మునగాకు కొత్తిమీర పచ్చడి రెసిపీ, ఇది సూపర్ ఫుడ్ తో సమానం ఎలా చేయాలంటే-munagaku kothimeera chutney recipe how to make this spicy pachadi ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  మునగాకు కొత్తిమీర పచ్చడి రెసిపీ, ఇది సూపర్ ఫుడ్ తో సమానం ఎలా చేయాలంటే

మునగాకు కొత్తిమీర పచ్చడి రెసిపీ, ఇది సూపర్ ఫుడ్ తో సమానం ఎలా చేయాలంటే

Haritha Chappa HT Telugu

మునగాకులు, కొత్తిమీర రెండు కూడా ఆరోగ్యానికి మేలు చేసేవే. ఈ రెండు కలిపి పచ్చడి చేస్తే అది సూపర్ ఫుడ్ అనే చెప్పుకోవాలి. రెసిపీ ఎలాగో తెలుసుకోండి.

మునగాకు కొత్తిమీర పచ్చడి రెసిపీ (Foodvedam/youtube)

మీకు పచ్చళ్ళు అంటే ఇష్టమా? స్పైసీగా మునగాకు కొత్తిమీర పచ్చడి ట్రై చేసి చూడండి. మునగాకులు, కొత్తిమీర.. రెండూ కూడా ఎన్నో పోషకాలతో నిండి ఉంటాయి. మునగాకులను సూపర్ ఫుడ్ అని పిలుచుకుంటారు. ఈ మునగాకులతో చేసే ఈ చట్నీని కూడా కచ్చితంగా సూపర్ ఫుడ్ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే మునాగాకుతో పాటూ కొత్తిమీరలో ఉండే పోషకాలు కూడా ఈli చట్నీలో లభిస్తాయి. మునగాకు కొత్తిమీర పచ్చడి రెసిపీ ఎలాగో తెలుసుకోండి.

మునగాకు కొత్తిమీర పచ్చడి రెసిపీకి కావలసిన పదార్థాలు

మునగాకులు - ఒక కప్పు

కొత్తిమీర - ఒక కప్పు

చింతపండు - ఉసిరికాయ సైజులో

ఎండుమిర్చి - నాలుగు

పచ్చిమిర్చి - నాలుగు

వెల్లుల్లి రెబ్బలు - పది

జీలకర్ర - ఒక స్పూను

ఉప్పు - రుచికి సరిపడా

నూనె - రెండు స్పూన్లు

పల్లీలు - పావు కప్పు

ఆవాలు - అర స్పూన్

జీలకర్ర - అర స్పూను

శనగపప్పు - అర స్పూను

మినప్పప్పు - అర స్పూను

కరివేపాకులు - గుప్పెడు

మునగాకులు కొత్తిమీర పచ్చడి రెసిపీ

1. మునగ ఆకులను, కొత్తిమీరను సన్నగా తరిగి శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి.

2. ఇప్పుడు స్టవ్ మీద ఒక కళాయి పెట్టి ఒక స్పూను నూనె వేసి అందులో మునగాకులను వేయించాలి.

3. ఇలా వేయించడం వల్ల మునగాకుల్లో ఉండే పచ్చిదనం తగ్గిపోతుంది.

4. ఇప్పుడు ఈ మునగాకులను తీసి పక్కన పెట్టుకోవాలి.

5. ఇప్పుడు అదే కళాయిలో వేరుశెనగ పలుకులు వేసి వేయించుకొని తీసి పక్కన పెట్టుకోవాలి.

6. ఇప్పుడు మరొక స్పూను నూనె వేసి అందులో ఎండుమిర్చి, పచ్చిమిర్చి, వెల్లుల్లి వేసి వేయించాలి.

7. అర స్పూను జీలకర్ర వేయించుకోవాలి. తర్వాత అందులో కొత్తిమీరను వేసి బాగా వేయించాలి.

8. రెండు నిమిషాలు వేయించాక ముందుగా వేయించి పెట్టుకున్న మునగా ఆకులను, పల్లీలను కూడా వేసి అందులో ఒకసారి వేసి వేయించి స్టవ్ ఆఫ్ చేసేయాలి.

9. ఇప్పుడు ఈ మిశ్రమం చల్లారాక మిక్సీ జార్లో వేసి మెత్తగా రుబ్బుకోవాలి.

10. రుబ్బిన మిశ్రమాన్ని ఒక గిన్నెలో వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేయాలి.

11. అందులో ఆవాలు, జీలకర్ర, శెనగపప్పు, మినప్పప్పు, రెండు వెల్లుల్లి రెబ్బలు, రెండు ఎండుమిర్చి, కరివేపాకులు వేసి వేయించి కొత్తిమీర ‌ మునగాకుల మిశ్రమం మీద వేయాలి.

12. దాన్ని బాగా కలుపుకోవాలి. అంతే టేస్టీ మునగాకుల కొత్తిమీర చట్నీ రెడీ అయినట్టే.

వేడివేడి అన్నంలో ఈ చట్నీ వేసుకొని తింటే అద్భుతంగా ఉంటుంది. అలాగే ఇడ్లీతో నంజుకున్నా, దోసతో తిన్నా అదిరిపోతుంది. పైగా దీనిలో పోషకాలు కూడా ఎక్కువ. కాబట్టి బ్రేక్ ఫాస్ట్ లోనైనా , అన్నంలోనైనా దీన్ని తినవచ్చు. ఎన్నో పోషకాలు శరీరానికి అందుతాయి.

Haritha Chappa

TwittereMail
హరిత హిందూస్తాన్ టైమ్స్‌లో చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్లో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, తెలుగు సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్‌వర్క్‌లలో పని చేశారు. ప్రింట్, డిజిటల్ జర్నలిజంలో 17 ఏళ్ల అనుభవం ఉంది. 2023 డిసెంబరు నుంచి హిందూస్థాన్ టైమ్స్‌లో ఆస్ట్రాలజీ, లైఫ్‌స్టైల్ సెక్షన్ల బాధ్యతలు చూస్తున్నారు. లింక్టిన్ లో కనెక్ట్ అవ్వండి https://www.linkedin.com/in/haritha-ch-288a581a8/

సంబంధిత కథనం