Uric Acid: శరీరంలో పెరిగిన యూరిక్ యాసిడ్‌ను తక్షణమే తగ్గించే శక్తి ఉన్నది ఈ పప్పుకే, కీళ్ల నొప్పులు తగ్గడం ఖాయం-moong and urad dals has the power to instantly reduce the increased uric acid in the body ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Uric Acid: శరీరంలో పెరిగిన యూరిక్ యాసిడ్‌ను తక్షణమే తగ్గించే శక్తి ఉన్నది ఈ పప్పుకే, కీళ్ల నొప్పులు తగ్గడం ఖాయం

Uric Acid: శరీరంలో పెరిగిన యూరిక్ యాసిడ్‌ను తక్షణమే తగ్గించే శక్తి ఉన్నది ఈ పప్పుకే, కీళ్ల నొప్పులు తగ్గడం ఖాయం

Haritha Chappa HT Telugu

Uric Acid: యూరిక్ యాసిడ్ శరీరం పెరగడం ఆరోగ్యకరం కాదు. దీనివల్ల ఆర్థరైటిస్ వంటి సమస్యలు వస్తాయి. పెసరపప్పు, మినప్పప్పును ఆహారంలో చేర్చుకుంటే యూరిక్ యాసిడ్ తగ్గుతుంది.

యూరిక్ ఆమ్లం తగ్గించడం ఎలా? (Pixabay)

యూరిక్ యాసిడ్ శరీరంలో పెరగడం అనేది తీవ్రమైన సమస్యలకు కారణం అవుతుంది. దీన్ని ఎక్కువ కాలం పాటు నిర్లక్ష్యం చేస్తే ఎముకలు, గుండెకు సంబంధించిన సమస్యలు కూడా ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. యూనివర్సిటీ ఆఫ్ రోచెస్టర్ మెడికల్ సెంటర్ చెబుతున్న ప్రకారం మహిళల్లో యూరిక్ యాసిడ్ 6 mg కన్నా ఎక్కువగా ఉండకూడదు. అదే పురుషుల్లో అయితే 7 mg కంటే ఎక్కువగా ఉండకూడదు. అంతకన్నా ఎక్కువగా అంటే అది ప్రమాదకరమనే చెప్పుకోవాలి.

యూరిక్ యాసిడ్ ఎక్కువైతే కనిపించే లక్షణాలు

శరీరంలో యూరిక్ యాసిడ్ అధికంగా ఉంటే కొన్ని రకాల లక్షణాలు కనిపిస్తాయి. ముఖ్యంగా కీళ్ల నొప్పులు ఎక్కువగా వేధిస్తాయి. నడవడంలో కూడా ఇబ్బందిగా అనిపిస్తుంది. మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడడం, కీళ్ళల్లో వాపు, కీళ్ళు దృఢంగా మారి ఇబ్బంది పెట్టడం, జ్వరం రావడం, కండరాల నొప్పులు, విపరీతమైన నీరసం వంటివి కనిపిస్తాయి. ఈ సమస్య రోజురోజుకీ తీవ్రంగా మారుతుంది.

యూరిక్ ఆమ్లం ఎందుకు పెరుగుతుంది?

యూరిక్ యాసిడ్ పెరగడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. అందులో ప్రధానమైనది ప్రోటీన్, ప్యూరిన్లు అధికంగా ఉండే ఆహార పదార్థాలను తీసుకోవడం అని చెప్పుకుంటారు. కొమ్ము శెనగలు, కిడ్నీ బీన్స్, కందిపప్పులు వంటి ఆహారాలలో ప్యూరిన్లు అధికంగా ఉంటాయి. ఇవి యూరిక్ యాసిడ్ స్థాయిలను పెంచేస్తాయి. అలాగే క్యాన్సర్ వంటి అనేక వ్యాధులతో బాధపడుతున్న వారు కూడా యూరిక్ యాసిడ్ స్థాయిలను అధికంగా కలిగి ఉంటారు.

వయసు పెరిగే కొద్దీ కిడ్నీలు ప్రోటీన్ పూర్తిగా జీర్ణం చేసుకోలేవు. దీనివల్ల యూరిక్ యాసిడ్ స్థాయిలు కూడా పెరుగుతూ ఉంటాయి. అందుకే యూరిక్ యాసిడ్లు పెరగడం అనే సమస్య వయసు పెరిగిన వారిలో ఎక్కువగా కనిపిస్తుంది. అయితే ఇప్పటి కాలంలో కొంతమంది యువతలో కూడా ఇది ఉంది.

ఈ పప్పులను తినండి

యూరిక్ యాసిడ్ నియంత్రించాలంటే ఆల్కహాల్ పూర్తిగా మానేయాలి. అలాగే అధిక ప్రోటీన్ ఉండే ఆహారాలను మితంగా తినాలి. యూరిక్ యాసిడ్ నియంత్రించడానికి పెసరపప్పు, మినప్పప్పు అద్భుతంగా పనిచేస్తాయి. ఎందుకంటే మినప్పప్పు, పెసరపప్పులో ప్యూరిన్లు, ప్రోటీన్లు తక్కువగా ఉంటాయి. కాబట్టి యూరిక్ యాసిడ్ స్థాయిలు కూడా చాలా వరకు తగ్గుతాయి.

యూరిక్ యాసిడ్ ను నియంత్రించడానికి తగినంత నీరుని తీసుకోవడం కూడా చాలా ముఖ్యం. శరీరం డీహైడ్రేషన్ బారిన పడితే యూరిక్ ఆమ్లం స్థాయిలు పెరిగిపోతాయి. కాబట్టి యూరిక్ యాసిడ్ స్థాయిలను నియంత్రించడానికి నీటిని ఎక్కువగా తాగాలి. అలాగే క్రమం తప్పకుండా వ్యాయమం చేయాలి. ఎక్కువగా పండ్లు, కూరగాయలు వంటివి తింటూ ఉండాలి. శరీరంలో ప్రోటీన్, ప్యూరీన్ స్థాయిలు ఎక్కువైపోతే యూరిక్ యాసిడ్ స్థాయిలు కూడా పెరిగిపోతాయి.

(గమనిక: అధ్యయనాలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ కోసం ఇక్కడ అందిస్తున్నాం. ఇది కేవలం సమాచారం మాత్రమే. ఇది వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి సందేహాలుంటే వెంటనే వైద్యులను సంప్రదించండి.)

హరిత హిందూస్తాన్ టైమ్స్‌లో చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్లో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, తెలుగు సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్‌వర్క్‌లలో పని చేశారు. ప్రింట్, డిజిటల్ జర్నలిజంలో 17 ఏళ్ల అనుభవం ఉంది. 2023 డిసెంబరు నుంచి హిందూస్థాన్ టైమ్స్‌లో ఆస్ట్రాలజీ, లైఫ్‌స్టైల్ సెక్షన్ల బాధ్యతలు చూస్తున్నారు. లింక్టిన్ లో కనెక్ట్ అవ్వండి.

సంబంధిత కథనం