పిల్లలను పెంచడంలో తల్లిదండ్రుల ప్రేమ, త్యాగం అంకితభావాన్ని గౌరవించడానికి, అభినందించడానికి జాతీయ తల్లిదండ్రుల దినోత్సవం అంకితం చేశారు. పిల్లలు తమ తల్లిదండ్రులు పట్ల వారి కృతజ్ఞత, ఆప్యాయతను వ్యక్తీకరించడానికి ప్రత్యేక రోజుగా భావిస్తారు. జీవితంలో ఎదురయ్యే సవాళ్లలో పిల్లలకు మార్గనిర్దేశం చేయడంలో తల్లిదండ్రుల ప్రేమ, మద్దతు కీలకం. జాతీయ తల్లిదండ్రుల దినోత్సవాన్ని వారి అచంచల నిబద్ధతకు ధన్యవాదాలు తెలియజేయడానికి సరైన సందర్భం. ఈ రోజు గురించి మరిన్ని వివరాలు తెల్సుకుందాం.
జాతీయ తల్లిదండ్రుల దినోత్సవం ప్రతి సంవత్సరం జూలై నెలలో నాల్గవ ఆదివారం జరుపుకుంటారు. ఈ సంవత్సరం జూలై 28 ఆదివారం ఈ ప్రత్యేక దినం జరుపుకుంటున్నాం. 1994 లో అధ్యక్షుడు బిల్ క్లింటన్ జూలై నాల్గవ ఆదివారాన్ని తల్లిదండ్రులను గౌరవించే రోజుగా ప్రకటిస్తూ తీర్మానంపై సంతకం చేయడంతో జాతీయ తల్లిదండ్రుల దినోత్సవం మొదలైంది.
పిల్లల జీవితాలను రూపొందించడంలో తల్లిదండ్రుల నిస్వార్థ ప్రేమ, త్యాగాలు, మార్గదర్శకత్వాన్ని గౌరవించడానికి కి అంకిం చేసిన వేడుక ఇది. బలమైన కుటుంబ బంధాలను నిర్మించడంలో, భవిష్యత్ తరాల మనుగడకోసం తల్లిదండ్రులు పోషించే ముఖ్యమైన పాత్రను ఈ ప్రత్యేక రోజు గుర్తిస్తుంది. తల్లిదండ్రులు లేదా తల్లిదండ్రుల లాంటి వ్యక్తులకు కృతజ్ఞత, ఆప్యాయతను వ్యక్తం చేయాలని ఈరోజు మనకు గుర్తుచేస్తుంది.
ప్రపంచంలోనే గొప్ప తల్లిదండ్రులకు నేషనల్ పేరెంట్స్ డే శుభాకాంక్షలు. మీ సహకారం, అంతులోనే ప్రేమే నాకు గొప్ప దీవెనలు.
హ్యాపీ నేషనల్ పేరెంట్స్ డే! మీ ప్రేమ, మార్గదర్శకత్వమే ఈరోజు నన్నిలా తీర్చిదిద్దాయి. మీరు నాకోసం చేసిన ప్రతిదానికి ధన్యావాదాలు.
నామీద ఎప్పుడూ నమ్మకం ఉంచి నిస్వార్థంగా ప్రేమించిన మీకు.. హ్యాపీ నేషనల్ పేరెంట్స్ డే.
ఉత్తమ తల్లిదండ్రులకు, జాతీయ తల్లిదండ్రుల దినోత్సవ శుభాకాంక్షలు! మీ సహకారం, తెలివితేటలే నాకు ప్రపంచం. లవ్ యూ ఇద్దరికీ!
హ్యాపీ నేషనల్ పేరెంట్స్ డే! నా జీవితానికి పునాది వేసింది మీరే. మీ త్యాగమే నా కలలకు బాటలు వేసింది.
అత్యంత అద్భుతమైన తల్లిదండ్రులకు జాతీయ తల్లిదండ్రుల దినోత్సవ శుభాకాంక్షలు. మీ ప్రయాణం, ప్రేమ నిజంగా స్ఫూర్తిదాయకం.
జాతీయ తల్లిదండ్రుల దినోత్సవం సందర్భంగా అత్యంత అద్భుతమైన తల్లిదండ్రులకు నా ప్రేమను తెలియజేస్తున్నాను.
జాతీయ తల్లిదండ్రుల దినోత్సవం సందర్భంగా మీ ప్రేమ, త్యాగాలను నేను సెలబ్రేట్ చేయాలనుకుంటున్నాను, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.
మీలాంటి తల్లిదండ్రులే ఎవరికైనా కావాలి అని ఉంటుంది. మీ ఇద్దరికీ హ్యాపీ పేరెంట్స్ డే. మీ అంతులేని ఓర్పు, ప్రేమ, ప్రోత్సాహమే నా మార్పుకు కారణం.
నా జీవితం ఒక సినిమా అయితే ఆ స్ఫూర్తి దాయక కథలో మీరే తారలు, దర్శకులు. హ్యాపీ నేషనల్ పేరెంట్స్ డే!
హ్యాపీ నేషనల్ పేరెంట్స్ డే! మీ ప్రేమ నా జీవితంలోని ప్రతిరోజూ అర్థవంతంగా, ఆనందంగా మారుస్తుంది. నా సూపర్ హీరోలు అయినందుకు ధన్యవాదాలు.
నా జీవితాన్ని ప్రేమతో, అంతులేని ఆనందంతో నింపిన జంటకు జాతీయ తల్లిదండ్రుల దినోత్సవ శుభాకాంక్షలు.
టాపిక్