Monsoon Hacks : వర్షాకాలంలో బట్టలనుంచి వాసన వస్తుందా? ఇవి ఫాలో అయిపోండి..
వర్షాకాలంలో బట్టలు సరిగా ఆరవు. ఒకవేళ ఆరిపోయాయి అనుకున్నా.. వాటి నుంచి ఒకరకమైన దుర్వాసన వస్తుంది. అయితే ఈ స్మెల్‌ను కొన్ని ఇంటి చిట్కాలతో ఈజీగా వదిలించుకోవచ్చు. మరి ఆ చిట్కాలేమిటో ఒక్కసారి చుద్దామా?
Monsoon Hacks : వర్షాకాలం వచ్చేసింది. మండే వేడి నుంచి ఉపశమనం లభించినా.. వర్షాకాలంలో కొన్ని సమస్యలు ఎదుర్కోవాల్సిందే. దీనిలో ముఖ్యమైన విషయం ఏమిటంటే.. బట్టలు. వర్షాకాలంలో బట్టలు ఉతికితే ఆరవు. సరికదా వాటినుంచి ఒకరకమైన వాసన వస్తూ ఉంటుంది. పూర్తిగా ఎండకపోవడం వల్లే ఇలాంటి స్మెల్ వస్తుంది. కాబట్టి బట్టలు ఉతికేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని.. ఆ చిట్కాలతో బట్టల నుంచి దుర్వాసనను పొగొట్టవచ్చని అంటున్నారు నిపుణులు.
వోడ్కా ఉపయోగించండి
అవునండి వోడ్కాను తాగడానికే కాదు. కొద్దిగా వోడ్కాను తీసుకొని ఖాళీ స్ప్రే కంటైనర్‌లోకి బదిలీ చేయండి. దానికి కొంచెం నీరు కలపండి. అప్పుడు అది పల్చగా అవుతుంది. ఆపై దానిని నేరుగా బట్టలపై చల్లండి. ఇది వర్షాకాలంలో బట్టలనుంచి వచ్చే వాసనను ఒక్కసారిగా వదిలిస్తుంది.
బేకింగ్ సోడా + వెనిగర్
బేకింగ్ సోడా మీ అనేక సమస్యలకు పరిష్కారం చూపుతుంది. బట్టలు ఉతకడం నుంచి మీరు ఆశించే తాజా వాసనను అందించేవరకు ఇది బాగా ఉపయోగపడుతుంది. బేకింగ్ సోడాతో కలిపిన వెనిగర్ శక్తివంతమైన ఫ్రెషనర్‌గా పనిచేస్తుంది. మీరు చేయాల్సిందల్లా మీ డిటర్జెంట్‌లో బేకింగ్ సోడా, వెనిగర్ మిశ్రమాన్ని కలిపి.. మీ బట్టలు ఉతకడానికి ఉపయోగించండి.
కాఫీ గింజలు, ఎసెన్స్ ఆయిల్..
కాఫీ తాజా సువాసనను ఎవరు ఇష్టపడరు? మీరు బట్టలు ఆరేసుకునే స్థలంలో ఓపెన్ కంటైనర్‌లో ఫ్రెష్‌గా చేసిన గ్రౌండ్ కాఫీని వదిలివేయవచ్చు. దానిలో ఎసెన్స్ ఆయిల్ వేస్తే.. దాని సువాసన మరింత బాగుంటుంది. అది మీ క్లాత్స్‌కి ఉన్న చెడు వాసనను వదిలిస్తుంది.
నిమ్మరసం
ఈ టైమ్‌లో మీరు ప్రయత్నించే మరొక హ్యాక్ నిమ్మరసం. ఇది గృహ అవసరాలకు సంబంధించిన అనేక సమస్యలను పరిష్కరిస్తుంది. ఆమ్ల స్వభావాన్ని కలిగి ఉండటం వలన.. నిమ్మరసం దుర్వాసన కలిగించే శిలీంధ్రాలను నివారిస్తుంది. మీ బట్టలు తాజా వాసన వచ్చేలా చేస్తుంది. మీరు మీ బట్టలు ఉతికేటప్పుడు డిటర్జెంట్‌తో కొంచెం నిమ్మరసాన్ని కలిపండి.
సంబంధిత కథనం
టాపిక్