Daughter's Day wishes: మీ ముద్దుల కూతురికి డాటర్స్ డే శుభాకాంక్షలు ఇలా చెప్పేయండి, వాట్సాప్ స్టేటస్, ఫొటోలు మీకోసం-national daughters day wishes 2024 whatsapp facebook status messages photos ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Daughter's Day Wishes: మీ ముద్దుల కూతురికి డాటర్స్ డే శుభాకాంక్షలు ఇలా చెప్పేయండి, వాట్సాప్ స్టేటస్, ఫొటోలు మీకోసం

Daughter's Day wishes: మీ ముద్దుల కూతురికి డాటర్స్ డే శుభాకాంక్షలు ఇలా చెప్పేయండి, వాట్సాప్ స్టేటస్, ఫొటోలు మీకోసం

Koutik Pranaya Sree HT Telugu
Sep 22, 2024 05:00 AM IST

Daughter's Day wishes: సెప్టెంబర్ నెలలో నాలుగో ఆదివారాన్ని నేషనల్ డాటర్స్ డే గా జరుపుకుంటారు. ఆడపిల్లల ప్రత్యేకతను, ప్రేమను చాటిచెప్పే ప్రత్యేక దినం ఇది. మీ కూతురికి కూడా డాటర్స్ డే శుభాకాంక్షలు ఈ మెసేజ్‌లతో తెలిపేయండి.

నేషనల్ డాటర్స్ డే
నేషనల్ డాటర్స్ డే (HT Photo)

జాతీయ కుమార్తెల దినోత్సవం లేదా నేషనల్ డాటర్స్ డే మన జీవితంలో కూతుర్ల అమూల్యమైన ప్రేమను, అనురాగాన్ని గుర్తుచేసే ప్రత్యేక సందర్భం. ఈ ఏడు సెప్టెంబర్ 22, 2024 న ఈ ప్రత్యేక సందర్భాన్ని జరుపుకుంటున్నాం. ఏళ్ల నుంచి కుమారులను మాత్రమే వారసులుగా పరిగణించే సాంప్రదాయం వస్తోంది. ఆ అభిప్రాయం మార్చి కూతుర్లూ వాళ్లతో పాటే సమాజంలో, కుటుంబంలో సమానం అనే గొప్ప సారాంశాన్నీ ఈ రోజు చెబుతుంది.

ఈ రోజున మీ ముద్దుల కూతురికి శుభాకాంక్షలు చెప్పి మరింత ప్రత్యేకంగా చేసేయండి. మీ మనసులో తన మీదున్న ప్రేమను వ్యక్తపరిచే మంచి సందర్భం ఇది. అందుకే మీకోసం కొన్ని మెసేజ్‌లు, ఫొటోలు అందిస్తున్నాం. వీటిని మీ సోషల్ మీడియాలోనూ షేర్ చేసుకోండి.

నేషనల్ డాటర్స్ డే శుభాకాంక్షల మెసేజ్‌లు, ఫొటోలు:

1. నీ నవ్వు మా చెవులకు సంగీతం. నీ ఆనందం మాకు ఊపిరి. మా ముద్దుల కూతురికి హ్యాపీ డాటర్స్ డే.

2. ఇంట్లో కొడుకు ఉంటే అదృష్టం పెరుగుతుంది 

    కానీ కూతుళ్లు అదృష్టం ఉంటేనే పుడతారు. 

     హ్యాపీ డాటర్స్ డే

3. నా ముద్దుల కూతురికి డాటర్స్ డే శుభాకాంక్షలు. నీ కోరికలన్నీ నెరవేరాలి. నీ హృదయం ఆనందంతో నిండిపోవాలి. లవ్ యూ. 

4. గుండెల్లోని దుఃఖాలన్నింటినీ దాచిపెట్టుకుని

    ఇంట్లో ఆనందాన్ని పంచేది కూతుళ్లే.

    హ్యాపీ డాటర్స్ డే

5.  ఎంతమంది కలిసి ప్రార్థించారో తెలీదు కానీ

  ఆ దేవుడు లోకానికి ఇచ్చిన గొప్ప బహుమతి ఆడపిల్లలే

హ్యాపీ డాటర్స్ డే

సెప్టెంబర్ చివరి ఆదివారం డాటర్స్ డే జరుపుకుంటారు
సెప్టెంబర్ చివరి ఆదివారం డాటర్స్ డే జరుపుకుంటారు (Freepik)

6. నువ్వు మాకు దొరికిన విలువైన నిధి. ఆ దేవుడిచ్చిన అమూల్యమైన ఆశీర్వాదం. ఈ ప్రపంచంలో ఉన్న సంతోషాలన్నీ నీకు దక్కాలని కోరుకుంటున్నాం. 

