Muharram 2023 । మొహర్రం ఎప్పుడు ప్రారంభం? దీని విశిష్టతను తెలుసుకోండి!-muharram 2023 when is islamic new year begins in india know significance of holy month ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Muharram 2023 । మొహర్రం ఎప్పుడు ప్రారంభం? దీని విశిష్టతను తెలుసుకోండి!

Muharram 2023 । మొహర్రం ఎప్పుడు ప్రారంభం? దీని విశిష్టతను తెలుసుకోండి!

HT Telugu Desk HT Telugu
Published Jul 19, 2023 10:09 AM IST

Muharram 2023: మొహర్రంను ఇస్లామిక్ న్యూ ఇయర్ లేదా అల్ హిజ్రీ లేదా అరబిక్ న్యూ ఇయర్ అని పిలుస్తారు. ముస్లింలలో ముహర్రంకు చాలా ప్రాముఖ్యత ఉంది.మొహర్రం తేదీ, ఇతర విశేషాలను తెలుసుకోండి.

Muharram 2023
Muharram 2023 (ht photo)

Muharram 2023: మొహర్రం అనేది ఇస్లామిక్ క్యాలెండర్‌లో మొదటి నెల. ఇది కూడా ముస్లింలకు మరొక పవిత్ర మాసం. మొహర్రం మొదటి రోజును ఇస్లామిక్ నూతన సంవత్సరం లేదా అల్ హిజ్రీ లేదా అరబిక్ న్యూ ఇయర్ అని పిలుస్తారు. ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మక్కా నుండి మదీనాకు ఈ సమయంలో వలస వచ్చినందున ఈ నెల ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింలకు గొప్ప ప్రాముఖ్యతను కలిగి ఉంది. ఇది ముస్లింలలో ఇరు వర్గాలైన సున్నీ, షియాలకు కూడా చారిత్రక ప్రాముఖ్యతను కలిగి ఉంది.

ఇస్లామిక్ క్యాలెండర్ చంద్రుడి గమనంపై ఆధారపడి ఉంటుంది, కాబట్టి గ్రెగోరియన్ క్యాలెండర్‌లో ప్రతి సంవత్సరం మొహర్రం తేదీలు మారుతూ ఉంటాయి. నెలవంక ఆధారంగా ఆయా తేదీలను నిర్ణయిస్తారు. సాధారణంగా ముస్లింలకు సంబంధించిన ఏ పండుగ లేదా పవిత్ర దినమైనా సౌదీ అరేబియా, యుఎఇ, ఒమన్ మొదలైన గల్ఫ్ దేశాలలో నెలవంక గమనించిన ఒక రోజు తర్వాత భారతదేశం, పాకిస్తాన్, బంగ్లాదేశ్, సింగపూర్, ఇండోనేషియా, మలేషియా, మొరాకో దేశాలలోని ముస్లింలు గమనిస్తారు. 2023లో మొహర్రంను జూలై 19న, బుధవారం నాడు జరుపుకుంటున్నారు. ఈ ప్రకారంగా భారతదేశంలో జూలై 20 నుంచి మొహర్రం ప్రారంభం అవుతుందని నివేదికలు వెల్లడించాయి.

ముహర్రం విశిష్టత

ముస్లింలలో ముహర్రంకు చాలా ప్రాముఖ్యత ఉంది. ఈ రోజు ప్రవక్త ముహమ్మద్ మనవడు హుస్సేన్ ఇబ్న్ అలీ అమరత్వాన్ని స్మరించుకుంటారు. ముహర్రం ముస్లిం ఉమ్మాకు జ్ఞాపకార్థం కూడా. మొహర్రం నెలలోని 10వ రోజును అషూరా దినంగా పాటిస్తారు, ఈ అషూరా నాడే కర్బలా యుద్ధం జరిగింది, ఈ యుద్ధంలో మహమ్మద్ ప్రవక్త ప్రియమైన మనవడైన ఇమామ్ హుస్సేన్ ను అత్యంత క్రూరంగా హత్యచేస్తారు. పోరాటం నిషేధించిన నెలలో అతను దారుణంగా హత్యకు గురవుతారు. ఇది తదనంతరం మొదటి ఇస్లామిక్ రాజ్య స్థాపనకు దారితీసింది. హుస్సేన్ ఇబ్న్ అలీ మరణాన్ని స్మరిస్తూ మొహర్రంను పాటిస్తారు. ముస్లింలు ఆషూరాకు ముందు 9వ రోజు ఉపవాసం పాటిస్తారు. ఈ పవిత్రమైన మాసాన్ని హదీసులలో అల్లాహ్ నెలగా కూడా పేర్కొంటారు.

ముహర్రంను సున్నీ, షియా ముస్లింలు భిన్నంగా పాటిస్తారు. షియాలు ఈ పవిత్ర దినంను సంతాప దినంగా పాటిస్తారు. షియా ముస్లింలు సంతాప ఊరేగింపులు, శోకం- భాధను వ్యక్తీకరిస్తారు, బాధతో ఛాతీ కొట్టుకోవడం, తమ శరీరాన్ని కోసుకోవడం, మసీదుల్లో సంతాప ఆచారాలు పాటించడం చేస్తారు.

మరోవైపు ప్రవక్త ముహమ్మద్ ప్రవక్త మూసా ఈ రోజు రోజాను ఆచరించినందున సున్నీలు ఉపవాసం 'సున్నత్' పాటిస్తారు.

Whats_app_banner

సంబంధిత కథనం