Mukesh and Neetha: సరదా షికారులోనూ సెక్యూరిటీతో అంబానీ దంపతులు, సూటుబూటులో ముఖేష్, నీతా లుక్ వివరాలు చూడండి-mukhesh neetha night walk video in switzerland lets decode their dressing ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Mukesh And Neetha: సరదా షికారులోనూ సెక్యూరిటీతో అంబానీ దంపతులు, సూటుబూటులో ముఖేష్, నీతా లుక్ వివరాలు చూడండి

Mukesh and Neetha: సరదా షికారులోనూ సెక్యూరిటీతో అంబానీ దంపతులు, సూటుబూటులో ముఖేష్, నీతా లుక్ వివరాలు చూడండి

Koutik Pranaya Sree HT Telugu
Aug 24, 2024 11:39 PM IST

Mukesh and Neetha:: నీతా అంబానీ, ముఖేష్ అంబానీలు కనీస భద్రతతో స్విట్జర్లాండ్‌లో సరదాగా విహరించారు. ఈ సరదా షికారు సమయంలో నీతా అంబానీ, ముఖేష్ అంబానీ వేసుకున్న దుస్తులను కూడా ఫ్యాషన్ ప్రియులు డీకోడ్ చేశారు. ఆ వివరాలన్నీ వీడియోతో సహా చూసేయండి.

స్విట్జర్లాండ్‌లో షికారులో అంబానీ దంపతులు
స్విట్జర్లాండ్‌లో షికారులో అంబానీ దంపతులు (Instagram)

రిలయన్స్ ఇండస్ట్రీస్ బిలియనీర్ ముఖేష్ అంబానీ, ఆయన సతీమణి నీతా అంబానీల స్విట్జర్లాండ్‌కు చెందిన ఓ వీడియో ఆన్‌లైన్ లో చక్కర్లు కొడుతోంది. స్విట్జర్లాండ్ వీధుల్లో కొద్దిమంది బాడీగార్డుల రక్షణతో నైట్ వాక్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్న జంట ఇందులో కనిపిస్తోంది. ఈ వీడియోతో పాటూ , వాళ్ల డ్రెస్సుల వివరాలూ చూడండి.

అంబానీల డ్రెస్సుల వివరాలు

అద్భుతమైన వస్త్రధారణ, లగ్జరీ జువెలరీ కలెక్షన్ కు పెట్టిన పేరైన నీతా అంబానీ నైట్ వాక్ కోసం ప్రకాశవంతమైన ఎరుపు రంగు కో-ఆర్డ్ దుస్తులను ఎంచుకున్నారు. ఈ వీడియోలో నీతా, ముఖేష్ అంబానీతో సాయంత్రం పూట ఫుట్‌పాత్ మీద విహరిస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. వేడుకకు హాజరైన తర్వాత ఈ జంట విశ్రాంతి కోసం నడుస్తున్నట్లు కనిపించింది. నీతా ఎరుపు రంగు దుస్తులను ఎంచుకోగా, ముఖేష్ అంబానీ బ్లేజర్, ప్యాంట్, లేత రంగు చొక్కాతో కూడిన నలుపు రంగు సూట్ ధరించాడు.

కాగా, నీతా అంబానీ కో-ఆర్డ్ దుస్తుల్లో ఫుల్ లెంగ్త్ స్లీవ్స్ తో కూడిన షార్ట్ కుర్తా, గోల్డెన్ బ్రోకేడ్ ప్యాటర్న్, రిలాక్స్డ్ సిల్హౌట్ వేసుకున్నారు. ఫ్లేర్డ్ ఫిట్ ఉన్న మ్యాచింగ్ ప్యాంట్ లుక్ ను పూర్తి చేసింది నీతా. లూజ్ హెయిర్, డిజైనర్ లగ్జరీ బ్యాగ్, స్లిప్ ఆన్ చెప్పులతో ఆమె లుక్ పూర్తయ్యింది.

అంబానీ కుటుంబం గురించి

ముఖేష్ అంబానీ, నీతా అంబానీల ముగ్గురు పిల్లలు ఇషా అంబానీ, అనంత్ అంబానీ, ఆకాష్ అంబానీ. వారి పెద్ద కుమార్తె ఇషా, ఆనంద్ పిరమల్ ను వివాహం చేసుకుంది. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. కుమారుడు కృష్ణ, కుమార్తె పేరు ఆదియా. ఆకాశ్ అంబానీ శ్లోకా మర్చంట్ ను వివాహం చేసుకున్నారు. పృథ్వీ, వేదలకు వీళ్లు తల్లిదండ్రులు. కాగా, అనంత్ అంబానీ ఇటీవల రాధికా మర్చంట్ ను వివాహం చేసుకున్నారు.

అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ వివాహం

అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ జూలై 12న వివాహం చేసుకున్నారు. ముంబైలో జరిగిన ఈ వివాహ వేడుకకు బాలీవుడ్ తారలు, అంతర్జాతీయ ప్రముఖులు, ప్రపంచ నాయకులు, రాజకీయ నాయకులు హాజరయ్యారు. ఈ వివాహ వేడుకలు మూడు రోజుల పాటు కొనసాగాయి. ఈ జంట శుభ్ ఆశీర్వాద్ వేడుకకు ప్రధాని మోదీ హాజరయ్యారు. జూలైలో వివాహానికి ముందు, ఈ జంట రెండు ప్రీ-వెడ్డింగ్ వేడుకలను కూడా చేసుకున్నారు. జామ్ నగర్ లో మూడు రోజుల తారలతో కూడిన అంగరంగ వేడుక, ఇటలీలో అత్యంత లగ్జరీ వేడుకలు జరిగాయి.

టాపిక్