National Girl Child Day 2024 : నేషనల్ గర్ల్ చైల్డ్ డే.. బాలికలకు ఈ పరీక్షలు తప్పనిసరిగా చేయించాలి-national girl child day 2024 these health checkups must to every girl ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  National Girl Child Day 2024 : నేషనల్ గర్ల్ చైల్డ్ డే.. బాలికలకు ఈ పరీక్షలు తప్పనిసరిగా చేయించాలి

National Girl Child Day 2024 : నేషనల్ గర్ల్ చైల్డ్ డే.. బాలికలకు ఈ పరీక్షలు తప్పనిసరిగా చేయించాలి

Anand Sai HT Telugu
Jan 22, 2024 09:30 AM IST

National Girl Child Day 2024 : ప్రతీ ఏటా జనవరి 24న నేషనల్ గర్ల్ చైల్డ్ డే నిర్వహిస్తారు. అయితే బాలికల ఆరోగ్యంపై కచ్చితంగా శ్రద్ధ వహించాలి. ఇందుకోసం వారికి కొన్ని ఆరోగ్య పరీక్షలు చేయించాలి.

నేషనల్ గర్ల్ చైల్డ్ డే
నేషనల్ గర్ల్ చైల్డ్ డే (Unsplash)

ప్రతి సంవత్సరం జనవరి 24న జాతీయ బాలికా దినోత్సవాన్ని జరుపుకొంటారు. విద్య, ఆరోగ్యం, పోషకాహార రంగాలలో బాలికల గురించి ఈ సందర్భంగా చర్చ జరుగుతుంది. భారత ప్రభుత్వం మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది. నిజానికి బాలికలు అనేక శారీరక సవాళ్లను ఎదుర్కొంటారు. యుక్తవయస్సు వచ్చిన తర్వాత శారీరక మార్పులకు లోనవుతారు. పోషకాహార లోపంతో బాధపడే మహిళల్లో కొన్ని ఆరోగ్య సమస్యలు కూడా వస్తాయి. బాలికల ఆరోగ్యం చూసుకునేందుకు కొన్ని పరీక్షలు తరచూ చేయించుకోవాలి.

yearly horoscope entry point

బాలికల్లో రక్తహీనత సర్వసాధారణం. పూర్తి రక్త గణన (CBC) పరీక్ష చేయించాలి. ఈ పరీక్ష ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలు, ప్లేట్‌లెట్ కౌంట్ గురించి సమాచారాన్ని చెబుతుంది. రక్తహీనత, అంటువ్యాధులు, రోగనిరోధక వ్యవస్థకు సంబంధించిన వ్యాధులతో సహా అనేక ఆరోగ్య పరిస్థితులను CBC పరీక్ష నిర్ధారిస్తుంది. అలసట, బరువు తగ్గడం, జ్వరం, బలహీనత వంటి లక్షణాలను ఎదుర్కొంటున్న వారికి, CBC పరీక్షను చేయడం అనేది మంచిది.

ఐరన్ లోపం వల్ల రక్తహీనత వంటి వ్యాధులు వస్తాయి. శరీరం తగినంత ఎర్ర రక్త కణాలను ఉత్పత్తి చేయనప్పుడు రక్తహీనత సాధారణంగా వస్తుంది. సరైన ఆహారం, ఐరన్ సప్లిమెంట్లు, ఐరన్ స్థాయిలను క్రమం తప్పకుండా పర్యవేక్షించడం ద్వారా ఈ పరిస్థితులను సమర్థవంతంగా నిర్వహించవచ్చు. ఐరన్ టెస్ట్ కూడా చేయించుకోవాలి.

విటమిన్ ప్రొఫైల్ పరీక్ష కూడా బాలికలకు అవసరం. విటమిన్ D, B12 మంచి ఆరోగ్యానికి ముఖ్యమైనవి. విటమిన్ డి లోపంతో ఎముకలపై ప్రభావం పడుతుంది. విటమిన్ B12 తక్కువ స్థాయిలో రక్తహీనతకు కారణమవుతుంది. కండరాల బలహీనత, అలసట, ఎముక వైకల్యాలు, నొప్పిని ఎదుర్కొంటున్న వారి కోసం విటమిన్ స్థాయిలను తనిఖీ చేయాలి.

మైక్రో యూరినాలిసిస్ అనేది మూత్రంలో సూక్ష్మజీవులను గుర్తించడానికి ఉపయోగపడుతుంది. మూత్రంలోని మైక్రోస్కోపిక్ భాగాలను మూల్యాంకనం చేసే ఒక రోగనిర్ధారణ పద్ధతి ఇది. కడుపు నొప్పి, మూత్రవిసర్జనలో ఇబ్బందులు, మూత్రంలో రక్తం, మండడం వంటి లక్షణాలు ఉండేవారు మూత్ర పరీక్ష చేయించుకోవాలి.

కంటి పరీక్ష చేయించుకోవడం దగ్గరి చూపు, దూరం చూపును అంచనా వేయడానికి, ఆప్టిక్ నరాలు, లెన్స్‌ల ఆరోగ్యాన్ని అంచనా వేయడానికి సహాయపడుతుంది. సరైన దృష్టి కోసం బాలికలకు ఇది ఉపయోగపడుతుంది. మీ దృష్టిని సరిగా చేసేందుకు ఇది అవసరం.

బాలికల్లో యుక్తవయస్సు ఆలస్యమైతే, హార్మోన్స్ మీద ప్రభావం ఉంటుంది. హార్మోన్స్ పరీక్ష పాలీసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్, థైరాయిడ్ పనిచేయకపోవడం, పునరుత్పత్తి ఆరోగ్యం, అడ్రినల్ గ్రంథి పనితీరును నిర్ధారించడంలో సహాయపడుతుంది. మీ హార్మోన్ల ఆరోగ్యం రుతుక్రమం లోపాలు, హార్మోన్ల రుగ్మతల వంటి పరిస్థితులను నిర్వహించడంలో మీకు ఉపయోగపడుతుంది. బాలికలు ఆరోగ్యంగా ఉంటేనే మానసికంగానూ, శరీరకంగానూ ఎదుగుతారు.

Whats_app_banner