మనసులో కలిగే భావాలకు స్పందించడం మామూలే. కానీ, అది కొన్నిసార్లు మన ఆరోగ్యానికి హానికరంగా మారి, భవిష్యత్‌కు సమస్యగా మారుతుందట. మనసుకు ఎదుటివారు నచ్చకపోయినా లేదా వారి ప్రవర్తన ఇబ్బందిగా అనిపించినా కోపం తెచ్చుకోవడం, ద్వేషం పెంచుకోవడం వంటివి మన ప్రమేయం లేకుండానే జరిగిపోతాయి. ఇలా మరొకరిపై ద్వేషంతో ఉండటం వల్ల మన భవిష్యత్‌కు ఉపయోగపడే ప్రేరణ క్రమంగా తగ్గిపోతుందట.
మనసులో ఎవరినైనా ద్వేషించటం అనేది అది ఎంత చిన్నదైనా, మన శక్తిని ఇతరులతో పోల్చి తిట్టుకోవడం మన లక్ష్యాలపై దృష్టి ఉంచడాన్ని చెడగొడుతుంది. ఇది నిజంగా ప్రతిఒక్కరూ మన జీవితంలో ఎదుర్కొనే సమస్యే, దాన్ని సమర్థంగా ఎదుర్కొనడమే ముఖ్యం. మరి దీనిని అధిగమించడం కోసం ఏం చేయాలంటే..
మనసు ఎప్పుడూ ఆ విషయం చుట్టూనే తిరుగుతుంది: వాళ్లు చెప్పిన మాటలు, చేసిన పనులు గుర్తుకు వస్తూ ఉంటాయి. కాబట్టి మీ సొంత విషయాలు, కెరీర్ కు ఉపయోగపడే వాటి గురించి ఆలోచించలేరు.
ఆ నెగటివ్ ఎమోషన్లు మనలో ఉన్న ఎనర్జీని ఖాళీ చేస్తాయి. ఏదో కోల్పోయామనే భావనను పెంచుతాయి.
మీరు సాధించాలనుకునే లక్ష్యంపై ఫోకస్ తగ్గిపోతుంది. మన అభివృద్ధి మీద కంటే ఎక్కువగా ద్వేషించే వాళ్ల మీదే మనసును ఎక్కువగా కేంద్రీకరించి ఉంచుతాం.
ఈ భావోద్వేగం ఎక్కువయితే మానసికంగా నీరసంగా అనిపించొచ్చు. తరచూ మూడ్ ఛేంజెస్ రావడం, డిమోటివేషన్ గా అనిపించడం వంటివి జరుగుతుండొచ్చు.
ఈ సమస్యల నుంచి బయటపడటం కష్టమే అయినా, ప్రయత్నించి సాధించవచ్చు. అదెలా అంటే,
ద్వేషం అనేది చాలా సార్లు బాధ నుంచి పుడుతుంది. ఒకసారి అటువంటి భావం ఎందుకు వచ్చిందో అర్థం చేసుకునే ప్రయత్నం చేయడం. మీ మనసు క్రమంగా తేలికపడుతుంది. ఈ ప్రక్రియ వాళ్ల కోసం కాదు – నీ మనశ్శాంతి కోసమేనని గుర్తించాలి.
వాళ్లను మార్చలేము. కానీ ఆ ఆలోచనల్ని పక్కకుపెడతే మనదైన లక్ష్యాల్ని సాధించడానికి, మన బలాన్ని పెంచుకోవాలని గుర్తించాలి. దాని కోసం మీ జర్నీ గురించి మాత్రమే ఆలోచించండి.
ద్వేషానికి కారణమైన బాధని ప్రేరణగా మలచుకోవాలి. కోపం మనల్ని శాసించేదే కానీ, దానిని అదుపు చేయగలిగితే మనకు ఇంధనంలా మారుతుంది. అందుకోసం యోగా, వర్కౌట్, ఆర్ట్, స్టడీస్ లాంటివి చేస్తుంటే, మెల్లగా దాన్ని పాజిటివ్ ప్యాషన్‌గా మార్చుకోవచ్చు.
వాళ్లతో మాట్లాడకపోయినా మంచిదే. కుదరకపోతే ఎమోషనల్ డిస్టన్స్ పెట్టుకో. నచ్చిన వాళ్లతో టైం స్పెండ్ చేయడం, మోటివేషన్ గా అనిపించే పుస్తకాలు చదవడం లేదా వినడం వంటివి చేయాలి. వాటితో పాటుగా "వాళ్ల ప్రవర్తన వాళ్లని సూచిస్తుంది, నన్ను కాదు” అనే భావనను మనసులో ఉంచుకోవాలి.
నీ జీవితంలో నువ్వు కావాలనుకునే అత్యుత్తమ వ్యక్తి ఎలా స్పందిస్తే బాగుంటుందో ఊహించుకో. దాని ప్రకారంగా నీవు ప్రవర్తించడానికి ప్రయత్నించు.
ఇలా ద్వేషంతో మిమ్మల్ని మీరు తగ్గించుకోకుండా మోటివేట్ తో పనిచేసి అనుకున్న లక్ష్యాలు సాధించండి.
సంబంధిత కథనం