Moongdal Idli: పిల్లల కోసం పెసరపప్పు ఇడ్లీ రెసిపీ, బ్రేక్‌ఫాస్ట్‌కు అదిరిపోతుంది
Moongdal Idli: ఇడ్లీ పిల్లలకు చాలా ఆరోగ్యకరమైన బ్రేక్ ఫాస్ట్. ఇడ్లీ రుచికరంగా, మంచి పోషకాలతో నిండి ఉంటుంది. ఇది సులభంగా జీర్ణమవుతుంది, మీ పిల్లలు దీనిని ఇష్టపడతారు.

పిల్లలకు ఇడ్లీ మంచి బ్రేక్ ఫాస్ట్ రెసిపీ. దీన్ని లంచ్ బాక్సు రెసిపీగా వాడుకోవచ్చు. ఇది మెత్తటి, తేలికపాటి వంటకం. పిల్లలకు ఇడ్లీ బాగా నచ్చుతుంది. ఇడ్లీలు చాలా పోషకమైనవి. మధ్యాహ్న భోజనానికి కూడా ఇవి ఉత్తమమైనవి. దీనిలో కేలరీలు తక్కువగా ఉంటాయి. కాబట్టి ఇవి పొట్టపై సున్నితమైన ప్రభావాన్ని చూపిస్తుంది. ఇడ్లీల్లో ప్రోబయోటిక్స్ అధికంగా ఉంటాయి. ఇవి సులభంగా జీర్ణం అవుతాయి. ఇడ్లీలతో అనేక రకాల చట్నీలను జత చేసి తినవచ్చు. ఇంట్లోనే సులభంగా తయారుచేసి పిల్లల మధ్యాహ్న భోజనానికి ప్యాక్ చేయచ్చు.
పెసరపప్పు ఇడ్లీ రెసిపీకి కావలసిన పదార్థాలు
పెసరపప్పు - ఒక కప్పు
పెరుగు - పావు కప్పు
నూనె - రెండు స్పూన్లు
ఆవాలు - అర స్పూను
జీలకర్ర - అర స్పూను
శనగ పప్పు - అర స్పూను
కారం - పావు స్పూను
అల్లం - చిన్న ముక్క
కరివేపాకులు - గుప్పెడు
జీడిపప్పులు - గుప్పెడు
క్యారెట్ తురుము - ఒక స్పూను
కొత్తిమీర తరుగు - ఒక స్పూను
ఉప్పు - రుచికి సరిపడా
ఇంగువ - చిటికెడు
వంట సోడా - అర స్పూను
పెసరపప్పు ఇడ్లీ రెసిపీ
- ఒక కప్పు పెసరపప్పును 2 గంటలు బాగా నానబెట్టాలి. ఆ తరువాత మిక్సీలో వేసి మెత్తగా రుబ్బుకోవాలి.
2. పెసరపప్పు రుబ్బులో పావు కప్పు పెరుగు వేసి బాగా కలపాలి.
3. స్టవ్ మీద కళాయి పెట్టి రెండు స్పూన్ల నూనె వేయాలి.
4. అందులో ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, ఎండు మిర్చి తరుగు, అల్లం తరుగు, జీడిపప్పులు తరుగు వేసి కలపాలి.
5. అవి వేగాక తరిగిన క్యారెట్ వేసి వేయించాలి.
6. ఈ వేయించిన మిశ్రమాన్ని పెసరపప్పు పిండిలో వేసి కలుపుకోవాలి.
7. రుచి కోసం చిటికెడు ఇంగువ, ఉప్పు కలపాలి. వంటసోడా కూడా అన్నీ బాగా కలపాలి.
8. ఇడ్లీ ప్లేట్లకు నూనె రాసి పిండిని ఇడ్లీల్లా వేసుకోవాలి.
9. ఇడ్లీలను ఆవిరి మీద ఉడికించాలి. పావుగంటకు మెత్తని పెసరపప్పు ఇడ్లీ రెడీ అయిపోతుంది.
పెసరపప్పును బ్రేక్ ఫాస్ట్ లో తినడం వల్ల ఆరోగ్యానికి మంచివి. దీన్ని తరచూ తినడం వల్ల ఎన్నో పోషకాలు లభిస్తాయి. పిల్లలకు పెసరపప్పు ఇడ్లీలు తినడం వల్ల జీర్ణ సమస్యలు రాకుండా ఉంటాయి. పెసరపప్పులో ప్రొటీన్లు అధికంగా ఉంటాయి. కాబట్టి పిల్లలు, పెద్దలూ ఇద్దరికీ ఈ పప్పు మేలే చేస్తుంది. చర్మానికి, జుట్టుకు కూడా పెసరపప్పు ఎంతో ఉపయోగం. బరువు తగ్గాలనుకునే వారు కూడా పెసరపప్పును ఆహారంలో భాగం చేసుకోవాలి.