NABARD Recruitment 2022: డిగ్రీ అర్హతతో నాబార్డ్‌లోఉద్యోగాలు.. పూర్తి వివరాలివే!-nabard development assistant recruitment 2022 check vacancy eligibility and other details here ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Nabard Recruitment 2022: డిగ్రీ అర్హతతో నాబార్డ్‌లోఉద్యోగాలు.. పూర్తి వివరాలివే!

NABARD Recruitment 2022: డిగ్రీ అర్హతతో నాబార్డ్‌లోఉద్యోగాలు.. పూర్తి వివరాలివే!

HT Telugu Desk HT Telugu
Sep 08, 2022 03:25 PM IST

NABARD Development Assistant Recruitment 2022:నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ & రూరల్ డెవలప్‌మెంట్ (నాబార్డ్) డెవలప్‌మెంట్ అసిస్టెంట్ పోస్టుల కోసం నియామకం కోసం త్వరలో నోటిఫికేషన్ విడుదల చేయనుంది. నాబార్డ్‌ ఈ రిక్రూట్ ద్వారా మొత్తం 177 డెవలప్‌మెంట్ అసిస్టెంట్ ఖాళీలను భర్తీ చేయనుంది.

<p>NABARD Recruitment 2022</p>
<p>NABARD Recruitment 2022</p>

నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్‌మెంట్ (నాబార్డ్) డెవలప్‌మెంట్ అసిస్టెంట్, డెవలప్‌మెంట్ అసిస్టెంట్ (హిందీ), గ్రూప్ బి పోస్టులను రిక్రూట్ చేయబోతోంది. నాబార్డ్ త్వరలో ఈ పోస్టుల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేయనుంది. ఈ పోస్టులకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. నాబార్డ్ వెబ్‌సైట్‌ ద్వారా అభ్యర్థులకు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. నాబార్డ్‌ ఈ రిక్రూట్ ద్వారా మొత్తం 177 డెవలప్‌మెంట్ అసిస్టెంట్ ఖాళీలను భర్తీ చేయనుంది.

నాబార్డ్ రిక్రూట్‌మెంట్ 2022 ఖాళీల వివరాలు

డెవలప్‌మెంట్ అసిస్టెంట్ - 82 పోస్టులు

డెవలప్‌మెంట్ అసిస్టెంట్-హిందీ - 9 పోస్టులు

నాబార్డ్ డెవలప్‌మెంట్ అసిస్టెంట్ ముఖ్యమైన తేదీలు

ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ - 15 సెప్టెంబర్ 2022

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ -10 అక్టోబర్ 2022

NABARD DA పరీక్ష తేదీ - ప్రకటించబడుతుంది

నాబార్డ్ డెవలప్‌మెంట్ అసిస్టెంట్ పోస్ట్‌కి అర్హతలు

నాబార్డ్ డెవలప్‌మెంట్ అసిస్టెంట్- అభ్యర్థులు కనీసం 50% మార్కులతో ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేట్ అయి ఉండాలి.

డెవలప్‌మెంట్ అసిస్టెంట్ హిందీ- అభ్యర్థి కనీసం 50% మార్కులతో హిందీ లేదా ఆంగ్లంలో గ్రాడ్యుయేట్ అయి ఉండాలి .

నాబార్డ్ డెవలప్‌మెంట్ అసిస్టెంట్ జీతం

నెలకు రూ. 32000

డెవలప్‌మెంట్ అసిస్టెంట్ - రూ. 13150-750(3)- 15400-900(4)-19000-1200(6)-26200-1300(2)-28800-1480(3)-33240-1750(1)-34990 (20 సంవత్సరాలు)

డెవలప్‌మెంట్ అసిస్టెంట్ (హిందీ) - రూ. 13150-750(3)- 15400-900(4)-19000-1200(6)-26200-1300(2)-28800-1480(3)-33240-1750(1)-34990(20 సంవత్సరాలు)

NABARD డెవలప్‌మెంట్ అసిస్టెంట్ పోస్టుకు వయోపరిమితి

21 నుండి 35 సంవత్సరాలు

నాబార్డ్ దరఖాస్తు రుసుము:

జనరల్/OBC/ EWS రూ.450

SC/ST/PWD/EWS/Ex-Servicemen రూ. 50

సంబంధిత కథనం