మెలన్‌తో లిప్ స్క్రబ్ తయారు చేసుకోవచ్చు. ఇందుకోసం ఒక టీస్పూన్ మెత్తని పుచ్చకాయ గుజ్జు, ఒక టీస్పూన్ పంచదార, ఒక టీస్పూన్ కొబ్బరి నూనె కలపాలి. తర్వాత ఈ మిశ్రమాన్ని పెదవులకు అప్లై చేసి ఎక్స్ ఫోలియేట్ చేయాలి.
పుచ్చకాయ ఫేస్ మిస్ట్
మీ చర్మం ప్రకాశవంతంగా, తాజాగా కనిపించాలంటే, మిస్ట్ చేయండి. దీని కోసం, పుచ్చకాయ రసాన్ని స్ప్రే బాటిల్లో నింపి, రోజంతా మీ ముఖంపై చల్లండి. దీన్ని రోజ్ వాటర్ లా ఉపయోగించండి. ఇది చర్మం పై ఉన్న మురికిని పొగొడుతుంది.
పుచ్చకాయలో 92 శాతం నీరు ఉంటుంది. ఇది శరీరాన్ని హైడ్రేటెడ్ గా ఉంచుతుంది. పుచ్చకాయ తినడం వల్ల చర్మం కూడా పరిశుభ్రమవుతుంది. ఈ పండు తినడం వల్ల ఆస్తమా, గుండెపోటు, క్యాన్సర్ వంటి వ్యాధులు రాకుండా అడ్డుకుంటుంది. కాబట్టి పిల్లలు, పెద్దలు కచ్చితంగా తినాల్సిన పండ్లలో పుచ్చకాయ ఒకటి. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతుంది. కాబట్టి డయాబెటిస్ రోగులు ఈ పండ్లను తినడం చాలా అవసరం.
పుచ్చకాయలో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. అలాగే అజీర్ణం, గ్యాస్ట్రిక్, మలబద్ధకం వంటి సమస్యలు రాకుండా ఉంటాయి. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు కూడా అధికంగా ఉంటాయి. ఫ్రీ రాడికల్స్ నుంచి యాంటీ ఆక్సిడెంట్లు కాపాడతాయి.