7. ప్రియమైన కూతురా.. నీమీద మాకు పూర్తి నమ్మకం ఉంది. నీ కలలను, లక్ష్యాలను సాకారం చేసుకోడానికి మా మద్దతు నీకెప్పుడూ ఉంటుంది. 

8.  ఈ ప్రత్యేకమైన రోజున నువ్వు మా జీవితాల్లో తీసుకొచ్చిన ఆనందాన్ని ప్రత్యేకంగా గుర్తు చేసుకుంటాం. హ్యాపీ డాటర్స్ డే.

నేషనల్ డాటర్స్ డే శుభాకాంక్షలు
నేషనల్ డాటర్స్ డే శుభాకాంక్షలు (Freepik)

9. హ్యాపీ నేషనల్ డాటర్స్ డే. నీకు నచ్చిన పని చేస్తూ విజయం దిశగా పయనించు. నీకోసం మేమున్నాం అని గుర్తుంచుకో.

10. హ్యాపీ డాటర్స్ డే. నీ ధైర్యంతో నీ చుట్టూ ఉన్నవాళ్లలో స్ఫూర్తి నింపు.

11. హ్యాపీ నేషనల్ డాటర్స్ డే. నీ చిరునవ్వు మా జీవితాల్లో మరింత వెలుగు నింపుతుంది. నిన్ను చూసి మేం చాలా గర్వపడుతున్నాం.

లింగ బేధం వద్దని గుర్తు చేసే ప్రత్యే రోజు నేషనల్ డాటర్స్ డే
లింగ బేధం వద్దని గుర్తు చేసే ప్రత్యే రోజు నేషనల్ డాటర్స్ డే (Freepik)

12. నువ్వు మాతో ఉంటే ఈ ప్రపంచం అంతా కొత్తగా, ఆనందంగా కనిపిస్తుంది. హ్యాపీ డాటర్స్ డే. 

13. నీ కలలు, కోరికలు, లక్ష్యాలు మాకు చాలా ముఖ్యం. నీమీద నువ్వు నమ్మకంతో ముందుకు కదులు. అనుకున్నది సాధించు. 

జాతీయ కుమార్తెల దినోత్సవ శుభాకాంక్షలు
జాతీయ కుమార్తెల దినోత్సవ శుభాకాంక్షలు (Freepik)

14. నువ్వేం అనుకున్నా అది సాధించే సత్తా నీలో ఉంది. అదే నమ్మకంతో ప్రతిదీ సాధించు. హ్యాపీ డాటర్స్ డే. 

15. నీమీద మాకున్న ప్రేమ ఎంతుందో చెప్పలేం. ముద్దుల కూతురికి హ్యాపీ డాటర్స్ డే. 

వాట్సాప్, ఫేస్‌బుక్ మెసేజ్‌లు
వాట్సాప్, ఫేస్‌బుక్ మెసేజ్‌లు (Freepik)

16. నా ప్రియమైన కూతురికి సింహం లాంటి బలం ఉంది. దేవత లాంటి మనసుంది. ఇలాగే ప్రతిరోజూ ఆనందంగా జీవించు. హ్యాపీ డాటర్స్ డే.

17. నీ సత్తాకు హద్దులు లేవు. నీ భవిష్యత్తులో నువ్వు అనుకున్న విజయాలన్నీ సాధించాలి. హ్యాపీ నేషనల్ డాటర్స్ డే.

నేషనల్ డాటర్స్ డే ఫొటోలు
నేషనల్ డాటర్స్ డే ఫొటోలు (Freepik)

18. నేను కోరుకున్న కోరికలకు, నేను గన్న కలలకు నువ్వే జవాబు. నువ్వు నాకు పుట్టినందుకు నా ఆనందానికి హద్దులు లేవు. హ్యాపీ డాటర్స్ డే.

19. నీ ప్రయాణం ఇప్పుడే మొదలైంది. నువ్వు ఎంత పెద్ద విజయం సాధించబోతున్నావో అని వేచి చూస్తున్నాం. నువ్వు అనుకున్న అన్ని పనులు జరగాలని కోరుకుంటున్నా. హ్యాపీ డాటర్స్ డే.

హ్యాపీ డాటర్స్ డే
హ్యాపీ డాటర్స్ డే (HT photo)

టాపిక్