Skin Infections Home Remedies। చర్మంపై దురద, దద్దుర్లు నివారణకు సహజమైన నివారణలు ఇవిగో!
Monsoon Skin Infections- Home Remedies: వర్షాకాలంలో చర్మ వ్యాధులు ఎక్కువవుతాయి. నివారణకు కొన్ని ఇంటి నివారణలు కూడా ప్రభావవంతంగా పనిచేస్తాయి. అవేమిటో ఇక్కడ తెలుసుకోండి.
Monsoon Skin Infections- Home Remedies: వర్షాకాలంలో ఉండే చల్లటి, ఆహ్లాదకరమైన వాతావరణం మనస్సుకు ప్రశాంతతను కలిగిస్తుంది, కానీ తరచుగా శరీరం, దుస్తులు తడిగా ఉండటం, గాలిలోని తేమ కారణంగా చర్మ సమస్యలు ఎక్కువవుతాయి. ఈ సీజన్ లో అనేక ఇతర అనారోగ్య సమస్యలతో పాటు వివిధ రకాల చర్మ వ్యాధులు, అంటు వ్యాధుల వ్యాప్తి నిజంగా చికాకును తెప్పిస్తుంది. ఈ వానాకాలంలో స్కిన్ ఇన్ఫెక్షన్ల కారణంగా చర్మంపై దద్దుర్లు రావడం, చర్మం ఎరుపెక్కడం, దురద కారణంగా మంట వాపు పెరగటం జరుగుతాయి.
ట్రెండింగ్ వార్తలు
ఈ చర్మ సమస్యల నివారణకు కొన్నిసార్లు ఎలాంటి క్రీములు, పౌడర్లు వాడినా ప్రయోజనం ఉండదు, పైపెచ్చు ఇన్ఫెక్షన్ మరింత పెరిగే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఈ చర్మ వ్యాధులు వర్షాకాలంలో త్వరగా నయం కావు, ఇవి అంటువ్యాధులు కాబట్టి ఒకరి నుంచి మరొకరికి వ్యాపించే ప్రమాదమూ ఉంది. చర్మ సమస్యల నివారణకు కొన్ని ఇంటి నివారణలు కూడా ప్రభావవంతంగా పనిచేస్తాయి. అవేమిటో ఇక్కడ తెలుసుకోండి.
వేప ఆకుల పేస్ట్
వేప ఆకుల్లో యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉంటాయి, ఇవి స్కిన్ ఇన్ఫెక్షన్ వంటి సమస్యలను దూరం చేయడంలో సహాయపడతాయి. వర్షాకాలంలో స్కిన్ రాష్ సమస్య రాకుండా ఉండాలంటే 10-15 వేప ఆకులను తీసుకుని పేస్ట్ లా చేసి ప్రభావిత ప్రాంతంలో 10 నిమిషాల పాటు అప్లై చేయాలి. నిర్ణీత సమయం తర్వాత చర్మాన్ని నీటితో కడిగేసుకోవాలి. ఇలా చర్మ సమస్య తగ్గేవరకు 2-3 రోజులు ప్రయత్నించండి.
కొబ్బరి నూనె
చర్మానికి కొబ్బరినూనె వల్ల కలిగే ప్రయోజనాలు అనేకం ఉంటాయి. కొబ్బరి నూనెలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ల్ఫమేటరీ గుణాలు చాలా వరకు చర్మ సమస్యలను దూరం చేయడంలో సహాయపడతాయి. వర్షాకాలంలో వచ్చే చర్మపు దద్దుర్లు నయం కావాలంటే కొబ్బరి నూనెను కొద్దిగా వేడి చేసి, ఆ తర్వాత గోరువెచ్చని నూనెను చర్మానికి రాసుకోవాలి. ఈ రెమెడీతో వల్ల దురద, దద్దుర్లు రెండూ నయమవుతాయి.
అలోవెరా జెల్
కలబంద జెల్‌లో ఉండే యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్, యాంటీ వైరల్ లక్షణాలు చర్మ సంబంధిత సమస్యలను దూరం చేయడంలో సహాయపడతాయి. అలోవెరా జెల్‌ను చర్మానికి ప్రభావిత ప్రాంతంలో అప్లై చేయడం ద్వారా చర్మాన్ని చల్లబరుస్తుంది. తద్వారా దురద, దద్దుర్లు సమస్య నుండి ఉపశమనం పొందడంలో సహాయపడుతుంది. కలబంద జెల్‌ను దద్దుర్లు ఉన్న చోట వర్తించి, కొన్ని నిమిషాల పాటు అలాగే ఉంచుకోవాలి, ఆ తర్వాత చర్మాన్ని నీటితో శుభ్రం చేసుకోండి.
ఇక్కడ అందించిన చిట్కాలు సాధారణ దురద, దద్దుర్లను నయం చేసే ప్రభావం కలిగినవి. ఒకవేళ మీకు ఈ చిట్కాలు ఫలితాలను ఇవ్వకపోతే, చర్మ వైద్య నిపుణులను సంప్రదించాలి. వారు సమస్య ఏమిటి అనేది క్షుణ్ణంగా పరీక్షించి, అందుకు తగినట్లుగా సరైన చికిత్సను అందిస్తారు.
సంబంధిత కథనం