Motorola X30 Pro । 200 మెగాపిక్సెల్ భారీ కెమెరా కలిగిన మొట్టమొదటి స్మార్ట్‌ఫోన్!-motorola x30 pro 5g smartphone with massive 200mp camera launched ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  Lifestyle  /  Motorola X30 Pro 5g Smartphone With Massive 200mp Camera Launched

Motorola X30 Pro । 200 మెగాపిక్సెల్ భారీ కెమెరా కలిగిన మొట్టమొదటి స్మార్ట్‌ఫోన్!

HT Telugu Desk HT Telugu
Aug 11, 2022 06:10 PM IST

మోటోరోలా కంపెనీ తాజాగా చైనాలో Motorola Razr 2022., Motorola X30 Pro అలాగే Motorola S30 Pro అనే మూడు కొత్త స్మార్ట్‌ఫోన్లను విడుదల చేసింది.

Motorola X30 Pro
Motorola X30 Pro

మోటోరోలా కంపెనీ తాజాగా చైనాలో నిర్వహించిన లాంచ్ ఈవెంట్‌లో భాగంగా మూడు కొత్త స్మార్ట్‌ఫోన్ మోడల్‌లను విడుదల చేసింది. ఇందులో భాగంగా అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఫోల్డబుల్ ఫోన్ Razr 2022తో పాటు Motorola X30 Pro అలాగే Motorola S30 Pro అనే ప్రీమియం రేంజ్ స్మార్ట్‌ఫోన్‌లు ఉన్నాయి.

Moto X30 Pro స్మార్ట్‌ఫోన్ గురించి మాట్లాడుకుంటే.. ఇది Motorola బ్రాండ్ నుంచి వచ్చిన సరికొత్త ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్. దీనిలో కెమెరాలు ప్రధాన హైలైట్ అని చెప్పాలి. 200 మెగాపిక్సెల్ కెమెరాతో వచ్చిన ప్రపంచంలోనే మొట్టమొదటి స్మార్ట్‌ఫోన్‌ ఇది.

Moto X30 Pro పూర్తి RAW డొమైన్ ప్రైమరీ కలర్ విజన్‌ని కలిగి ఉంది. ఇందులోని కెమెరా గత సంవత్సరం Samsung టెక్నాలజీతో అభివృద్ధి చేసిన HP1 ISOCELL సెన్సార్‌ను ఉపయోగిస్తుంది. అంతేకాకుండా ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్‌ను కలిగి ఉంది. సెన్సార్ 30fps వద్ద గరిష్టంగా 8K రిజల్యూషన్‌లో వీడియో రికార్డింగ్‌లను కూడా షూట్ చేయగలదు.

ఈ స్మార్ట్‌ఫోన్‌లోని బ్యాటరీ 125W ఫాస్ట్ ఛార్జింగ్ టెక్‌కు సపోర్ట్ చేస్తుంది. ఇది కేవలం 7 నిమిషాల్లో 50% అలాగే 19 నిమిషాల్లో 100% వరకు ఛార్జ్ చేయగలదని కంపెనీ పేర్కొంది.

హార్డ్‌వేర్ పరంగా Moto X30 Pro 4nm ప్రాసెస్ ఆధారంగా Qualcomm Snapdragon 8+ Gen 1 SoC నుండి శక్తిని పొందుతుంది. ఈ ప్రాసెసర్ గరిష్టంగా 12GB వరకు LPDDR5 RAM + 512GB స్టోరేజ్ వరకు UFS 3.1 అంతర్గత నిల్వతో వస్తోంది.

సరికొత్త Moto X30 Proలో ఇంకా ఎలాంటి ఫీచర్లు, స్పెసిఫికేషన్లు ఉన్నాయి. ధర ఎంత మొదలగు వివరాలు ఇక్కడ తెలుసుకోండి.

Moto X30 Pro 5G స్మార్ట్‌ఫోన్‌ ఫీచర్స్, స్పెసిఫికేషన్స్

  • 144Hz రిఫ్రెష్ రేట్ కలిగిన 6.67 అంగుళాల pOLED FHD+ డిస్‌ప్లే
  • 8GB/12GB RAM, 128 GB/256GB/512GB ఇంటర్నల్ స్టోరేజ్ సామర్థ్యం
  • Qualcomm Snapdragon 8+ Gen 1 ప్రాసెసర్
  • వెనకవైపు 200 మెగా పిక్సెల్ + 50MP + 12MP ట్రిపుల్ కెమెరా, ముందు భాగంలో 60 MP సెల్ఫీ షూటర్‌
  • ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టమ్
  • 4610 mAh బ్యాటరీ సామర్థ్యం, 125W ఛార్జర్

8GB RAM + 128 GB స్టోరేజ్ వేరియంట్ ధర 3699 యువాన్లు (సుమారు రూ. 44,000)

రెండవ వేరియంట్ 12GB RAM+256GB స్టోరేజ్ ధర 4199 యువాన్లు (సుమారు రూ. 49,000)

హై-ఎండ్ వేరియంట్ 12GB RAM+512GB స్టోరేజ్ ధర 4499 యువాన్ (సుమారు రూ. 53,000).

అయితే ఈ ఫోన్ విక్రయాలు ఎప్పట్నించి ప్రారంభమవుతాయనేది కంపెనీ వెల్లడించాల్సి ఉంది.

WhatsApp channel

సంబంధిత కథనం

టాపిక్