Morning Vs Evening Shower : ఉదయం స్నానం చేయడం మంచిదా? లేదంటే సాయంత్రం మంచిదా?
Morning Vs Evening Shower : చాలా మంది ఉదయాన్నే తలస్నానం చేయడానికి ఇష్టపడతారు. మరోవైపు సాయంత్రం స్నానం చేయడం వల్ల రాత్రి బాగా నిద్ర పడుతుంది. ఎప్పుడు స్నానం చేస్తే ఏం ప్రయోజనాలు ఉన్నాయి?
కొంతమందికి ఉదయం నిద్రలేచిన తర్వాత స్నానం చేయడం అలవాటు ఉంటుంది. కొంతమందికి సాయంత్రం పూట స్నానం చేయడం అలవాటు. కొందరు రాత్రి పని నుండి ఇంటికి వచ్చిన తర్వాత స్నానం చేస్తారు. ఈ విధంగా మనలో ప్రతి ఒక్కరికి భిన్నమైన అలవాట్లు ఉంటాయి. ఉదయం, సాయంత్రం స్నానం చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి?
ట్రెండింగ్ వార్తలు
నిద్ర ప్రకారం చూసుకుంటే.. ఉదయం తలస్నానం చేయడం కంటే రాత్రిపూట తలస్నానం చేయడం మంచిది. ఇది శరీరానికి తాజాదనాన్ని ఇస్తుందనడంలో సందేహం లేదని ఓ పరిశోధన చెబుతుంది. ఆ పరిశోధన ప్రకారం రాత్రిపూట గోరువెచ్చని నీటితో స్నానం చేయడం వల్ల మీ శరీర ఉష్ణోగ్రతను కొంతమేర నియంత్రించవచ్చు. మీకు మంచి ప్రశాంతమైన నిద్ర లభిస్తుంది. నిద్రకు ఉపక్రమించే ముందు గోరువెచ్చని నీటితో స్నానం చేయండి. నిద్రలేమితో బాధపడేవారు పడుకునే గంట ముందు స్నానం చేయవచ్చు. ఇది శరీర ఉష్ణోగ్రతను నియంత్రిస్తుంది. మంచి నిద్ర వస్తుంది.
మరోవైపు ఉదయం నిద్రలేచిన తర్వాత తలస్నానం చేయడం కూడా మంచిది. ఎందుకంటే నీరు మన శరీరానికి శక్తినిస్తుంది. రోజంతా మనల్ని శక్తివంతంగా ఉంచుతుంది అని వైద్యులు చెబుతున్నారు. మీ నిద్ర సమస్యకు రాత్రి స్నానం ఉత్తమం. రోజంతా యాక్టివ్‌గా ఉండటానికి మీరు ఉదయాన్నే స్నానం కూడా చేయవచ్చు.
చర్మ నిపుణులు చెప్పేదేమిటంటే మార్నింగ్ షవర్, ఈవినింగ్ షవర్ అనే తేడా లేదు. స్నానాల వల్ల చర్మంలో ఎలాంటి మార్పు ఉండదు. కానీ గోరువెచ్చని నీళ్లతో స్నానం చేస్తే గాఢ నిద్ర వస్తుంది. మంచి నిద్ర మీ చర్మానికి మేలు చేస్తుంది.
కొంతమంది రోజంతా పని చేసిన తర్వాత చర్మంలోని అలసట, మురికిని వదిలించుకోవాలని కోరుకుంటారు. వారు పడుకోవడానికి అసౌకర్యంగా భావిస్తారు. అందుకే పడుకునే ముందు తలస్నానం చేయడం వీరికి అలవాటు. ఉదయం నిద్రలేచిన తర్వాత వ్యాయామం చేసి చెమట పోవాలంటే స్నానం చేయడం మంచిది. ఇది రోజంతా మనల్ని సంతోషపరుస్తుంది.
మీ జుట్టు రకాన్ని బట్టి స్నానాన్ని కూడా ఎంచుకోవచ్చు. ఆయిల్ హెయిర్ ఉన్నవారు ఉదయాన్నే స్నానం చేయవచ్చు. ఇది మీ జుట్టు చిక్కుకుపోకుండా సహాయపడుతుంది. లేదంటే ఒత్తుగా ఉండే జుట్టు కోసం ఎప్పుడు కావాలంటే అప్పుడు తలస్నానం చేసుకోవచ్చు. రాత్రి స్నానం చేసిన తర్వాత హెయిర్ డ్రైయర్‌లను ఉపయోగించడం మానుకోండి. వారానికి ఒకసారి కంటే ఎక్కువ షాంపూని ఉపయోగించవద్దు.
రాత్రిపూట స్నానం చేసిన తర్వాత మీ జుట్టును పూర్తిగా ఆరబెట్టండి. లేకపోతే, ఇది మైక్రోబస్‌లకు కారణమవుతుంది. చుండ్రు వస్తుంది. మీకు జిడ్డుగల జుట్టు ఉంటే ఉదయాన్నే తలస్నానం చేయడం మంచిది.