మనలో చాలా మందికి ఆవనూనెను కేవలం పూజలకు మాత్రమే వినియోగిస్తారని తెలుసు. కొన్ని ప్రాంతాలలో దీనిని వంటకాలలోకి కూడా ఉపయోగిస్తారట. ఈ నూనె నుంచి వచ్చే వాసన కారణంగా మనలో చాలా మందికి దీనిని వంటనూనెగా వినియోగిస్తే నచ్చకపోవచ్చు. కానీ, దీని వల్ల కలిగే ప్రయోజనాల గురించి తెలిస్తే, వాసన వచ్చినా పరవాలేదు. వాడేద్దామని ఫిక్సయిపోతారట. శరీరంలోని అవయవాలకే కాకుండా బయట కనిపించే చర్మానికి కూడా ఆరోగ్యం కలుగుజేస్తుందట. చర్మానికి ఆవనూనె ఎలా ఉపయోగపడుతుందో తెలుసుకుందాం.
ఆవనూనె అనేది ఆవగింజల నుండి తీసిన నూనె. ఇది ప్రధానంగా భారతదేశంలో, దక్షిణ ఆసియా వంటకాల్లో ఉపయోగిస్తుంటారు. ఈ నూనె నుంచి బలమైన వాసన, అధిక స్మోక్ పాయింట్ కలిగి ఉంటాయి. కేవలం వంటకాల్లోనే కాకుండా, ఆవనూనె చర్మ సంరక్షణలో కూడా అద్భుతమైన ఔషధంగా ఉపయోగపడుతుంది. ఆయుర్వేదంలో ఇది నిరూపితమైంది కూడా. ఎన్నో చర్మ సమస్యలకు దీనిని మంచి పరిష్కారంగా చెప్తుంటారు.
ఆవనూనెలో చర్మానికి అవసరమైన ఫ్యాటీ ఆమ్లాలు, విటమిన్లు, ఖనిజాలు ఉంటాయి. ఇవి ఉండటం వల్ల చర్మం బాగా తేమగా ఉంటుంది. దాంతో చర్మం మృదువుగా, సున్నితంగా మారుతుంది.
కేవలం సంరక్షించేందుకు మాత్రమే కాకుండా, ఆవనూనె చర్మంలోని ఇన్ఫ్లమేటరీ గుణాలతో ఎగ్జిమా వంటి చర్మ సమస్యలతో పోరాడుతుంది. తరచూ వినియోగించడం వల్ల ఎగ్జిమా వంటి సమస్యలు కనుమరుగవుతాయి.
ఆవనూనెలో కొన్ని ప్రత్యేకమైన మూలకాలు ఉన్నాయి. ఇవి బ్యాక్టీరియా, ఫంగస్ వంటి క్రిములు పెరిగిన చోట రుగ్మతలు, మొటిమలు, అథ్లెట్స్ ఫుట్ వంటి సమస్యలను తగ్గించడంలో సహాయపడతాయి.
ఆవనూనె విటమిన్లు, ఖనిజాలు, ఫ్యాటీ ఆమ్లాలతో చర్మం స్థితిస్థాపకతను పెంచి, చర్మంపై మెరుపును సమం చేస్తుంది. అంతేకాకుండా మసకబారిన చర్మాన్ని, చర్మంపై ఏర్పడిన మచ్చలను తగ్గిస్తుంది.
ఆవనూనెతో మసాజ్: కొద్దిగా ఆవనూనెను వేడి చేసి, చర్మంపై సున్నితంగా రుద్దండి. 15-20 నిమిషాల పాటు ఉంచి, నీటితో శుభ్రం చేసుకోండి. ఈ విధంగా రోజూ, ముఖ్యంగా చల్లటి కాలంలో చేయవచ్చు.
ఆవనూనె - తేనె మాస్క్: 1 టేబుల్ స్పూన్ తేనెను 1 టీ స్పూన్ ఆవనూనెతో కలపండి. ముఖం మీద అప్లై చేసి, 20 నిమిషాల పాటు ఉంచి, శుభ్రం చేసుకోండి. చర్మంపై ముడతలు, కాలుష్యం కారణంగా దెబ్బతిన్న చర్మానికి ఉపశమనం కలిగిస్తుంది.
ఆవనూనె - పసుపు మాస్క్: 1 టీ స్పూన్ ఆవనూనె, 1 టేబుల్ స్పూన్ శనగపిండి, ½ టీస్పూన్ పసుపు పొడి, 2 టేబుల్ స్పూన్స్ పెరుగు కలిపి ముఖం మీద అప్లై చేయండి. 15-20 నిమిషాల పాటు ఉంచుకున్న తర్వాత శుభ్రం చేయండి. ఇది చర్మాన్ని ప్రకాశవంతంగా, మచ్చలను నిర్మూలించడంలోనూ సహాయపడుతుంది.
సంబంధిత కథనం