National girl child day 2025: ఆడపిల్లలకు ఆడంబరంగా పెళ్లి చేసి పంపించేయకండి, ఇంట్లో సమాన హక్కులు ఇవ్వండి
National girl child day 2025: బాలికల సాధికారత, విద్య కోసం ఏర్పాటు చేసిందే నేషనల్ గర్ల్ చైల్డ్ డే. దీని ఏర్పాటు వెనుక ఉన్న ఉద్దేశాన్ని ప్రతి తల్లిదండ్రులు తెలుసుకోవాలి. వారికి సమాన హక్కులు కల్పించాలి.
భారతీయ సమాజంలో బాలికలు ఎదుర్కొంటున్న సవాళ్లను వెలుగులోకి తీసుకురావడానికి జాతీయ బాలికా దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం నిర్వహించుకుంటారు. ఆడపిల్ల ఇంట్లో పుడితే ఒకప్పుడు ఆనందించే వారు కాదు, మూతి ముడుచుకుని పక్కకి వెళ్లిపోయారు. చూసేందుకు కూడా ఇష్టపడని సమాజం ఉండేది. ఇప్పుడు కాలం మారుతూ వస్తోంది. ఆడపిల్లలు కూడా చదువులో, ఉద్యోగాల్లో రాణిస్తున్నారు. వారు కూడా మగవారితో సమానంగా పనిచేయగలుగుతున్నారు. వారికి కావాల్సిందల్లా కాసింత మద్దతు. ఆ మద్దతును తొలిగా ఇవ్వాల్సింది తల్లిదండ్రులే. కొడుకుతో సమానంగా కూతురుని చదివించి ఉద్యోగానికి పంపించే తల్లిదండ్రులనే ఇప్పుడు ప్రతి ఆడపిల్ల కోరుకుంటుంది. కానీ ఇప్పటికీ ఆడపిల్లల్ని చదివిస్తున్నా ఉద్యోగానికి పంపకుండా పెళ్లి చేసే తల్లిదండ్రులు ఇంకా ఉన్నారు. ఆడపిల్ల కేవలం పెళ్లి కోసమే పుట్టినట్ట భావించకుండా… వారి కలలకు రెక్కలివ్వాలి. ఆ పనిచేయాల్సింది తల్లిదండ్రులే. ఆడపిల్ల బరువు కాదు, మీ కుటుంబానికి బంగారు భవిష్యత్తు అని గుర్తించండి.
బాలికలు తరచూ వివక్షను ఎదుర్కొంటూనే ఉంటారు. వారు ఎదుర్కొనే అన్యాయాలను ఎత్తిచూపుతూ విద్య, ఆరోగ్య సంరక్షణ, పోషకాహారం విషయంలో సమాన హక్కులు కల్పించడం కోసం ప్రతి ఏటా జాతీయ బాలికా దినోత్సవం నిర్వహించుకుంటారు. ప్రతి అమ్మాయిని గౌరవంగా చూడటం, వారికి విద్యను అందించడం, వారి ఆరోగ్యం, శ్రేయస్సుపై దృష్టి సారించి, వారు అభివృద్ధి చెందడానికి సమాన అవకాశాలను కల్పించేలా చేయమని చెప్పేందుకే ఈ ప్రత్యేక దినోత్సవం.
జాతీయ బాలికా దినోత్సవం చరిత్ర
జాతీయ బాలికా దినోత్సవం ప్రతి సంవత్సరం జనవరి 24 న నిర్వహించుకుంటారు. 2015 జనవరి 22న ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించిన బేటీ బచావో, బేటీ పడావో (సేవ్ ది గర్ల్ చైల్డ్, ఎడ్యుకేట్ ది గర్ల్ చైల్డ్) పథకం వార్షికోత్సవాన్ని కూడా ఇదే రోజు చేసుకుంటారు. మహిళా శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖ 2008 లో స్థాపించిన ఈ దినోత్సవం ఆడపిల్లల సాధికారత, రక్షణ ప్రాముఖ్యతను హైలైట్ చేస్తుంది.
జాతీయ బాలికా దినోత్సవం ప్రాముఖ్యత
లింగ అసమానత, విద్యకు పరిమిత ప్రాప్యత, అధిక డ్రాపవుట్ రేట్లు, బాల్య వివాహాలు, లింగ ఆధారిత హింస కొనసాగుతున్న దేశంలో, ఈ చొరవ చాలా ప్రాముఖ్యతను కలిగి ఉంది. జాతీయ బాలికల దినోత్సవం వివక్షను ఎదుర్కోవాల్సిన ఆవశ్యకతపై అవగాహన కల్పిస్తూ బాలికలు ఎదుర్కొంటున్న ప్రత్యేక సవాళ్లను ఎత్తిచూపడానికి ప్రయత్నిస్తుంది. ఆరోగ్యం, విద్య మొత్తం శ్రేయస్సుపై వారి హక్కుల కోసం ఈ దినోత్సవం వాదిస్తుంది. ప్రతి ఆడపిల్లను పోషించే, మద్దతు ఇచ్చే మరింత సమ్మిళిత సమాజాన్ని పెంపొందించడానికి కృషి చేస్తుంది.
జాతీయ బాలికా దినోత్సవం శుభాకాంక్షలు
1. ఆడపిల్ల అనేది ఒక ఆశీర్వాదం, భారం కాదు
వారి కలలను సాకారం చేయడానికి మనం వారిని గౌరవించాలి
శక్తివంతం చేయాలి
హ్యాపీ నేషనల్ గర్ల్ చైల్డ్ డే!
2. ఈ జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా
అడ్డంకులను అధిగమించి ప్రతి అమ్మాయి ఎదిగే అవకాశాలను సృష్టిద్దాం!
హ్యాపీ నేషనల్ గర్ల్ చైల్డ్ డే!
3. ప్రతి అమ్మాయి కలలు కనడానికి
సాధించడానికి స్వేచ్ఛగా ఉండే ప్రపంచాన్ని నిర్మిద్దాం.
హ్యాపీ నేషనల్ గర్ల్ చైల్డ్ డే.
4. ఒక అమ్మాయిని చదివించండి,
ఒక తరానికి సాధికారత కల్పించండి.
జాతీయ బాలికా దినోత్సవ శుభాకాంక్షలు.
5. అమ్మాయిలు ఉజ్వల భవిష్యత్తుకు రూపకర్తలు.
వారికి విజయం సాధించే సాధనాలను అందిద్దాం.
హ్యాపీ నేషనల్ గర్ల్ చైల్డ్ డే!
6. ప్రతి ఆడబిడ్డకు సాధికారత, విద్య, ఉన్నతి కల్పించాలి.
వారే రేపటి నిజమైన ఛేంజ్ మేకర్లు.
హ్యాపీ నేషనల్ గర్ల్ చైల్డ్ డే!
7. బాలికలు విద్యావంతులైతే,
వారి దేశాలు మరింత బలపడతాయి
మరింత సంపన్నంగా ఉంటాయి - మిషెల్ ఒబామా
8. ఒక అమ్మాయికి సరైన అవకాశాలు ఇవ్వండి,
ఆమె ప్రపంచాన్ని జయించగలదు - మార్లిన్ మన్రో
టాపిక్