వాటర్ ప్రూఫ్ డిజైన్.. మెరుగైన కెమెరాతో Moto G22 బడ్జెట్ స్మార్ట్‌ఫోన్-moto g22 smartphone go on sale from april 13 ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  Lifestyle  /  Moto G22 Smartphone Go On Sale From April 13

వాటర్ ప్రూఫ్ డిజైన్.. మెరుగైన కెమెరాతో Moto G22 బడ్జెట్ స్మార్ట్‌ఫోన్

HT Telugu Desk HT Telugu
Apr 10, 2022 02:49 PM IST

Moto G22 పేరుతో G-సిరీస్‌లో సరికొత్తగా స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లో విడుదల చేసింది Motorola కంపెనీ

Moto G22 Smartphone
Moto G22 Smartphone (Motorola)

Motorola కంపెనీ చాలారోజుల తర్వాత భారతదేశంలో తమ బ్రాండ్ నుంచి వచ్చిన G-స్మార్ట్‌ఫోన్ సిరీస్‌ను రిఫ్రెష్ చేసింది. Moto G22 పేరుతో G-సిరీస్‌లో సరికొత్తగా మరొక స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లో విడుదల చేసింది. వాటర్ ప్రూఫ్ డిజైన్, మంచి కెమెరా ఫీచర్లతో పాటు బడ్జెట్ ధరలో ఈ ఫోన్ వస్తుంది. ముఖ్యంగా Realme, Xiaomi బ్రాండ్ ఫోన్లతో పోటీపడేందుకు Moto G22ను మోటోరోలా విడుదల చేసింది. అయితే ఇందులో ర్యామ్-స్టోరేజ్ వేరియంట్లు లేకపోవడం గమనార్హం.

మరి ఈ సరికొత్త Moto G22 ఎలాంటి ఫీచర్లు, స్పెసిఫికేషన్లను అందిస్తుంది. ధరలు ఎంతమేర ఉన్నాయి లాంటి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.

Moto G22 స్మార్ట్‌ఫోన్‌ ఫీచర్స్, స్పెసిఫికేషన్స్

90Hz రిఫ్రెష్ రేట్ కలిగిన 6.51 అంగుళాల LCD HD+ డిస్‌ప్లే

4GB RAM, 64GB ఇంటర్నల్ స్టోరేజ్ సామర్థ్యం (మైక్రో ఎస్డీ కార్డుతో 1TB వరకు స్టోరేజ్ విస్తరించుకోవచ్చు)

మీడియాటెక్ Helio G37 ప్రాసెసర్

వెనకవైపు 50 మెగా పిక్సెల్ కెమెరా, ముందు భాగంలో 16 MP సెల్ఫీ షూటర్‌

ఆండ్రాయిడ్ 11 ఆపరేటింగ్ సిస్టమ్

5000 mAh బ్యాటరీ సామర్థ్యం, 20W ఛార్జర్

ధర రూ. 10,999/-

కనెక్టివిటీపరంగా Wi-Fi 5, ఛార్జింగ్ కోసం టైప్-C పోర్ట్, Google అసిస్టెంట్ సపోర్ట్, సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ఇంకా బ్లూటూత్ v5 ఉన్నాయి.

Moto G22 కాస్మిక్ బ్లాక్, ఐస్‌బర్గ్ బ్లూ, మింట్ గ్రీన్ అనే మూడు కలర్ ఛాయిస్ లలో లభిస్తోంది. ఇది ఫ్లిప్‌కార్ట్‌లో ఏప్రిల్ 13 నుంచి కొనుగోలుదారులకు అందుబాటులో ఉంటుంది.

WhatsApp channel

సంబంధిత కథనం

టాపిక్