Muntha Masala: బయట అమ్మే ముంత మసాలాను ఇంట్లో ఐదు నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోవచ్చు, రెసిపీ ఎలాగో తెలుసుకోండి-muntha masala recipe in telugu know how to make this street food ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Muntha Masala: బయట అమ్మే ముంత మసాలాను ఇంట్లో ఐదు నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోవచ్చు, రెసిపీ ఎలాగో తెలుసుకోండి

Muntha Masala: బయట అమ్మే ముంత మసాలాను ఇంట్లో ఐదు నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోవచ్చు, రెసిపీ ఎలాగో తెలుసుకోండి

Haritha Chappa HT Telugu
Nov 12, 2024 11:30 AM IST

Muntha Masala: ముంత మసాలా పేరు చెబితేనే నోరూరిపోతుంది. దీనికోసం ప్రతి సాయంత్రం బయటకు వెళ్లి తినేవారు ఎంతోమంది. దీన్ని ఇంట్లోనే సులువుగా చేసుకోవచ్చు.

ముంత మసాలా రెసిపీ
ముంత మసాలా రెసిపీ

ముంత మసాలాకు అభిమానులు ఎక్కువ. ముంత మసాలా బండి కనిపిస్తే చాలు... చుట్టూ పది మంది మూగిపోతారు. అంతగా దీన్ని ఇష్టపడతారు. సాయంత్రం వేళ సమోసాలు, బజ్జీలు, తిన్నట్టే ముంత మసాలా తినే వారి సంఖ్య కూడా ఎక్కువే. నిజానికి ముంత మసాలా ఆరోగ్యానికి మీరే చేస్తుంది. ఇందులో ఉండే పోషక విలువలు కూడా ఎక్కువే. పానీ పూరితో పోలిస్తే ముంత మసాలా తినడమే ఆరోగ్యానికి అన్ని రకాలుగా మంచిది. దీన్ని తినడం కోసం బయటికి వెళ్లాల్సిన పనిలేదు. ఇంట్లోనే చాలా సులువుగా చేసుకోవచ్చు. ముందు మసాలా రెసిపీ ఎలాగో తెలుసుకోండి.

ముంత మసాలా రెసిపీకి కావాల్సిన పదార్థాలు

కార్న్ ఫ్లాక్స్ - అరకప్పు

మరమరాలు - రెండు కప్పులు

ఉల్లిపాయ - ఒకటి

టమాటా - ఒకటి

పచ్చిమిర్చి తరుగు - రెండు స్పూన్లు

కొత్తిమీర తరుగు - రెండు స్పూన్లు

ఉప్పు - రుచికి సరిపడా

వేరుశెనగ పలుకులు - పావుకప్పు

కారం - అర స్పూను

ధనియాల పొడి - ఒక స్పూను

జీలకర్ర పొడి - అర స్పూను

చాట్ మసాలా - ఒక స్పూను

నిమ్మరసం - ఒక స్పూను

నెయ్యి - రెండు స్పూన్లు

ముంత మసాలా రెసిపీ

1. ఉల్లిపాయ, టమాటాలో సన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలి.

2. కొత్తిమీర, పచ్చిమిర్చిని కూడా తరిగి అన్నిటిని ఒక ప్లేట్లో ఉంచుకోవాలి.

3. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి మరమరాలను వేసి చిన్న మంట మీద వేయించుకోవాలి.

4. తర్వాత వాటిని తీసి పక్కన పెట్టుకోవాలి.

5. ఇప్పుడు అదే కళాయిలో పావు కప్పు నూనె వేసి కార్న్ ఫ్లాక్స్‌ను వడియాల్లా వేయించుకొని తీసి పక్కన పెట్టుకోవాలి.

6. ఆ తర్వాత వేడెక్కిన అదే నూనెలో వేరుశెనగ పలుకులను కూడా వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయాలి.

7. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి.

8. ఆ బౌల్లో వేయించిన మరమరాలు, కార్న్ ఫ్లాక్స్ వేయాలి.

9. అందులోనే సన్నగా తరిగిన ఉల్లిపాయలు, వేయించి పెట్టుకున్న పల్లీలు, టమోటోలు, పచ్చిమిర్చి తరుగు, కొత్తిమీర తరుగు, రుచికి సరిపడా ఉప్పు, అర స్పూన్ కారం, జీలకర్ర పొడి, చాట్ మసాలా, ధనియాల పొడి వేసి కలుపుకోవాలి.

10. పైన నిమ్మరసం కూడా వేసి ఓసారి కలుపుకోవాలి.

11. అంతే టేస్టీ ముంత మసాలా రెడీ అయినట్టే.

12. ఇది తింటుంటే ఇంకా తినాలనిపిస్తుంది. స్పైసీగా కావాలనుకునేవారు పచ్చిమిర్చిని లేదా కారాన్ని పెంచుకుంటే సరిపోతుంది.

13. పిల్లలకు పెట్టేటప్పుడు కాస్త నెయ్యిని జోడించి పెడితే టేస్టీగా ఉంటుంది.

ముంత మసాలాలో మనం నిమ్మరసం, కొత్తిమీర, టమాట, పచ్చిమిర్చి, ఉల్లిపాయ... అన్నీ పచ్చివే వాడాము. ఇవన్నీ కూడా మన ఆరోగ్యానికి మేలే చేస్తాయి. అలాగే ధనియాల పొడి, జీలకర్ర పొడి కూడా వాడాము. ఇవి కూడా ఎన్నో పోషకాలను కలిగి ఉంటాయి. వేరుశెనగ పలుకులు మనకు శక్తిని అందిస్తాయి. సాయంత్రం పూట ఏదైనా తినాలనిపించినప్పుడు ఇలా మొత్తం చేసుకోండి. ఇది చాలా రుచిగా ఉంటుంది. తినాలన్న కోరికను పెంచుతుంది.

Whats_app_banner