Mushroom Fried Rice: మష్రూమ్ ఫ్రైడ్ రైస్ రెసిపీ ఇలా చేశారంటే రుచి అద్భుతంగా ఉంటుంది, ఒక్కసారి చేసి చూడండి-mushroom fried rice recipe in telugu know how to make this rice ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Mushroom Fried Rice: మష్రూమ్ ఫ్రైడ్ రైస్ రెసిపీ ఇలా చేశారంటే రుచి అద్భుతంగా ఉంటుంది, ఒక్కసారి చేసి చూడండి

Mushroom Fried Rice: మష్రూమ్ ఫ్రైడ్ రైస్ రెసిపీ ఇలా చేశారంటే రుచి అద్భుతంగా ఉంటుంది, ఒక్కసారి చేసి చూడండి

Haritha Chappa HT Telugu
Published Feb 17, 2025 11:39 AM IST

Mushroom Fried Rice: మీకు పుట్టగొడుగులు అంటే ఇష్టమా? అయితే వాటితో మష్రూమ్ ఫ్రైడ్ రైస్ వండి చూడండి. రుచిగా ఉంటుంది. పైగా రెసిపీ చాలా సులువు.

మష్రూమ్ ఫ్రైడ్ రైస్ రెసిపీ
మష్రూమ్ ఫ్రైడ్ రైస్ రెసిపీ (Dindigul Food Court)

పుట్టగొడుగుల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అప్పుడప్పుడు వీటితో వండిన వంటకాలు తినాల్సిన అవసరం ఉంది. ఇక్కడ మేము మష్రూమ్ ఫ్రైడ్ రైస్ రెసిపీ ఇచ్చాము. ఇది చాలా రుచిగా ఉంటుంది. మిగిలిపోయిన అన్నంతో కూడా ఈ మష్రూమ్ ఫ్రైడ్ రైస్ చేసుకోవచ్చు. ఎక్కువగా పెళ్లిళ్లలో దీన్ని వడ్డిస్తూ ఉంటారు. ఇంట్లోనే సింపుల్‌గా మష్రూమ్ ఫ్రైడ్ రైస్ రెసిపీ ఎలాగో తెలుసుకోండి.

మష్రూమ్ ఫ్రైడ్ రైస్ రెసిపీకి కావాల్సిన పదార్థాలు

పుట్టగొడుగులు - 200 గ్రాములు

నూనె - రెండు స్పూన్లు

ఆవాలు - ఒక స్పూను

పచ్చిమిర్చి - రెండు

ఉల్లిపాయలు - రెండు

కరివేపాకులు - గుప్పెడు

పసుపు - అర స్పూను

కారం - ఒక స్పూను

ధనియాలు - ఒక స్పూను

ఉప్పు - రుచికి సరిపడా

క్యాప్సికం - ఒకటి

కొత్తిమీర తరుగు - మూడు స్పూన్లు

నీళ్లు - ఒక గ్లాసు

వండిన అన్నం - రెండు కప్పులు

బటర్ - మూడు స్పూన్లు

మిరియాల పొడి - ఒక స్పూను

మష్రూమ్ ఫ్రైడ్ రైస్ రెసిపీ

1. మష్రూమ్ ఫ్రైడ్ రైస్ వండేందుకు ముందుగానే బాస్మతి రైస్ ను అన్నంలా వండి పొడిపొడిగా ఆరబెట్టుకోవాలి.

2. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేయాలి.

3. ఆ నూనెలో ఆవాలు, నిలువుగా కోసిన పచ్చిమిర్చి, సన్నగా కోసినా ఉల్లిపాయలు, గుప్పెడు కరివేపాకులు వేసి బాగా వేయించాలి.

4. అవి రంగు మారేవరకు వేయించుకోవాలి. ఇప్పుడు పసుపు కారం వేసి బాగా కలపాలి.

5. ఆ తర్వాత ధనియాల పొడి కూడా వేసి బాగా కలుపుకోవాలి.

6. ముందుగా కోసి పెట్టుకున్న పుట్టగొడుగుల ముక్కలను ఇందులో వేసి బాగా కలపాలి.

7. అలాగే క్యాప్సికం తరుగును కూడా ఇందులో వేసి కలుపుకోవాలి.

8. కొంచెం కొత్తిమీర తరుగును కూడా వేసి కలపాలి.

9. ఇప్పుడు ఇవి ఉడకడానికి సరిపడా ఒక గ్లాసు నీటిని వేసి పైన మూత పెట్టి బాగా ఉడకనివ్వాలి.

10. రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకోవాలి. నీరు ఇంకిపోయి ఇది ఇగురులాగా చిక్కగా అయినప్పుడు బటర్ వేసి బాగా కలపాలి.

11. ఇప్పుడు ముందుగా వండి పెట్టుకున్నా అన్నాన్ని దీనిపై వేయాలి.

12. కొత్తిమీర తరుగు, మిరియాల పొడి చల్లి ఈ మొత్తాన్ని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేయాలి.

13. అంతే టేస్టీ మష్రూమ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయినట్టే. ఒక్కసారి తిన్నారంటే మీకు మళ్లీ మళ్లీ తినాలనిపించేలా ఉంటుంది. దీంతో రైతా కూడా కలిపి తింటే ఆ రుచే వేరు.

పుట్టగొడుగులు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిని సులువుగా వండుకోవచ్చు. ఇది త్వరగా ఉడికిపోతాయి కూడా. డయాబెటిస్, క్యాన్సర్ వంటి రోగాలు రాకుండా అడ్డుకోవడంలో పుట్టగొడుగులు ముందుంటాయి. గుండె ఆరోగ్యానికి కూడా ఇవి ఎంతో మేలు చేస్తాయి. గర్భధారణ సమయంలో పోలేట్ అధికంగా కావాల్సి వస్తుంది. అందుకే గర్భం ధరించిన స్త్రీలు పుట్టగొడుగులు తినేందుకు ప్రయత్నించాలి. పుట్టగొడుగుల కూర లేదా ఇలా పుట్టగొడుగుల ఫ్రైడ్ రైస్ వంటివి తింటే రుచిగా ఉంటాయి. పుట్టగొడుగుల్లోని పోషకాలు కూడా శరీరానికి అందుతాయి.

Haritha Chappa

TwittereMail
హరిత హిందూస్తాన్ టైమ్స్‌లో చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్లో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, తెలుగు సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్‌వర్క్‌లలో పని చేశారు. ప్రింట్, డిజిటల్ జర్నలిజంలో 17 ఏళ్ల అనుభవం ఉంది. 2023 డిసెంబరు నుంచి హిందూస్థాన్ టైమ్స్‌లో ఆస్ట్రాలజీ, లైఫ్‌స్టైల్ సెక్షన్ల బాధ్యతలు చూస్తున్నారు.
Whats_app_banner

సంబంధిత కథనం